Share News

Ballari: భార్యను కడతేర్చి.. భర్త ఆత్మహత్య

ABN , Publish Date - Feb 22 , 2025 | 11:48 AM

నగరంలో ఓ వస్త్ర వ్యాపారి ఆత్మహత్య కలకలం రేపింది. బళ్లారి(Ballari) నగరంలోని గ్లాస్‌ బజార్‌లో నివాసం ఉండే శంకర్‌రావు (40) తన భార్య శాంతిదేవి(34)ని హత్య చేసి తానూ ఆత్మహత్యకు పాల్పడ్డారు.

Ballari: భార్యను కడతేర్చి.. భర్త ఆత్మహత్య

- బళ్లారిలో రాజస్థాన్ వ్యాపారి ఘాతుకం

- అనాథలైన ముగ్గురు పిల్లలు

బళ్లారి(బెంగళూరు): నగరంలో ఓ వస్త్ర వ్యాపారి ఆత్మహత్య కలకలం రేపింది. బళ్లారి(Ballari) నగరంలోని గ్లాస్‌ బజార్‌లో నివాసం ఉండే శంకర్‌రావు (40) తన భార్య శాంతిదేవి(34)ని హత్య చేసి తానూ ఆత్మహత్యకు పాల్పడ్డారు. బ్రూస్‌పేట్‌ పోలీసులు తెలిపిన వివరాల మేరకు శంకర్‌రావు 15 ఏళ్ల క్రితం రాజస్థాన్‌ నుంచి బళ్లారికి వచ్చి వస్త్ర వ్యాపారం చేస్తూ జీవించేవారు. వీరికి ముగ్గురు పిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగపిల్లవాడు. ఈ ముగ్గురూ శుక్రవారం ఉదయమే స్కూల్‌కు వెళ్లారు.

ఈ వార్తను కూడా చదవండి: Dy CM: డిప్యూటీ సీఎం భలే మాట అన్నారే.. ఆయన ఏమన్నారో తెలిస్తే..


శంకర్‌రావు(Shankar Rao) భార్య శాంతిని బాటిల్‌తో తలపై కొట్టడంతో తీవ్ర గాయాలతో ఆమె కన్నుమూసింది. తర్వాత శంకర్‌ రావు(Shankar Rao) ఫ్యాన్‌కు ఉరేసుకుని మృతి చెందారు. బడి నుంచి తిరిగి వచ్చిన పిల్లలు ఇంట్లో వచ్చి కిటికీలోంచి చూడగా తలుపువేసుకుని ఎవ్వరూ పలకలేదు. పిల్లలు కిటికీలోంచి తొంగి చూడగా ఫ్యాన్‌కు తండ్రి మృతదేహం వేలాడుతూ కలిపించింది. పిల్లలు గడ్డిగా ఏడుస్తుండడంతో చుట్టుపక్కలవారు వచ్చి పరిశీలించారు.


pandu2.2.jpg

అప్పటికే ఇద్దరూ చనిపోయినట్లు స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు వచ్చి ఇంటి తలుపులు పగలకొట్టి ఇంట్లోకి వెళ్లారు. ముందుగా భార్యను హత్య చేసి తరువాత తాను ఆత్మహత్యకు పాల్పడినట్లు వారు గుర్తించారు. శంకర్‌రావు ఘాతుకానికి ఎందుకు పాల్పడినారు అన్నది చర్చనీయాంశంగా మారింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు.


ఈవార్తను కూడా చదవండి: Hyderabad: పర్యాటకానికి అందం

ఈవార్తను కూడా చదవండి: Medak: రేవంత్‌ మాటలు కోటలు దాటుతున్నాయి

ఈవార్తను కూడా చదవండి: LRS: ఎల్‌ఆర్‌ఎస్‌ ఫీజు నిర్ధారణ!

ఈవార్తను కూడా చదవండి: BJP.. కేసీఆర్ పాలనలోనే ఆర్థిక వ్యవస్థ కొల్లగొట్టారు

Read Latest Telangana News and National News

Updated Date - Feb 22 , 2025 | 12:07 PM