Hyderabad: రౌడీషీటర్ నగర బహిష్కరణ..
ABN , Publish Date - Oct 16 , 2025 | 08:15 AM
రౌడీషీటర్‌ను నగరం నుంచి ఆరు నెలలపాటు బహిష్కరిస్తూ రాచకొండ సీపీ సుధీర్‌బాబు ఆదేశాలు జారీ చేశారు. నల్లగొండ జిల్లాకు చెందిన కొడుదుల నవీన్ రెడ్డి (32)పై పలు పోలీస్ స్టేషన్‌లలో క్రిమినల్ కేసులు నమోదయ్యాయి.
- ఆదేశాలు జారీ చేసిన రాచకొండ సీపీ సుధీర్‌బాబు
హైదరాబాద్ సిటీ: రౌడీషీటర్‌ను నగరం నుంచి ఆరు నెలలపాటు బహిష్కరిస్తూ రాచకొండ సీపీ సుధీర్‌బాబు(Rachakonda CP Sudheer Babu) ఆదేశాలు జారీ చేశారు. నల్లగొండ జిల్లాకు చెందిన కొడుదుల నవీన్ రెడ్డి (32)పై పలు పోలీస్ స్టేషన్‌లలో క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. రౌడీషీటర్‌గా పేరుగాంచిన ఇతడు దాడి, హత్యాయత్నం, బెదిరింపులు, అల్లర్లు వంటి పలు కేసుల్లో నిందితుడు.

శాంతిభద్రతలకు విఘాతం కలిగించడంతోపాటు చట్టవిరుద్ధ కార్యకలాపాల్లో పాల్గొంటుండడంతో నగరం నుంచి బహిష్కరించారు. ఇబ్రహీపంట్నం ఏసీపీ(Ibrahim Pantnam ACP) ద్వారా నోటీసు అందిన ఏడు రోజుల్లోగా నగరం నుంచి ఎందుకు బహిష్కరించకూడదో కారణం తెలిపాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..
మంత్రి కొండా సురేఖ ఇంటి ముందు హైడ్రామా
వచ్చే ఐదేళ్లలో రూ 45000 కోట్ల పెట్టుబడులు
Read Latest Telangana News and National News