Share News

Stock Market Closing: నిఫ్టీ ఎక్స్‌పయిరీ నాడు డల్‌గా మార్కెట్లు

ABN , Publish Date - Jun 19 , 2025 | 08:05 PM

ఈ ఉదయం మన మార్కెట్లు ఫ్లాట్-టు-నెగటివ్ ప్రారంభం తర్వాత, మిశ్రమ ప్రపంచ మార్కెట్ల మధ్య మన మార్కెట్ సెషన్ అంతటా రేంజ్‌బౌండ్ కదలికను చూసింది. మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కూడా సెంటిమెంట్‌పై ప్రభావం చూపాయి.

Stock Market Closing: నిఫ్టీ ఎక్స్‌పయిరీ నాడు డల్‌గా మార్కెట్లు
Thursday markets

ఇంటర్నెట్ డెస్క్: నిఫ్టీ వారాంతపు ఎక్స్‌పయిరీ రోజైన ఇవాళ(గురువారం) మార్కెట్లు నిరుత్సాహంగా ట్రేడ్ అయ్యాయి. విదేశీ మార్కెట్ల మిశ్రమ సంకేతాల మధ్య దాదాపు ఫ్లాట్ గా ముగిశాయి. ఎక్కువగా ఊహించినా కాని, యథాతథ స్థితిని కొనసాగించాలనే US ఫెడ్ నిర్ణయం, మన మార్కెట్లలో ఎలాంటి గణనీయమైన రియాక్షన్‌ను కలిగించలేకపోయాయి. ఈ ఉదయం మార్కెట్లు ఫ్లాట్ ప్రారంభం తర్వాత, అక్కడక్కడే కదలాడి చివరికి నిఫ్టీ 24,793.25 దగ్గర స్థిరపడింది. చాలా రంగాలు నష్టాల్లో ముగియగా, రియాలిటీ, మెటల్, ఎనర్జీ టాప్ లూజర్లుగా ఉన్నాయి. ఇక, మిడ్, స్మాల్ క్యాప్ నిఫ్టీ పేలవమైన ప్రదర్శన చూపి 1.6% నుండి 1.9% పరిధిలో తగ్గుదల నమోదు చేశాయి.

ఈ ఉదయం మార్కెట్లు ఫ్లాట్-టు-నెగటివ్ ప్రారంభం తర్వాత, మిశ్రమ ప్రపంచ మార్కెట్ల మధ్య మన మార్కెట్ సెషన్ అంతటా రేంజ్‌బౌండ్ కదలికను చూసింది. మధ్యప్రాచ్యం(ఇరాన్-ఇజ్రాయెల్)లో పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కూడా పెట్టుబడిదారుల సెంటిమెంట్‌పై ప్రభావం చూపాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 82.79 పాయింట్లు లేదా 0.10 శాతం తగ్గి 81,361.87 వద్ద ఉంది. నిఫ్టీ 18.80 పాయింట్లు లేదా 0.08 శాతం తగ్గి 24,793.25 వద్ద స్థిరపడింది.


స్టాక్స్, ఇంకా ఆయా రంగాలు పనితీరు విషయానికొస్తే, నిఫ్టీలో టాటా కన్స్యూమర్, ఐషర్ మోటార్, ఎం&ఎం, విప్రో, డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ ప్రధానంగా లాభాలను ఆర్జించగా, అదానీ పోర్ట్స్, బజాజ్ ఫైనాన్స్, శ్రీరామ్ ఫైనాన్స్, టెక్ మహీంద్రా, అదానీ ఎంటర్‌ప్రైజెస్ నష్టపోయాయి. ఆటో మినహా, అన్ని ఇతర రంగాలలో ఐటీ, మీడియా, మెటల్, రియాల్టీ, ఆయిల్ & గ్యాస్, ఫార్మా, టెలికాం, PSU బ్యాంక్ 0.5-2 శాతం క్షీణితను నమోదు చేశాయి.

USFDA పరిశీలన ఆదేశాలివ్వడంతో జైడస్ లైఫ్ షేర్లు పడిపోయాయి. ARCకి రూ. 735 కోట్ల బ్యాడ్ లోన్‌ను ఆఫ్‌లోడ్ చేయడానికి బోర్డు ఆమోదించడంతో ESAF స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ షేర్లు 5% పెరిగాయి. వెదర్‌ఫోర్డ్‌తో 10 సంవత్సరాల ఒప్పందం తర్వాత MTAR టెక్నాలజీస్ 5% తిరిగి పుంజుకుంది. ఇక, బిఎస్‌ఇలో 80 స్టాక్‌లు 52 వారాల గరిష్ట స్థాయిలను తాకాయి. వాటిలో యాక్సిస్‌కేడ్స్ టెక్నాలజీస్, జిఆర్‌ఎం ఓవర్సీస్, స్టీల్ స్ట్రిప్స్ వీల్, ముత్తూట్ ఫైనాన్స్, ఎయు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ మొదలైనవి ఉన్నాయి.


Also Read:

మరోసారి మైక్రోసాఫ్ట్‌లో లేఆఫ్స్.. వేలల్లో తొలగింపులు ఉంటాయంటూ కథనాలు వైరల్

స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

For More Business News

Updated Date - Jun 19 , 2025 | 08:05 PM