Share News

Bengaluru: ఈ కష్టం పగవారికి కూడా రాకూడదు.. ఏం జరిగిందంటే..

ABN , Publish Date - Jul 30 , 2025 | 12:17 PM

చెల్లకెర పట్టణ సమీపంలోని స్టేట్‌ హైవే 150ఏ పై కారు, ద్విచక్రవాహనం ఢీకొన్న ఘటనలో అక్కాతమ్ముడు దుర్మరణం చెందారు. చెల్లకెర పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం చెల్లకెర తాలూకా తలకు గ్రామ పంచాయతీ సభ్యుడు రవికుమార్‌ భార్య మంజుల(32) ఆమె తమ్ముడు అభిషేక్‌(28) ఇద్దరూ ద్విచక్రవాహణంలో దేవరకోట మొరార్జీ స్కూల్‌కు వెళ్తున్నారు.

Bengaluru: ఈ కష్టం పగవారికి కూడా రాకూడదు.. ఏం జరిగిందంటే..

- రోడ్డు ప్రమాదంలో అక్కాతమ్ముడి దుర్మరణం

- చెల్లకెర వద్ద కారు, బైక్‌ ఢీ.. విషాదంలో కుటుంబ సభ్యులు

బెంగళూరు: చెల్లకెర పట్టణ సమీపంలోని స్టేట్‌ హైవే 150ఏ పై కారు, ద్విచక్రవాహనం ఢీకొన్న ఘటనలో అక్కాతమ్ముడు దుర్మరణం చెందారు. చెల్లకెర పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం చెల్లకెర తాలూకా తలకు గ్రామ పంచాయతీ సభ్యుడు రవికుమార్‌ భార్య మంజుల(32) ఆమె తమ్ముడు అభిషేక్‌(28) ఇద్దరూ ద్విచక్రవాహణంలో దేవరకోట(Devarakota) మొరార్జీ స్కూల్‌కు వెళ్తున్నారు.


pandu2.4.jpg

6వ తరగతి చదువుతున్న మంజల అబ్బాయి అనిల్‌ను చూసి వస్తున్నారు. సరిగ్గా ఎదురుగా వస్తున్న కారు వేగంగా ఢీ కొట్టడంతో వీరు రోడ్డు నుంచి పోలాల్లోకి దూసుకుపోయారు. వీరు ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనం హ్యాండిల్‌ పూర్తీగా కట్‌ అయింది. తీవ్రగాయాలతో వారిద్దరూ అక్కడికక్కడే దుర్మరణం చెందారు. కారు ముందుబాగం కూడా దెబ్బతింది.


pandu1.2.jpg

కారు డ్రైవర్‌కు గాయాలు కావడంతో చెల్లకెర ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కుమారుడిని చూసి ఇంటికి వస్తున్నాము అని భర్తకు ఫోన్‌లో చెప్పిన కొద్ది సేపటికే ప్రమాదం వీరి ప్రాణాలు గాలిలో కలిసి పోయాయి. పోలీసులు కేసునమోదు చేసుకున్నట్లు తెలిపారు. అక్కతమ్ముడు ఒకేసారి ప్రమాదంలో మరణించడంతో ఆకుటంబంలో విషాదం నెలకొంది.


ఈ వార్తలు కూడా చదవండి..

శ్రావణ మాసంలో శుభవార్త.. బంగారం, వెండి ధరల్లో ఊహించని తగ్గింపు!

బీసీ రిజర్వేషన్ల కోసం 72 గంటల దీక్ష

Read Latest Telangana News and National News

Updated Date - Jul 30 , 2025 | 12:54 PM