Stock Markets: వారారంభంలో స్వల్ప నష్టాల్లో నిఫ్టీ, సెన్సెక్స్.. ర్యాలీ కొనసాగిస్తున్న మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్
ABN , Publish Date - Jun 30 , 2025 | 05:27 PM
ఇంట్రాడేలో నిఫ్టీని 25,500 కంటే దిగువకు లాగడంతో భారత ఈక్విటీ సూచీలు వారాన్ని ఈ ఉదయం బలహీనంగా ప్రారంభించాయి. మెటల్, ఆటో, రియాల్టీ, FMCG షేర్లలో బలమైన అమ్మకాలు కనిపించాయి. అయితే, PSU బ్యాంక్, ఐటీ, మీడియాలో కొనుగోళ్లు ..

బిజినెస్ న్యూస్, 30 జూన్: ఇంట్రాడేలో నిఫ్టీని 25,500 కంటే దిగువకు లాగడంతో భారత ఈక్విటీ సూచీలు వారాన్ని ఈ ఉదయం బలహీనంగా ప్రారంభించాయి. మెటల్, ఆటో, రియాల్టీ, FMCG షేర్లలో బలమైన అమ్మకాలు కనిపించాయి. అయితే, PSU బ్యాంక్, ఐటీ, మీడియాలో కొనుగోళ్లు.. నిఫ్టీ చివరికి 25,500 పైన ముగియడానికి సహాయపడ్డాయి. మార్కెట్లు ముగిసే సమయానికి, సెన్సెక్స్ 452.44 పాయింట్లు లేదా 0.54 శాతం తగ్గి 83,606.46 వద్ద ఉంది. నిఫ్టీ 120.75 పాయింట్లు లేదా 0.47 శాతం తగ్గి 25,517.05 వద్ద స్థిరపడింది.
ఇక, ఇవాళ్టితో కలిపి వరుసగా ఏడవ రోజు కూడా విస్తృత సూచీలు తమదైన శైలిలో ముందుకెళ్లాయి. ఫలితంగా BSE మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.6 శాతం, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 0.8 శాతం పెరిగాయి. ఒక దశలో నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ కూడా నేటి సెషన్‌లో రికార్డు స్థాయిలో 57,614.50 పాయింట్లను తాకింది. అయితే మార్కెట్లు ముగిసే సమయానికి 0.2 శాతం తగ్గి 57,312.75 వద్ద ముగిసింది.
టాటా కన్స్యూమర్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, హీరో మోటోకార్ప్, మారుతి సుజుకి నిఫ్టీలో ప్రధానంగా నష్టాలను చవిచూశాయి. ట్రెంట్, SBI, ఇండస్‌ఇండ్ బ్యాంక్, భారత్ ఎలక్ట్రానిక్స్, జియో ఫైనాన్షియల్ లాభపడ్డాయి. రంగాల పరంగా చూస్తే, PSU బ్యాంక్ ఇండెక్స్ 2.6 శాతం పెరిగింది. ఫార్మా ఇండెక్స్ 0.5 శాతం పెరిగింది. రియాల్టీ, FMCG, ఆటో, మెటల్ నష్టాల్లో ముగిశాయి.
ఇక, స్టాక్ విషయంలో, తెలంగాణలో రియాక్టర్ పేలుడు కారణంగా సిగాచి ఇండస్ట్రీస్ షేర్లు 11% క్షీణించాయి. డోక్సోరుబిసిన్ హైడ్రోక్లోరైడ్ ఇంజెక్షన్‌కు USFDA ఆమోదం లభించడంతో అలెంబిక్ ఫార్మా షేర్లు దాదాపు 5% పెరిగాయి. ప్రభుత్వం ఆర్థిక బిడ్ దశకు చేరుకోవడంతో IDBI బ్యాంక్ షేర్లు 1% పెరిగాయి. టోరెంట్ ఫార్మా రూ. 25,689 కోట్ల విలువైన నియంత్రణ వాటాను కొనుగోలు చేయడంతో JB కెమికల్స్ షేర్లు 6% పడిపోయాయి. US విభాగం 540-MW సోలార్ మాడ్యూల్ ఆర్డర్‌ను గెలుచుకున్న తర్వాత వారీ ఎనర్జీస్ షేర్లు 7% పెరిగాయి. MD, CEO రాజీనామాతో కర్ణాటక బ్యాంక్ షేర్లు 5% పడిపోయాయి.
మరోవైపు, ఇవాళ(సోమవారం) బిఎస్‌ఇలో 150 కి పైగా స్టాక్‌లు 52 వారాల గరిష్ట స్థాయిలను తాకాయి. వాటిలో దీపక్ ఫెర్టిలైజర్స్, సిటీ యూనియన్ బ్యాంక్, ఇఐడి ప్యారీ, లారస్ ల్యాబ్స్, ఆదిత్య బిర్లా క్యాపిటల్, లాయిడ్స్ మెటల్స్, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్, ఎస్‌ఆర్‌ఎఫ్, పూనవల్లా ఫిన్‌కార్ప్, అబాట్ ఇండియా, రామ్‌కో సిమెంట్స్, ఎల్‌టి ఫైనాన్స్, రెడింగ్టన్, జిల్లెట్ ఇండియా, హ్యుందాయ్ మోటార్, హెచ్‌డిఎఫ్‌సి లైఫ్, మాక్స్ ఫైనాన్షియల్, సోలార్ ఇండస్ట్రీస్ ఉన్నాయి.
గ్లోబల్ మార్కెట్లు
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వాణిజ్య ఒప్పందాల ఆశలు యూఎస్ మార్కెట్లపై సానుకూల ప్రభావం చూపగా, యుఎస్ ఫెడరల్ రిజర్వ్ నుండి వడ్డీ రేటు కోతలకు అంచనాలు పెరగడం యూఎస్ మార్కెట్లలో ర్యాలీ కనిపించింది. దీంతో శుక్రవారం ఎస్ & పి 500, నాస్‌డాక్ ఇండెక్స్ పరుగులెత్తాయి. ఇక, ఇవాళ (సోమవారం) ఆసియా మార్కెట్లు పెరగగా, యూరోపియన్ మార్కెట్లు స్వల్పంగా తగ్గుదల నమోదు చేశాయి.
ఇవి కూడా చదవండి
వైసీపీ సెటిల్‌మెంట్.. సీఎం చంద్రబాబు రియాక్షన్
యాంకర్ స్వేచ్ఛ సూసైడ్‌పై పూర్ణచందర్ భార్య షాకింగ్ కామెంట్స్..
Read Latest AP News And Telugu News