Ananthapur: అమ్మా.. ఐ యామ్ వెరీ సారీ.. ఇక నీ కొడుకు లేడమ్మా..
ABN , Publish Date - Jul 19 , 2025 | 01:46 PM
‘అమ్మా.. ఐ యామ్ వెరీ సారీ.. ఇక నీ కొడుకు లేడమ్మా.. జాగ్రత్తగా ఉండు.. మళ్లీ వస్తాను.. చెల్లి మానస కడుపున పుడతాను. నాకోసం మీరు ఉండాలి. నాన్నకు చెప్పు.. ప్లీజ్ మా... ఐ మిస్ యూ మా... లవ్ యూ మా...’ అంటూ తల్లికి వాట్సాప్ మెసేజ్ చేశాడు.

- తల్లికి వీడియో కాల్.. లైవ్‌లో యువకుడి ఆత్మహత్య
బుక్కరాయసముద్రం(అనంతపురం): ‘అమ్మా.. ఐ యామ్ వెరీ సారీ.. ఇక నీ కొడుకు లేడమ్మా.. జాగ్రత్తగా ఉండు.. మళ్లీ వస్తాను.. చెల్లి మానస కడుపున పుడతాను. నాకోసం మీరు ఉండాలి. నాన్నకు చెప్పు.. ప్లీజ్ మా... ఐ మిస్ యూ మా... లవ్ యూ మా...’ అంటూ తల్లికి వాట్సాప్ మెసేజ్ చేశాడు. ఆ తర్వాత వీడియో కాల్ చేసి, వద్దని వేడుకుంటున్నా.. కళ్ల నీళ్లు పెట్టుకుంటున్నా వినకుండా.. తల్లి చూస్తుండగానే ఉరేసుకుని, మరణించాడు. కొడుకు మరణాన్ని చూసి తల్లి కుప్పకూలిపోయింది. మండలంలోని బొమ్మలాటపల్లి వద్ద బ్రహంగారి గుడి వెనుక గుట్టపై ఉన్న చెట్టుకు ఉరేసుకుని మల్లికార్జున(23) మరణించాడు.
నార్పల మండల పులసనూతల గ్రామానికి చెందిన ఆదినారాయణ, మునీశ్వరి దంపతుల ఒక్కగానొక్క కుమారుడు మల్లికార్జున. ఇంటర్ వరకు చదివాడు. అనంతపురంలో కారు డైవింగ్ నేర్చుకుంటుండేవాడు. తాను చనిపోతున్నానని శుక్రవారం తల్లిదండ్రులకు వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపాడు. అనంతరం తల్లి మునీశ్వరికి వీడియో కాల్ చేసి లైవ్‌లోనే చెట్టుకు ఉరేసుకుని, చనిపోతున్నానన్నాడు. తల్లి మునీశ్వరి కన్నీరు మున్నీరుగా విలపించింది. ‘చనిపోవద్దు.. నాన్నా..’ అని ప్రాధేయపడినా వినకుండా ఉరేసుకున్నాడు.
దీంతో మునీశ్వరి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. మల్లికార్జున(Mallikarjuna) చనిపోయాడు. వెంటనే కుటుంబీకులు.. నార్పల పోలీసులకు సమాచారం అందించారు. ఇంతలోనే చెట్టుకు వేలాడుతున్న యువకుడి మృతదేహాన్ని అటుగా వెళ్తున్న వారు గమనించి, పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. నార్పల పోలీసుల సమాచారంతో మృతదేహం మల్లికార్జునదిగా గుర్తించారు. ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. దీనిపై బుక్కరాయసముద్రం పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
Read Latest Telangana News and National News