Chennai News: ఉదయం వివాహం...సాయంత్రం ప్రియుడితో జంప్
ABN , Publish Date - Jul 04 , 2025 | 11:03 AM
స్థానిక పెరంబూర్ అంబేడ్కర్ నగర్ చెందిన అఖిలన్-నాగవల్లి దంపతుల కుమార్తె అర్చన (20)కు మాధవరం బర్మా కాలనీకి చెందిన జయకుమార్‌కు బుధవారం ఇరు కుటుంబాల సమక్షంలో వివాహం జరిగింది.

చెన్నై: స్థానిక పెరంబూర్ అంబేడ్కర్ నగర్ చెందిన అఖిలన్-నాగవల్లి దంపతుల కుమార్తె అర్చన (20)కు మాధవరం బర్మా కాలనీకి చెందిన జయకుమార్(Jayakumar)కు బుధవారం ఇరు కుటుంబాల సమక్షంలో వివాహం జరిగింది. వివాహం అనంతరం వధూవరులను యువతి ఇంటికి తీసుకొచ్చారు. సాయంత్రం వివాహ రిసెప్షన్ జరగాల్సి ఉండగా,
మధ్యాహ్నం బ్యూటీ పార్లర్‌కు వెళ్తున్నానని బయటకు వెళ్లిన అర్చన సాయంత్రం వరకు ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు, బంధువులు ఆమె కోసం గాలించినా ప్రయోజనం లేకపోయింది. ఈ విషయమై వారు చుట్టుపక్కల వారిని విచారించగా,
అర్చన ఇదివరకే ఎరుకంజేరికి చెందిన కలైఅరసన్ అనే యువకుడిని ప్రేమిస్తున్నట్లు తెలిసింది. దీంతో, తన కుమార్తెను అప్పగించాలంటూ తల్లి నాగవల్లి తిరువిక నగర్ పోలీస్ స్టేషన్(Tiruvikanagar Police Station)లో ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారంపై కేసు నమోదుచేసిన పోలీసులు, పరారైన ప్రేమ జంట కోసం గాలిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి.
కాటేదాన్ రబ్బర్ కంపెనీలో అగ్ని ప్రమాదం
రిజర్వేషన్లు అమలు తర్వాతే ఎన్నికలు నిర్వహించాలి
Read Latest Telangana News and National News