Share News

Upcoming IPOs: వచ్చే వారం జూలై 14 నుంచి రానున్న ఐపీఓలు ఇవే.. ఈసారి ఎన్నో తెలుసా..

ABN , Publish Date - Jul 13 , 2025 | 02:40 PM

భారత స్టాక్ మార్కెట్లో ప్రతి వారం కూడా కొన్ని కొత్త ఐపీఓలు వస్తున్నాయి. ఇదే మాదిరిగా వచ్చే వారం కూడా మూడు కంపెనీలు తమ IPOలను ప్రారంభించబోతున్నాయి. వీటిలో స్పన్‌వెబ్ నాన్‌వోవెన్, మోనికా అల్కోబెవ్, ఆంథెమ్ బయోసైన్సెస్ IPOలు ఉన్నాయి.

Upcoming IPOs: వచ్చే వారం జూలై 14 నుంచి రానున్న ఐపీఓలు ఇవే.. ఈసారి ఎన్నో తెలుసా..
Upcoming IPOs july 14th 2025

దేశీయ స్టాక్ మార్కెట్లో మళ్లీ ఐపీఓల వీక్ రానే వచ్చేసింది. జూలై 14 నుంచి ప్రారంభమయ్యే వారంలో (Upcoming IPOs) ఈసారి 3 కొత్త IPOలు రాబోతున్నాయి. వీటిలో ఒకటి మెయిన్‌బోర్డ్ విభాగం నుంచి వస్తుంది. దీంతోపాటు స్టాక్ మార్కెట్లో మరో 6 కంపెనీల షేర్లు లిస్ట్ కానున్నాయి. అయితే కొత్తగా ప్రారంభమయ్యే IPOలు, లిస్ట్ కానున్న కంపెనీల గురించి (IPOs starting from July 14) ఇప్పుడు తెలుసుకుందాం.


కొత్తగా ప్రారంభమయ్యే IPOలు

ఆంథెమ్ బయోసైన్సెస్ IPO: మెయిన్‌బోర్డ్ విభాగంలో రూ. 3395 కోట్ల ఈ ఇష్యూ జూలై 14న ప్రారంభమవుతుంది. ఇందులో మీరు జూలై 16 వరకు ఇన్వెస్ట్ చేయవచ్చు. దీనిలో ఒక్కో షేరుకు రూ. 540-570 ధర ఉండగా, 26 షేర్ల లాట్‌లు తీసుకోవాల్సి ఉంటుంది. జూలై 17న కేటాయింపు ఖరారు చేయబడుతుంది. జూలై 21న షేర్లు BSE, NSEలో లిస్ట్ కానున్నాయి.

స్పన్‌వెబ్ నాన్‌వోవెన్ IPO: రూ. 60.98 కోట్ల విలువైన ఈ పబ్లిక్ ఇష్యూ జూలై 14న ప్రారంభమై, జూలై 16న ముగుస్తుంది. దీని బిడ్డింగ్ ధరల విషయానికి వస్తే ఒక్కో షేరుకు రూ. 90-96. లాట్ సైజు 1,200 షేర్లు. కేటాయింపు జూలై 17న ఖరారు చేయబడుతుంది. షేర్లు జూలై 21న NSE SMEలో లిస్ట్ అవుతాయి.


మోనికా అల్కోబెవ్ IPO: ఇది జూలై 16న ప్రారంభమై, జూలై 18న ముగుస్తుంది. ఈ కంపెనీ రూ. 153.68 కోట్లు సేకరించాలని చూస్తోంది. కేటాయింపు జూలై 21న ఖరారు చేయబడుతుంది. దీని షేర్లను జూలై 23న BSE SMEలో లిస్ట్ చేయనున్నారు. IPOలో బిడ్డింగ్ ధరల బ్యాండ్ ఒక్కో షేరుకు రూ. 271-286 కాగా, లాట్ సైజు 400 షేర్లు.


లిస్ట్ కానున్న కంపెనీలు

కొత్త వారంలో జూలై 14న, ట్రావెల్ ఫుడ్ సర్వీసెస్ షేర్లు BSE, NSEలలో మెయిన్‌బోర్డ్ విభాగంలో లిస్ట్ కానున్నాయి. అదే రోజున, చెమ్‌కార్ట్ ఇండియా IPO BSE SMEలో, స్మార్టెన్ పవర్ సిస్టమ్స్ IPO NSE SMEలో లిస్ట్ కానుంది. జూలై 15న GLEN ఇండస్ట్రీస్ షేర్లు BSE SMEలో ప్రారంభమవుతాయి. ఆస్టన్ ఫార్మాస్యూటికల్స్ జూలై 16న BSE SMEలో, స్మార్ట్‌వర్క్స్ కోవర్కింగ్ స్పేస్‌లు జూలై 17న BSE, NSEలో లిస్ట్ కానున్నాయి. కొత్త వారంలో CFF ఫ్లూయిడ్ కంట్రోల్ FPO కూడా జూలై 16న BSE SMEలో లిస్ట్ కానుంది.


ఇవి కూడా చదవండి


యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్

ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 13 , 2025 | 02:41 PM