Share News

Tesla Showroom: ముంబైలో టెస్లా షోరూమ్‌ రెడీ

ABN , Publish Date - Jul 12 , 2025 | 03:39 AM

ప్రపంచ ఈవీ దిగ్గజం టెస్లా భారత మార్కెట్లోకి లాంఛనప్రాయంగా ప్రవేశించేందుకు సన్నాహాలు పూర్తి చేసింది....

Tesla Showroom: ముంబైలో టెస్లా షోరూమ్‌ రెడీ

న్యూఢిల్లీ: ప్రపంచ ఈవీ దిగ్గజం టెస్లా భారత మార్కెట్లోకి లాంఛనప్రాయంగా ప్రవేశించేందుకు సన్నాహాలు పూర్తి చేసింది. వచ్చే వారం ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో తొలి ఎక్స్‌పీరియెన్స్‌ సెంటర్‌ ప్రారంభించనుంది. అమెరికాకు చెందిన కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ నేతృత్వంలోని ఈ విద్యుత్‌ కార్ల దిగ్గజం ఈ నెల 15న నిర్వహిస్తున్న ప్రారంభ కార్యక్రమానికి ఎంపిక చేసిన వారికి ఇప్పటికే ఆహ్వానాలు పంపింది. అయితే దీనిపై స్పందించేందుకు కంపెనీ ప్రతినిధులెవరూ అందుబాటులో లేరు. ఆస్టిన్‌ ప్రధాన కేంద్రంగా పని చేస్తున్న ఈ కంపెనీ చైనా ప్లాంట్‌లో ఉత్పత్తి చేసిన మోడల్‌ వై రియర్‌ వీల్‌ డ్రైవ్‌ ఎస్‌యూవీ సహా కొన్ని మోడళ్లను ముంబై చేర్చిందని పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు. ఈ షోరూమ్‌ కోసం టెస్లా ఇప్పటికే 24,565 చదరపు అడుగుల విస్తీర్ణం గల వేర్‌హౌస్‌‌ను లోధా లాజిస్టిక్స్‌ పార్క్‌ నుంచి ఐదేళ్ల కాలానికి లీజుకి తీసుకుంది. 40 వేల డాలర్ల లోపు ధరల శ్రేణిలోని కార్లకు 70 శాతం కస్టమ్స్‌ సుంకాన్ని, ఆ పైబడిన ధరలోని కార్లకు నూరు శాతం కస్టమ్స్‌ సుంకాన్ని భర్తీ చేసుకునేందుకు ప్రారంభ టారిఫ్‌ రాయితీలు కల్పించాలని భారత ప్రభుత్వాన్ని ఆ సంస్థ కోరుతోంది.

Updated Date - Jul 12 , 2025 | 03:39 AM