BJP: బీజేపీ రాష్ట్ర చీఫ్ సహా 1,078 మందిపై కేసునమోదు.. విషయం ఏంటంటే..
ABN , Publish Date - Mar 19 , 2025 | 12:42 PM
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సహా 1,078 మంది కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదుచేశారు. అయితే.. ఈ విషయం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనానికి దారితీసింది. అనుమతిలేకుండా ఆందోళన చేశారంటూ కేసునమోదు చేశారు.

- అనుమతిలేకుండా ధర్నా
- అన్నామలై సహా 1,078 మందిపై కేసు
చెన్నై: టాస్మాక్ సంస్థలో రూ.1,000 కోట్ల మేర అవినీతి జరిగిందని ఆరోపిస్తూ రాజధాని నగరంలో అనుమతి లేకుండా సోమవారం ధర్నాలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై(BJP state president Annamalai) సహా 1,078 మంది కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదుచేశారు. టాస్మాక్ ప్రధాన కార్యాలయం, మద్యం గోదాము, డిస్టలరీల్లో ఈ నెల 6వ తేదీ ఈడీ అధికారులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో, దాదాపు రూ. వెయ్యి కోట్ల మేరకు అవినీతికి సంబంధించి ఆధారాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
ఈ వార్తను కూడా చదవండి: Chennai: 2.53 లక్షల తాబేళ్ల గుడ్ల సేకరణ..
ఈ మెగా అవినీతికి నిరసనగా నగరంలో టాస్మాక్ ప్రధాన కార్యాలయాన్ని సోమవారం ముట్టడించేందుకు బీజేపీ నాయకులు, కార్యకర్తలు యత్నించారు. ఎగ్మూర్ బయల్దేరిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై, తమిళిసై సౌందరరాజన్, ఎమ్మెల్యేలు వానతీ శ్రీనివాసన్, సరస్వతి, సీనియర్ నేత ఎన్.చక్రవర్తి, కేంద్రమాజీ మంత్రి పొన్‌రాధాకృష్ణన్ సహా 1,078 మంది అనుమతిలేకుండా ఆందోళన చేశారని కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి:
సమాధానాలు చెప్పలేక ప్రశ్నోత్తరాలను ఎత్తేస్తారా?
కేసీఆర్‌కు అసెంబ్లీని ఫేజ్ చేసే దమ్ములేదు
రేవంత్ ప్రభుత్వంలో ఆ స్కీమ్ బాగుంది
పులి సంచారం అంటూ వార్తలు.. నిర్ధారించని అధికారులు
Read Latest Telangana News and National News