Hyderabad: రూ.1.22కోట్ల ట్రేడింగ్ మోసం..
ABN , Publish Date - Apr 25 , 2025 | 09:58 AM
ఒకటి కాదు.. రెండు కాదు.. రూ.1.22 కోట్లు కొల్లగొట్టారు సైబర్ నేరగాళ్లు ఆన్‌లైన్ ఇన్వెస్ట్‌మెంట్‌లో ట్రేడింగ్ టిప్స్ ఇస్తానంటూ నమ్మించి ఏకంగా.. రూ.1.22 కోట్ల కొల్లగొట్టారు. సైబర్ మోసాలపై ప్రజల్లో ఇంకా అవగాహన తక్కువగా ఉండడంతో ఈ తరహ మోసాలు నగరంలో అధికమవుతున్నాయి.

- సైబర్ క్రిమినల్ అరెస్ట్
హైదరాబాద్ సిటీ: ఆన్‌లైన్ ఇన్వెస్ట్‌మెంట్(Online investment)లో ట్రేడింగ్ టిప్స్ ఇస్తానంటూ నమ్మించి నగరవాసి నుంచి రూ.1.22కోట్లు కొల్లగొట్టిన కేసులో పోలీసులు ఓ నిందితుడిని అరెస్ట్ చేశారు. డీసీపీ ధార కవిత(DCP Dhara Kavitha) తెలిపిన వివరాల ప్రకారం నగరానికి చెందిన వ్యాపారికి గతేడాది నవంబర్‌లో గుర్తుతెలియని వ్యక్తి నుంచి కాల్ వచ్చింది. ఆన్‌లైన్ ట్రేడింగ్‌లో అత్యధిక లాభాలు వచ్చే చిట్కాలు ఇస్తానంటూ నమ్మబలికాడు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: మీ వీడియో నా దగ్గరుంది.. రూ.5 కోట్లు ఇవ్వండి..
ఆ మాటలు నమ్మిన బాధితుడు అతను చెప్పినట్లు చేశాడు. ప్రారంభంలో అతడు చెప్పిన చిట్కాల వల్ల వ్యాపారికి మంచి లాభాలు వచ్చాయి. ఆ తర్వాత అతడిని ఓ ట్రేడింగ్‌కు సంబంధించిన వాట్సప్ గ్రూపు(WhatsApp group)లో యాడ్ చేశారు. పెట్టుబడులకు లాభాలు వచ్చినట్లు వర్చువల్‌గా చూపిస్తూ పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టే విధంగా ప్రోత్సహించారు. మొత్తం రూ. 1.22 కోట్లు పెట్టుబడులు పెట్టించారు.
అనంతరం ఆ డబ్బును విత్‌డ్రా చేసుకునే ఆప్షన్ క్లోజ్ చేశారు. ఇదేంటని ప్రశ్నిస్తే ఇంకా ఎక్కువ మొత్తంలో పెట్టుబడులు పెట్టాలంఊ పొంతనలేని సమాధానాలు చెప్పేవారు. ఇదంతా సైబర్ మోసం అని గుర్తించిన బాధితుడు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా మోసానికి పాల్పడిన ముఠాను గుర్తించారు.
అసలు నిందితులు పరారీలో ఉండగా, ఆ ముఠాకు బ్యాంకు ఖాతాలు అందించిన నోయిడా ఓమెగా బ్రాంచిలో ఐసీఐసీఐ రిలేషన్‌షిప్ సేల్స్ మేనేజర్ దీపక్ కుమార్‌ను అరెస్టు చేశారు. అతన్ని విచారించిన క్రమంలో ఇప్పటి వరకు సైబర్ ముఠాలకు 23 బ్యాంకు ఖాతాలు అందించినట్లు తేలింది. ఆ ఖాతాల ద్వారా సైబర్ క్రిమినల్స్ ఇప్పటి వరకు రూ. 6 కోట్లు కొల్లగొట్టినట్లు గుర్తించారు.
ఈ వార్తలు కూడా చదవండి
దేశ భద్రతపై కాంగ్రెస్ చౌకబారు రాజకీయాలు
పంచాయతీలకు ఎన్నికల్లేవు.. అభివృద్ధికి నిధుల్లేవు!
కౌశిక్ రెడ్డికి హైకోర్టులో స్వల్ప ఊరట
పర్యాటకుల మతం అడిగి పాశవికంగా కాల్చారు
Read Latest Telangana News and National News