Virat Kohli: విరాట్ కోహ్లీ మరో పెట్టుబడి.. ఆ కంపెనీలో రూ.40 కోట్లు ఇన్వెస్ట్
ABN , Publish Date - Jun 27 , 2025 | 01:24 PM
క్రికెట్ రంగంలో విరాట్ కోహ్లీ (Virat Kohli) పేరు తెలియనివారు దాదాపు ఉండరని చెప్పవచ్చు. అలాంటి కోహ్లీ ఇప్పుడు మైదానంలో మాత్రమే కాదు, బిజినెస్ రంగంలో కూడా తనదైన ముద్ర వేసేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు.

క్రికెట్ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్న విరాట్ కోహ్లీ (Virat Kohli), ఇప్పుడు వ్యాపార రంగంలో కూడా పెట్టుబడులు పెడుతున్నారు. ఈ క్రమంలోనే కోహ్లీ, పూమా ఇండియా మాజీ హెడ్ అభిషేక్ గంగూలీ ప్రారంభించిన క్రీడా వస్త్రాల తయారీ సంస్థ అగిలిటాస్‌లో (Agilitas) రూ.40 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. ఈ పెట్టుబడితో కోహ్లీ తన వ్యాపార సంబంధాలను మరింత బలోపేతం చేస్తున్నారు. గంగూలీ, ప్యూమా ఇండియాలో మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నప్పుడు, కోహ్లీని కంపెనీ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించడంలో కీలక పాత్ర పోషించారు. 2017లో ప్రారంభమైన రూ.110 కోట్ల ఒప్పందం 2025 వరకు కొనసాగుతుందని సమాచారం.
యాజమాన్య హక్కులు
కోహ్లీ కేవలం బ్రాండ్ అంబాసిడర్‌గా మాత్రమే కాకుండా, బెంగళూరులోని అగిలిటాస్ సంస్థలో యాజమాన్య హక్కులు పొందడానికి కూడా ఇన్వెస్ట్‌మెంట్ చేశారు. 2023లో అగిలిటాస్, మోచికో షూస్‌ను కొనుగోలు చేసింది. ఇది అడిడాస్, ప్యూమా, న్యూ బాలెన్స్, స్కెచర్స్, రీబాక్, ఆసిక్స్, క్రోక్స్, డెకాథ్లాన్, క్లార్క్స్, యూఎస్ పోలో వంటి బ్రాండ్లకు షూస్‌ని తయారు చేస్తుంది. అగిలిటాస్, ఇండియాలో కొన్ని ఇతర ప్రాంతాల్లో షూస్ అమ్మడానికి లోటో బ్రాండ్లకు లైసెన్సింగ్ హక్కులను కూడా పొందింది. ఈ నేపథ్యంలో కోహ్లీ One8 వంటి ఇతర బ్రాండ్లను కూడా ప్రవేశపెట్టాలని సంస్థ యోచిస్తోంది.
కంపెనీ విలువ
ఈ పెట్టుబడితో అగిలిటాస్ అమ్మకాలు పెరిగి, కంపెనీ విలువను పెంచనుంది. చివరికి కోహ్లీ పెట్టుబడికి కూడా విలువ పెరుగుతుంది. కోహ్లీ ప్రారంభ పెట్టుబడి రూ.40 కోట్లు కేవలం మొదటి రౌండ్ మాత్రమే. ఆయన వ్యక్తిగతంగా మరిన్ని పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అగిలిటాస్‌లో తన పాత్రను పెంచడానికి కూడా యోచిస్తున్నారని సమాచారం. కోహ్లీ పెట్టుబడుల్లో ఇది కొత్తది కాదు. ఇప్పటికే 10కిపైగా స్టార్ట్‌అప్స్‌లో ఇన్వెస్ట్ చేశాడు. ఇందులో Digit Insurance, MPL, Wrogn వంటి పేరున్న కంపెనీలు ఉన్నాయి. ఇప్పుడు అగిలిటాస్‌తో అతడి వ్యాపార ప్రయాణం మొదలైంది. ఇది కేవలం ఇండియా మార్కెట్‌కు పరిమితం కాకుండా, గ్లోబల్ స్థాయిలో విస్తరించాలని చూస్తున్నారు.
ఇవీ చదవండి:
భారత్ రెండో టెస్టుకు కుల్దీప్ యాదవ్.. మైఖేల్ క్లార్క్ సంచలన
జూన్ 30లోపు ముగియాల్సిన ఆర్థిక కార్యకలాపాలు ఇవే..
మరిన్ని ఏపీ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి