Share News

Police: వేసవిలోనే చోరీలు అధికం.. జర జాగ్రత్త సుమా..

ABN , Publish Date - May 14 , 2025 | 10:52 AM

వేసవికాలం వచ్చిందంటే.. కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిందే. ఎందుకంటే.. దొంగతనాలకు ఇదొక సీజన్ లాంటిదని చెప్పవచ్చు. వేసవిలోనే వివాహాలు, సమ్మర్ ట్రిప్ వంటింవి ఉంటాయి. ఇది దొంగలకు అనువైన అవకాశం. అయితే... ఈ సీజన్‏లో జర జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

Police: వేసవిలోనే చోరీలు అధికం.. జర జాగ్రత్త సుమా..

- అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్న పోలీసులు

హైదరాబాద్: నగరంలో కొన్ని దశాబ్దాలుగా జరుగుతున్న దొంగతనాలను పరిశీలిస్తే వేసవిలోనే ఎక్కువగా జరుగుతున్నాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా గస్తీని పెంచుతున్న పూర్తి స్థాయిలో వేసవిలో దొంగలను పోలీసులు నిలువరించలేక పోతున్నారు.

విహారయాత్రలు అధికం..

వేసవి అంటే ముందుగా గుర్తొచ్చేది విహార యాత్రలు. పిల్లలకు పరీక్షలు పూర్తికాగానే సరదాగా వారితో కలిసి దూరప్రాంతాలకు, తీర్థయాత్రలకు వెళ్లిరావాలని భావిస్తుంటారు. నిత్యం పని ఒత్తిడితో సతమతమయ్యేవారు వారం పది రోజుల పాటు సేదతీరడానికి వేసవి సెలవుల్లో ప్లాన్‌ చేసుకోవడం సాధరణ విషయమే. దీన్ని దొంగలు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఎండకాలం ఎక్కువగా డోర్లు, కిటికీలు తెరిచిఉంచడం మామూలే ఇదికూడా దొంగలకు అనుకూలంగా మారుతుంది. ఇంట్లో ఒకరిద్దరున్న సందర్భంలో వారిని మాటలతో మభ్యపెట్టి చోరీలకు పాల్పడుతున్న ఘటనలు ఎక్కువగా వేసవిలోనే జరుగుతున్నాయి. వేసవి అందరికి హాలీడేస్‌ అయితే దొంగలకు మాత్రం వర్కింగ్‌ డేస్‌ అని పోలీసులు పేర్కొంటున్నారు.

ఈ వార్తను కూడా చదవండి: BJP: హైడ్రా అధికారుల తీరుతో ఇళ్లలోకి నీళ్లు..


తాళాలు వేసిన ఇళ్లే టార్గెట్‌

దొంగలు ముఖ్యంగా తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్‌ చేస్తున్నారు. ఇళ్లల్లో ఎవ్వరు లేరని నిర్ధారించుకుని ఇంటి ప్రధాన ద్వారానికి ఉన్న తాళాన్ని పగలగొట్టి చోరీలకు పాల్పడుతున్నారు. అల్వాల్‌ల్లో తాజాగా సూర్యానగర్‌ ప్రాంతంలో ఓ కరడుగట్టిన పాత నేరస్థుడు ఇంట్లోకి జోరపడి నిద్రిస్తున్న వృద్ధ దంపతులను హత్యచేసి నగదు, విలువైన బంగారు అభరణాలను దోచుకుని పారిపోయారు. ఈ విషయంలో పోలీసులు చాకచక్యంగా వ్యహారించి 48 గంటల్లోనే ఛేదించి నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. సైబరాబాద్‌ సీపీ అవినాష్‌ మహాంతి, మేడ్చల్‌ జోన్‌ డీసీపీ కోటిరెడ్డి అల్వాల్‌ పోలీసులను అభినందించారు.


city7.jpg

అప్రమత్తంగా ఉండాలి

విహారయాత్రలు, ఇతర ప్రాంతాలకు వెళ్లాలనుకునేవారు ఇళ్లకు తాళం వేయాల్సిన పరిస్థితి ఉంటే ముందుగా పోలీసులకు సమాచారం ఇవ్వండి. దీంతో వారు తిరిగి వచ్చేవరకు నిఘా పెడుతాం. దాంతో పాటు చుట్టుపక్కలవారికి తప్పనిసరిగా సమాచారం ఇవ్వాలి. విలువైన నగదు, బంగారు అహరణాలను బ్యాంక్‌ లాకర్‌లో భద్రపర్చుకోవాలి. అల్వాల్‌ స్టేషన్‌ హౌజ్‌ ఆఫీసర్‌ నంబర్‌ 9490617215, డీఐ నంబర్‌ 9490617375లో మెసేజ్‌, వాట్సప్‌ లేదా నేరుగా ఫోన్‌ చేసి సమాచారం ఇవ్వాలి.

- రాహుల్‌దేవ్‌, అల్వాల్‌ స్టేషన్‌హౌజ్‌ ఆఫీసర్‌


ఈ వార్తలు కూడా చదవండి

ముగిసిన యుద్ధం మిగిల్చిన ప్రశ్నలు

కృష్ణా జలాల పునఃపంపిణీ తెలంగాణ జన్మహక్కు

ఛీ.. నువ్వు భర్తవేనా.. మద్యం కోసం ఫ్రెండ్స్ వద్దకి భార్యని పంపుతావా?

నీలి చిత్రాల్లో నటిస్తే లక్షలు ఇస్తామని.. వివాహితను హోటల్‌కు పిలిపించి..!

దారుణం.. పురుషాంగం కోసుకుని ఎంబీబీఎస్ విద్యార్థి ఆత్మహత్య!

Read Latest Telangana News and National News

Updated Date - May 14 , 2025 | 10:52 AM