Share News

Hyderabad: ఫేస్‌బుక్‌ పరిచయం అంతపని చేసిందన్నమాట.. ఏం జరిగిందో తెలిస్తే..

ABN , Publish Date - Jan 17 , 2025 | 08:23 AM

ఫేస్‌బుక్‌(Hyderabad:) ద్వారా ఓ ఇంట్లో అద్దెకు ఉండే వ్యక్తితో పరిచయం పెంచుకున్నాడు. ఇంటి యజమాని పండుగకు ఊరు వెళ్లారని నిర్ధారించుకున్నాడు. పరిచయం ఉన్న వ్యక్తికి మద్యం తాగించి యజమాని ఇంట్లో సుమారు రూ. 50 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు, నగదు చోరీ చేశాడు.

Hyderabad: ఫేస్‌బుక్‌ పరిచయం అంతపని చేసిందన్నమాట.. ఏం జరిగిందో తెలిస్తే..

- రూ.50 లక్షల బంగారు ఆభరణాలు, రూ.25 లక్షల నగదు అపహరణ

- నిందితులను పట్టించిన సీసీ కెమెరాలు

హైదరాబాద్: ఫేస్‌బుక్‌(Hyderabad:) ద్వారా ఓ ఇంట్లో అద్దెకు ఉండే వ్యక్తితో పరిచయం పెంచుకున్నాడు. ఇంటి యజమాని పండుగకు ఊరు వెళ్లారని నిర్ధారించుకున్నాడు. పరిచయం ఉన్న వ్యక్తికి మద్యం తాగించి యజమాని ఇంట్లో సుమారు రూ. 50 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు, నగదు చోరీ చేశాడు. సీసీ కెమెరా(CCTV camera) ద్వారా పోలీసులు నిందితులను గుర్తించి అరెస్టు చేశారు. బంజారాహిల్స్‌ రోడ్డు నెంబరు.2 ఇందిరానగర్‌(Banjara Hills Road No.2 Indiranagar)లో నివసించే లోవా లక్ష్మి ఉపాధ్యాయురాలు. ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో కలిసి ఈనెల 12న స్వగ్రామం వెళ్లారు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: సాంబార్‌ రైస్‌, నూడిల్స్‌లో బొద్దింకలు..


ఇదిలా ఉండగా, ఈనెల 14న ఇంట్లో అద్దెకు ఉండే వారు మోటరు వేసేందుకు ప్రయత్నిస్తుండగా లోవా లక్ష్మి ఇంటి తలుపు తెరిచి ఉండడం గమనించారు. వెంటనే ఆమెకు సమాచారం ఇచ్చారు. ఆమె తిరిగి వచ్చి చూడగా అల్మారాలో ఉండాల్సిన రెండు బంగారం హారాలు, ఒక గొలుసు, గాజులు, చెవి కమ్మలు, మాటీలు, వెండి వస్తువులు, రూ. 25 లక్షల నగదు కనిపించలేదు. బాధితురాలి ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.


చోరీకి ఒకరోజు ముందు..

లక్ష్మి ఇంట్లో అద్దెకు ఉండే వెన్నపూస తిరుమల్‌రెడ్డి పై పోలీసులు దృష్టి సారించారు. చోరీకి ముందు రోజు అతడు మరో యువకుడితో కలిసి తిరిగినట్టు కెమెరాలో రికార్డు అయింది. వెంటనే తిరుమల్‌రెడ్డిని అదుపులోకి తీసుకొని అతడితో తిరిగింది ఓ ఐదు నక్షత్రాల హోటల్‌లో చెఫ్‌కు సహాయకుడిగా పనిచేసే దాసరి రక్షక్‌ రాజ్‌ అలియాస్‌ రాజు అని తేల్చారు. వెంకటగిరిలో ఉంటున్న రక్షక్‌రాజ్‌ ఇంటిపై పోలీసులు దాడి చేసి అల్మారా వెతకగా చోరీ సొత్తు కనిపించింది.


city4.jpg

వెంటనే అతడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. తిరుమల్‌రెడ్డి, రక్షక్‌రాజ్‌కు ఆరు నెలల క్రితం ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయం. ఇద్దరు తరుచూ మద్యం తాగుతారు. చోరీకి ముందు కూడా మద్యం తాగారు. అనంతరం తిరుమల్‌రెడ్డి ద్వారా ఇంటి యజమాని ఊరు వెళ్లినట్టు నిర్ధారించుకున్న రక్షక్‌రాజ్‌ చోరీ పూర్తి చేసి నగలు, నగదుతో ఉడాయించాడు. రక్షక్‌రాజ్‌పై జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో చోరీ కేసులు ఉన్నాయి. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు పోలీసులు తెలిపారు.


ఈవార్తను కూడా చదవండి: Road Accident: తల్లీకుమార్తెను బలిగొన్న పొగమంచు

ఈవార్తను కూడా చదవండి: రైతు భరోసా గురించి మంత్రి పొంగులేటి ఏం చెప్పారంటే..

ఈవార్తను కూడా చదవండి: రైతు భరోసా కోసం దరఖాస్తు.. డిప్యూటీ సీఎం చెప్పింది ఇదే

ఈవార్తను కూడా చదవండి: TG News: తెలంగాణను వణికిస్తున్న పులులు

Read Latest Telangana News and National News

Updated Date - Jan 17 , 2025 | 08:23 AM