Stock Markets: నష్టాలతో మొదలైన మార్కెట్లు.. రూ.10 వేల కోట్లు కోల్పోయిన విశాల్ మెగా మార్ట్
ABN , Publish Date - Jun 17 , 2025 | 10:00 AM
దేశీయ స్టాక్ మార్కెట్లు (Stock Markets) మంగళవారం (2025 జూన్ 17న) నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 81,630 వద్ద ప్రారంభమై 166 పాయింట్లు పడిపోయింది. నిఫ్టీ 24,881 వద్ద ప్రారంభమై 65 పాయింట్లు తగ్గింది. ప్రధానంగా బ్యాంకింగ్, ఐటీ రంగాలు నష్టాలను ఎదుర్కొన్నాయి.

భారత స్టాక్ మార్కెట్లు (Stock Markets) ఈరోజు (జూన్ 17, 2025) నష్టాలతో మొదలయ్యాయి. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో పెట్టుబడిదారులు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో ఇన్వెస్టర్లు అమ్మకాల వైపు మొగ్గుచూపుతున్నారు. ఈ క్రమంలో ఉదయం 9.50 గంటలకు BSE సెన్సెక్స్ 200 పాయింట్ల తగ్గిపోయి 81,596 స్థాయిలో ఉండగా, నిఫ్టీ 76 పాయింట్లు పడిపోయి 24,869కి చేరుకుంది. ఇదే సమయంలో బ్యాంక్ నిఫ్టీ 82 పాయింట్లు నష్టపోగా, వీటికి విరుద్ధంగా నిఫ్టీ మిడ్ క్యాప్ 100 సూచీ మాత్రం 148 పాయింట్లు లాభపడటం విశేషం.
ఈ స్టాక్స్ ప్రధానంగా లాస్
ఈ క్రమంలో ప్రధానంగా నష్టపోయిన కంపెనీలలో టాటా మోటార్స్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, సన్ ఫార్మా, టైటాన్ కంపెనీ, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, నెస్లే ఇండియా, మహీంద్రా అండ్ మహీంద్రా (M&M), ఎల్అండ్‌టీ (L&T) ఉండగా, లాభపడిన స్టాక్స్ లలో కోటక్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, NTPC, ICICI బ్యాంక్, అదానీ పోర్ట్స్, పవర్ గ్రిడ్ సంస్థలు ఉన్నాయి. రంగాల వారీగా చూస్తే ఫార్మా సూచీ (Nifty Pharma) 0.59% నష్టపోయింది. మెటల్ సూచీ (Nifty Metal) 0.44% తగ్గింది. రియల్టీ సూచీ (Nifty Realty) 0.87% లాభపడింది.
విశాల్ మెగా మార్ట్ (Vishal Mega Mart)
ఈ రోజు ట్రేడింగ్‌లో విశాల్ మెగా మార్ట్ షేర్లు 7.8% పడిపోయి రూ.115.10 వద్ద ట్రేడవుతున్నాయి. సమయత్ సర్వీసెస్ ఎల్‌ఎల్‌పీ సంస్థ ప్రమోటర్ 20% వాటాను బ్లాక్ డీల్ ద్వారా అమ్మింది. ఈ అమ్మకం విలువ సుమారు రూ.10,500 కోట్లు. దీంతో ఒకే రోజు 91 కోట్ల షేర్లు ట్రేడయ్యాయి. దీంతో ఈ స్టాక్ బీఎస్‌ఈలో ఒక్కో షేరుకు రూ.115 కనిష్ట స్థాయికి చేరుకుంది.
బలపడిన రూపాయి
మంగళవారం భారతీయ రూపాయి స్వల్పంగా బలపడింది. క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినప్పటికీ రూపాయి విలువ ఎక్కువ పెరుగలేదు. సోమవారం 86.06 వద్ద ముగిసిన రూపాయి, మంగళవారం 5 పైసలు లాభపడి 86.01 స్థాయికి చేరుకుంది. బ్లూమ్‌బర్గ్ నివేదిక ప్రకారం ఆసియాలోని ఇతర కరెన్సీలు మంగళవారం డాలర్‌తో పోలిస్తే మిశ్రమ ధోరణిలో ట్రేడ్ అయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల వాతావరణం, చమురు ధరల మార్పులు ఇవాళ మార్కెట్ల దిశను ప్రభావితం చేస్తున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
సవాళ్లను ఎదుర్కొంటున్న ఎయిర్ ఇండియా విమానాలు..
మీ పర్సనల్ లోన్ ఇలా తీర్చుకోండి.. మీ ఖర్చులు తగ్గించుకోండి..
For National News And Telugu News