Share News

Hyderabad: పలాస టు మహారాష్ట్ర.. వయా హైదరాబాద్‌

ABN , Publish Date - Apr 29 , 2025 | 09:30 AM

ఆంధ్రప్రదేశ్‏లోని పలాస నుంచి మహారాష్ట్రకు హైదరాబాద్ మీదుగా గంజాయిని రవాణా అవుతున్న విషయం బట్టబయలైంది. రూ. 2.5 కోట్ల విలువచేసే 410 కేజీల గంజాయిని పోలీసులు పల్లుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

Hyderabad: పలాస టు మహారాష్ట్ర.. వయా హైదరాబాద్‌

  • 410 కేజీలు.. రూ. 2.5 కోట్లు

  • గంజాయి సరఫరా

  • హైదరాబాద్‌లో పట్టివేత

  • ఇద్దరు స్మగ్లర్స్‌ అరెస్టు, పరారీలో మరొకరు

హైదరాబాద్‌ సిటీ: ఒడిశాలో కొనుగోలు చేసి.. పలాస నుంచి మహారాష్ట్రకు హైదరాబాద్‌(Hyderabad) మీదుగా రవాణా చేస్తున్న గంజాయిని ఎక్సైజ్‌ స్టేట్‌ టాస్క్‌ఫోర్స్‌ (ఎస్‌టీఎఫ్‌) పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరు స్మగ్లర్స్‌ను అరెస్టు చేసి వారి నుంచి 410 కిలోల గంజాయి, మినీ వ్యాను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం సరుకు విలువ రూ. 2.5కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. నాంపలిల్లోని ఆబ్కారీ భవన్‌లో ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ కమలాసన్‌రెడ్డి సోమవారం మీడియాకు వివరాలు వెల్లడించారు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: ఆ వంతెనలు త్వరలో అందుబాటులోకి..


మహారాష్ట్ర ఉస్మానాబాద్‌కు చెందిన గణేష్‌ రామస్వామి డ్రైవర్‌గా జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. అతనికి పలాస ప్రాంతానికి చెందిన రత్నాభాయి అనే గంజాయి వ్యాపారితో పరిచయం ఏర్పడింది. గణేష్‌ తన స్నేహితుడైన డ్రైవర్‌ విజయ్‌ శంకర్‌ కులకర్ణికి గంజాయి దందా గురించి తెలిపి సహకారం కోరాడు. అతను అంగీకరించడంతో మహీంద్రా మినీ వ్యానును కొనుగోలు చేసి ఒడిశా వెళ్లారు. రత్నాభాయి వద్ద గంజాయిని కొనుగోలు చేసి వ్యానులో లోడ్‌ చేయించి పలాస తీసుకొచ్చారు. గంజాయి మూటలపై పనస పళ్లను లోడ్‌ వేసి ఎవరికీ అనుమానం రాకుండా ప్యాక్‌ చేశారు.


city4.2.jpg

అయితే 20 రోజుల ముందుగానే విషయం తెలుసుకున్న ఎక్సైజ్‌ ఎస్‌టీఎఫ్‌ రెండు బృందాలుగా రంగంలోకి దిగి ముఠా కోసం మాటువేశారు. ఆదివారం మేడ్చల్‌ పరిధిలో ఓఆర్‌ఆర్‌ వద్ద మినీ వ్యానును గుర్తించి సోదా చేశారు. అందులో గంజాయి మూటలు బయటపడ్డాయి. ఇద్దరు స్మగ్లర్స్‌ను అరెస్టు చేసిన పోలీసులు సరుకును స్వాధీనం చేసుకున్నారు. గంజాయి వ్యాపారి రత్నాభాయి పరారీలో ఉన్నాడు. ఈ ఆపరేషన్‌లో పాల్గొని స్మగ్లర్స్‌ను అరెస్టు చేసి, పెద్ద ఎత్తున గంజాయిని స్వాధీనం చేసుకున్న సిబ్బందిని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ కమలాసన్‌రెడ్డి, జాయింట్‌ కమిషనర్‌ ఖురేషి అభినందించారు.


ఈ వార్తలు కూడా చదవండి

హైదరాబాద్‌-విజయవాడ హైవే 6 లేన్లుగా విస్తరణకు 5 వేల కోట్లు

డిజిటల్ లైంగిక నేరాలపై చట్టమేదీ?

చిన్నారి ప్రాణం తీసిన పల్లీ గింజ

Read Latest Telangana News and National News

Updated Date - Apr 29 , 2025 | 09:30 AM