Stock Markets: యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో కూడా స్టాక్ మార్కెట్ దూకుడు..లాభాలే లాభాలు
ABN , Publish Date - Apr 28 , 2025 | 10:53 AM
భారత స్టాక్ మార్కెట్లు సోమవారం (ఏప్రిల్ 28) ఉదయం నుంచి భారీ లాభాలతో కొనసాగుతున్నాయి. ప్రపంచ ఆర్థిక సంక్షోభం, టారిఫ్‌ల అనిశ్చితి, భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు, ఇంకా క్యూ4 ఫలితాల పరిస్థితుల నేపథ్యంలో కూడా మార్కెట్ పెరుగుతోంది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.

భారత స్టాక్ మార్కెట్లు(stock market) సోమవారం (ఏప్రిల్ 28) భారీ లాభాలతో దూసుకెళ్తున్నాయి. ఓ వైపు టారిఫ్‌లకు సంబంధించిన అనిశ్చితి, మరోవైపు భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత, క్యూ4 ఫలితాల పరిస్థితులు ఉన్నా కూడా మార్కెట్ పైపైకి వెళ్తుండటం విశేషం. ఈ క్రమంలో ఉదయం 10 గంటలకు, BSE సెన్సెక్స్ 786.85 పాయింట్లు పెరిగి 79,914.38 స్థాయిలో ఉండగా, నిఫ్టీ మాత్రం 192.25 పాయింట్లు ఎగబాకి 24,231.60 స్థాయిలో ఉంది. మరోవైపు బ్యాంక్ నిఫ్టీ 617 పాయింట్లు లాభపడగా, నిఫ్టీ మిడ్ క్యాప్ 100 సూచీ 422 పాయింట్లు పుంజుకుంది. దీంతో మదుపర్లు కొన్ని నిమిషాల వ్యవధిలోనే లక్షల కోట్ల రూపాయలను దక్కించుకున్నారు.
టాప్ 5 స్టాక్స్
ఈ క్రమంలో ప్రస్తుతం రిలయన్స్, భారత్ ఎలక్ట్రిక్, సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, జేఎస్‌డబ్ల్యు స్టీల్ వంటి కంపెనీల స్టాక్స్ టాప్ 5 లాభాల్లో ఉండగా, శ్రీరామ్ ఫైనాన్స్, HCL టెక్, ఎటర్నల్, బజాజ్ ఫైనాన్స్, టెక్ మహీంద్రా సంస్థల స్టాక్స్ టాప్ 5 నష్టాల్లో ఉన్నాయి. ఈ రికార్డు పెరుగుదల అనేక ఆర్థిక సూచికలు, షేర్ బాజార్లలో ప్రగతిని సూచిస్తూ, ప్రముఖ రంగాలలో వృద్ధిని చూపిస్తోంది. నికర లాభాలు, పలు కీలక రంగాలలో పాజిటివ్ పనితీరుతో, మ్యూచువల్ ఫండ్స్, ఇన్వెస్టర్ల మధ్య నమ్మకం కూడా పెరిగింది.
శ్రీరామ్ ఫైనాన్స్ షేర్లలో 9% లాస్
శ్రీరామ్ ఫైనాన్స్ షేర్లు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE)లో 9% మేర తగ్గి రూ.596.15కి చేరుకున్నాయి. ఈ కంపెనీ నికర వడ్డీ మార్జిన్ (NIM) Q4FY25లో 8.25%కి తగ్గింది. ఇది గత కాలానికి సంబంధించి 23 బేసిస్ పాయింట్లు (bp) పడిపోయినట్లు తెలుస్తోంది. అంతేకాదు, ఈ నష్టానికి ముఖ్యమైన కారణం కంపెనీ బ్యాలెన్స్ షీట్‌లో అదనపు లిక్విడిటీ ఉన్నట్లు తెలుస్తోంది. గత మూడు ట్రేడింగ్ సెషన్లలో, ఈ నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ (NBFC) స్టాక్ 15% పడిపోయింది. ఈ సమయంలో, శ్రిరామ్ ఫైనాన్స్ శేర్లు నిఫ్టీ 50 స్టాక్‌లలో అత్యధికంగా నష్టపోయినవిగా నిలిచాయి.
భారీ డిమాండ్‌తో కేటాయింపు
ట్యాంక్‌అప్ ఇంజనీర్స్ ప్రాథమిక పబ్లిక్ ఆఫరింగ్ (IPO) అద్భుతమైన స్పందనను పొందింది. షేర్లను దాదాపు 124.67 రెట్లు సబ్‌స్క్రిప్ట్ అయ్యాయి. నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ (NII) పెద్ద మోతాదులో డిమాండ్ చూపించారు, అయితే రిటైల్ ఇన్వెస్టర్స్ కూడా 46.51 రెట్లు సబ్‌స్క్రైబ్ చేశారు. ఈ IPO ప్రారంభంలో హై డిమాండ్‌తో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. తద్వారా పెట్టుబడిదారులు తమ వాటాను పొందే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి, జాబితా ప్రక్రియ వేగంగా జరుగుతుంది.
రిలయన్స్ ఇండస్ట్రీస్
రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL) సోమవారం, ఏప్రిల్ 28, 2025న, బలమైన Q4 ఫలితాలతో 3% పెరిగింది. RIL నికర లాభం 2.4% పెరిగి రూ.19,407 కోట్లను తాకింది, అలాగే వార్షిక ఆదాయం 10.5% వృద్ధితో రూ.2,61,388 కోట్లకు చేరుకుంది.
ఇవి కూడా చదవండి:
Viral Video: విరాట్, రాహుల్ మధ్య మాటల యుద్ధం.. నువ్వా నేనా, చివరకు ఏమైందంటే..
India Pakistan: భారత్ నుంచి పాకిస్తాన్‌కు 4 రోజుల్లో 537 మంది ప్రయాణం
Pakistan Citizens: భారత్ విడిచి వెళ్లని పాకిస్తానీలకు మూడేళ్ల జైలు శిక్ష, రూ.3 లక్షల జరిమానా
Akshay Tritiya: అక్షయ తృతీయకు గోల్డ్ కొనలా..వెయిట్ చేయాలా
Bank Holidays: మే 2025లో 12 రోజులు బ్యాంకులు బంద్.. పూర్తి లిస్ట్ ఇదే
NaBFIDలో అనలిస్టు పోస్టులకు నోటిఫికేషన్.. రూ.14 లక్షల జీతంతో మంచి ఛాన్స్
Read More Business News and Latest Telugu News