Share News

Hyderabad: ప్రేమ విఫలమై డ్యాన్స్‌ మాస్టర్‌ ఆత్మహత్య

ABN , Publish Date - May 27 , 2025 | 10:28 AM

ప్రేమ విఫలమైందని ఓ డ్యాన్స్‌ మాస్టర్‌ ఆత్మహత్య చేసుకున్న సంఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది. సాగర్‌కుమార్‌ అనే డ్యాన్స్‌ మాస్టర్‌ గా పనిచేస్తున్నాడు. అయితే.. తను ఉంట్లోనే సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

Hyderabad: ప్రేమ విఫలమై డ్యాన్స్‌ మాస్టర్‌ ఆత్మహత్య

హైదరాబాద్: కుటుంబ సమస్యలు, ప్రేమ విఫలమై డ్యాన్స్‌ మాస్టర్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌ కైలాస్‏పురి(Uttar Pradesh Kailaspuri)కి చెందిన సాగర్‌కుమార్‌(17) ఇంటర్‌ వరకు చదువుకున్నాడు. 45 రోజుల క్రితం నగరానికి వచ్చాడు. మియాపూర్‌ గోకుల్‌ ఫ్లాట్స్‌లోగల డెలాయిట్‌ డ్యాన్స్‌ స్టూడియోలో మాస్టర్‌గా పనిచేస్తూ స్టూడియోలోనే ఉంటున్నాడు. 25వ తేదీ రాత్రి 8.30 గంటల సమయంలో యజమాని పరమేష్‌ మాస్టర్‌ సాగర్‌కుమార్‌కు ఫోన్‌ చేశాడు.


city6.2.jpg

స్టూడియో డోర్లను లాక్‌ చేసి నిద్రపోమని చెప్పాడు. సోమవారం మధ్యాహ్నం 1.39 గంటలకు పరమేష్‌ స్టూడియోకు వెళ్లగా.. సాగర్‌ ఓ రూమ్‌లో సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరేసుకుని వేలాడుతూ కనిపించాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. సాగర్‌కుమార్‌ స్టూడియోకు వచ్చినప్పటి నుంచి బాధపడుతూ ఉండేవాడని, అడిగితే కుటుంబ సమస్యలున్నాయని, ప్రేమ విఫలమైందని చెప్పాడని పరమేష్‌ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ప్రేమ విఫలమైందనే అతను ఆత్మహత్య చేసుకున్నాడని భావిస్తుండగా, పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.



ఈ వార్తలు కూడా చదవండి.

Fashion Designer: ప్రతి నూలు పోగుకూ ఓ కథ..!

Gold Rates Today: పసిడి ప్రియులకు అలర్ట్.. తగ్గిన బంగారం, పెరిగిన వెండి

Read Latest Telangana News and National News

Updated Date - May 30 , 2025 | 01:49 PM