Hyderabad: పెళ్లింట విషాదం.. చెరువులో మునిగి..
ABN , Publish Date - Oct 15 , 2025 | 11:00 AM
వ్యక్తి మృతితో పెళ్లింట విషాదఛాయలు అలుముకున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. బొంరాస్‌పేట్ మండలంలోని బురాన్‌పూర్ గ్రామానికి చెందిన గులాంరసూల్ కుమారుడు అర్షద్‌పాష వివాహం ఆదివారం గ్రామంలో జరిగింది.
హైదరాబాద్: వ్యక్తి మృతితో పెళ్లింట విషాదఛాయలు అలుముకున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. బొంరాస్‌పేట్(Bonraspet) మండలంలోని బురాన్‌పూర్ గ్రామానికి చెందిన గులాంరసూల్ కుమారుడు అర్షద్‌పాష వివాహం ఆదివారం గ్రామంలో జరిగింది. సోమవారం పరిగి(Parigi)లో జరిగిన డిన్నర్ వేడుకలో గులాం రసూల్ సమీప బంధువు హైదరాబాద్(Hyderabad)లోని గోల్కొండకు చెందిన అఖిల్‌పాష(42) కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు.
అనంతరం బురాన్‌పూర్‌కు వచ్చాడు. వేడుకల్లో భాగంగా హోలీ(Holi) ఆడిన బంధువులు, కుటుంబ సభ్యులు గ్రామ సమీపంలోని పెద్ద చెరువుకు స్నానాల నిమిత్తం వెళ్లారు. 15 మంది కుటుంబ సభ్యులు, బంధువులు చెరువులో స్నానాలు చేస్తుండగా అఖిల్‌పాష మునుగుతూ తేలుతూ చెరువు లోపలికి వెళ్లాడు. చెరువులో ఉన్న గుంతల కారణంగా నీటిలో మునిగిపోయాడు.
ఈత రాకపోవడంతో ప్రమాదవశాత్తు చెరువులో మునగడం గమనించి న కుటుంబ సభ్యులు నీటిలో నుంచి బయటకు తీసుకొచ్చారు. అప్పటికే అఖిల్‌పాష మృతి చెందాడు. అఖిల్‌పాష గోల్కొండలో ప్లంబర్. ఈవిషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కొడంగల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
షాకింగ్ .. ఎమ్‌టీవీ మ్యూజిక్ ఛానల్ మూసివేత
Read Latest Telangana News and National News