Indian Stock Markets: భారీ నష్టాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు.. కుప్పకూలిన ఈ స్టాక్స్
ABN , Publish Date - Jun 23 , 2025 | 09:46 AM
భారత స్టాక్ మార్కెట్లు (Indian Stock Markets) సోమవారం (జూన్ 23, 2025న) భారీ నష్టాలతో కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో సూచీలు మొత్తం దిగువకు పయనిస్తున్నాయి. దేశీయంగానే కాకుండా, అంతర్జాతీయంగా కూడా మార్కెట్లు తీవ్రమైన ఒడిదొడుకులను ఎదుర్కొంటున్నాయి.

భారత స్టాక్ మార్కెట్లు (Indian Stock Markets) ఈ రోజు (జూన్ 23, 2025) భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగానూ మార్కెట్లు తీవ్ర పరిణామాల్నీ ఎదుర్కొంటున్నాయి. యునైటెడ్ స్టేట్స్, ఇరాన్‌పై జరిపిన వైమానిక దాడులు, ప్రపంచ వ్యాప్తంగా మైనస్ ట్రెండ్‌ను తీసుకొచ్చాయి. గత శుక్రవారం తర్వాత సోమవారం కూడా స్టాక్ మార్కెట్లు పతనమయ్యాయి. దీనికి ప్రధాన కారణం అమెరికా ఇరాన్‌లోని మూడు అణుశక్తి కేంద్రాలపై దాడులు చేయడమేనని నిపుణులు చెబుతున్నారు.
సూచీలు మొత్తం
ఈ నేపథ్యంలో ఉదయం 9.48 గంటలకు BSE సెన్సెక్స్ 81,617 పాయింట్ల వద్ద ట్రేడవుతూ 906 పాయింట్ల నష్టాన్ని నమోదు చేసింది. Nifty50 ఇండెక్స్ 24,887 స్థాయిలో ఉంది. ఇది 265 పాయింట్లు పడిపోయింది. ఇదే సమయంలో బ్యాంక్ నిఫ్టీ 414 పాయింట్లు పడిపోగా, నిఫ్టీ మిడ్ క్యాప్ 100 సూచీ 351 పాయింట్లు దిగజారింది. మరోవైపు Nifty SmallCap సూచికలు కూడా నష్టాలు నమోదు చేశాయి.
కొన్ని నిమిషాల వ్యవధిలో
Nifty MidCap 0.4 శాతం తగ్గిపోగా, Nifty SmallCap 0.24 శాతం నష్టాన్ని చవిచూశాయి. దీంతో ఇన్వెస్టర్లు కొన్ని నిమిషాల వ్యవధిలోనే లక్షల కోట్ల రూపాయలను నష్టపోయారు. ఈ క్రమంలో ఇన్ఫోసిస్, శ్రీరామ్ ఫైనాన్స్, HUL, హీరో మోటోకార్ప్, M&M కంపెనీల స్టాక్స్ ప్రస్తుతం టాప్ 5 నష్టాల్లో ఉండగా, లాభాల్లో మాత్రం భారత్ ఎలక్ట్రిక్, నెస్లే కంపెనీలు ఉన్నాయి. అమెరికా-ఇరాన్ వివాదం ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఆస్ట్రేలియాలోని ASX200 ఇండెక్స్ 1 శాతం పడిపోయింది. హాంగ్ కాంగ్ 0.7 శాతం నష్టాన్ని చవిచూసింది. జపాన్ నిక్కీ 0.5 శాతం క్షీణించింది.
పెరిగిన ఆయిల్ ధరలు
కొత్తగా ఉత్పన్నమైన అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో ఆయిల్ ధరలు పెరుగుదల చూపిస్తున్నాయి. ఈ రోజు ఉదయం Brent Crude ధర 78.6 డాలర్లకు చేరుకుంది. 2 శాతం పెరుగుదలతో. అమెరికా WTI Crude 75.44 డాలర్ల వద్ద కొనసాగింది. ఆయిల్ ధరల పెరుగుదల వలన, నికరంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పై ప్రభావం పడే అవకాశం ఉంది. శుక్రవారం 86.59 వద్ద ముగిసిన తర్వాత డాలర్‌తో పోలిస్తే దేశీయ కరెన్సీ విలువ 18 పైసలు తగ్గి 86.77 వద్ద ప్రారంభమైందని బ్లూమ్‌బెర్గ్ తెలిపింది. ఈ నెలలో ఇప్పటివరకు కరెన్సీ 1.34 శాతం పడిపోయింది.
ఇవీ చదవండి:
1600 కోట్ల పాస్‌వర్డ్‌లు ఆన్‌లైన్‌లో లీక్.. హెచ్చరించిన గూగుల్
ఈ యాప్ 20 లక్షల పోయిన ఫోన్‌లను గుర్తించింది.. ఎలాగంటే..
మరిన్ని ఏపీ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి