Share News

EPF Advance Process: పీఎఫ్ అడ్వాన్స్ విత్ డ్రా.. ఇంటి నుంచే ఇలా అప్లై చేయండి..

ABN , Publish Date - Feb 27 , 2025 | 09:08 PM

మధ్య తరగతి ఉద్యోగులకు అత్యవసర సమయంలో ఉపయోగపడే బెస్ట్ ఫండ్ ఏంటంటే, అనేక మంది పీఎఫ్ అని చెబుతుంటారు. అనారోగ్యం, జాబ్ లాస్, పెళ్లి సహా పలు కారణాలతో పీఎఫ్ ముందుగా తీసుకునే ఛాన్సుంది. అయితే ఆన్‌లైన్ విధానంలో ఎలా తీసుకోవాలనేది ఇక్కడ చూద్దాం.

EPF Advance Process: పీఎఫ్ అడ్వాన్స్ విత్ డ్రా.. ఇంటి నుంచే ఇలా అప్లై చేయండి..
PF Advance Withdrawal Process

అనేక మంది ఉద్యోగులకు పీఎఫ్ ఖాతా ఉంటుంది. ఆ క్రమంలో వారు చేసే జాబ్ సాలరీ నుంచి ప్రతి నెలకు కొంత మొత్తం వారి పీఎఫ్ ఖాతాకు చేరుతుంది. ఆ విధంగా ఎన్నేళ్లు జాబ్ చేస్తే అన్ని నెలల్లో పీఎఫ్ ఖాతాకు కొంత మొత్తం జమ అవుతుంది. అయితే ఆ మొత్తం నుంచి ఉద్యోగులు అత్యవసర సమయంలో కొంత మొత్తాన్ని పీఎఫ్ అడ్వాన్స్(EPF Advance Process) రూపంలో తీసుకోవచ్చు.

ఉదాహరణకు మీ పీఎఫ్ ఖాతాలో రూ. 50 వేలకుపైగా ఉంటే పాక్షికంగా మీరు అనారోగ్యం, పెళ్లి సహా పలు కారణాలతో రూ. 30 వేలకుపైగా తీసుకునే అవకాశం ఉంటుంది. దీని కోసం మీరు ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ విధానంలో కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే ఆన్‌లైన్ విధానంలో ఎలా అప్లై చేయాలనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.


  • మీ పీఎఫ్ ఖాతా నుంచి డబ్బును ఆన్‌లైన్‌లో ఉపసంహరించుకోవడానికి, మీరు ముందుగా అధికారిక వెబ్‌సైట్‌ను https://www.epfindia.gov.in/site_en/index.php సందర్శించాలి

  • ఆ తర్వాత హోమ్ పేజీ పక్కన ఉన్న సర్వీసెస్ ఆప్షన్ క్లిక్ చేసి, అందులో ఎప్లాయిస్ ఆప్షన్ ఎంచుకోవాలి

  • తర్వాత దానిలో రెండోదైన Member UAN/Online Service (OCS/OTCP) ఆప్షన్ క్లిక్ చేయాలి

  • అప్పుడు ఓపెన్ అయిన కొత్త విండోలో మీ UAN నంబర్, పాస్‌వర్డ్‌ వివరాలను నమోదు చేసి, లాగిన్ కావాలి

  • తర్వాత వచ్చిన విండోలో ‘ఆన్‌లైన్ సర్వీసెస్’ ట్యాబ్‌పై క్లిక్ చేసి, డ్రాప్-డౌన్ మెనూలో ‘క్లెయిమ్ (ఫారం-31, 19 & 10C)’ ఎంచుకోవాలి


  • అక్కడ మీ వివరాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి. మీరు పీఎఫ్ బ్యాంక్ ఖాతా నంబర్ నమోదు చేసి ‘వెరిఫై’పై క్లిక్ చేయాలి

  • ఆ తర్వాత ప్రొసీడ్ ఫర్ ఆన్‌లైన్ క్లెయిమ్ ఆప్షన్ క్లిక్ చేయాలి

  • అక్కడ మీరు PF అడ్వాన్స్ (ఫారం 31)ని ఎంచుకోవాల్సి ఉంటుంది

  • అప్పుడు కొత్త విభాగం ఓపెన్ అవుతుంది. అందులో 'అడ్వాన్స్‌గా అవసరమైన ప్రయోజనం' తెలియజేయాల్సి ఉంటుంది

  • దీంతోపాటు మీ ఖాతాలో ఎంత మొత్తం ఉంది, మీకు ఎంత అవసరమనేది తెలిపి, మీ చిరునామాను పేర్కొనాలి


  • ఆ తర్వాత వెరిఫికేషన్‌ ఆప్షన్‌పై క్లిక్ చేసి మీ దరఖాస్తును సమర్పించాలి

  • ఇప్పుడు మీరు అప్లై చేసుకున్న అడ్వాన్స్ పీఎఫ్ దరఖాస్తు ప్రక్రియ పూర్తవుతుంది

  • ఆ క్రమంలో EPFOలో రిజిస్టర్ చేయబడిన మీ మొబైల్ నంబర్‌కు SMS వస్తుంది

  • ఆ తర్వాత మీ EPF ఖాతా నుంచి మీరు ఎంచుకున్న కారణాన్ని బట్టి డబ్బు ఉపసంహరించబడుతుంది

  • మీరు అనారోగ్యం వంటి కారణాలను ఎంచుకుంటే మనీ త్వరగా నాలుగైదు రోజుల్లో వచ్చే అవకాశం ఉంటుంది


ఇవి కూడా చదవండి:

Instagram: ఇన్‌స్టాగ్రామ్‌లో హింసాత్మక కంటెంట్.. యూజర్ల ఫిర్యాదులు, అసలేమైంది..


Bank Holidays: మార్చి 2025లో బ్యాంకు సెలవులు.. ఈసారి ఎన్ని రోజులంటే..

Recharge Offer: నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి సవాల్

Read More Business News and Latest Telugu News

Updated Date - Feb 27 , 2025 | 09:47 PM