Indian Stock Market: సెన్సెక్స్ 530 పాయింట్ల జంప్.. డీఐఐల రికార్డు రూ. 3.56 లక్షల కోట్లు
ABN , Publish Date - Jun 25 , 2025 | 10:31 AM
దేశీయ స్టాక్ మార్కెట్లు (Indian Stock Market) బుధవారం పాజిటివ్ ధోరణితో మొదలయ్యాయి. గ్లోబల్ మార్కెట్లలో సానుకూల సంకేతాలు, ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ, తగ్గిన క్రూడ్ ధరలు, స్థిరమైన అమెరికా డాలర్ వంటి అంశాలు మార్కెట్ సెంటిమెంట్‌ను బలంగా మార్చాయి.

భారత స్టాక్ మార్కెట్లు (Indian Stock Market) బుధవారం ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ, క్రూడ్ ధరల పతనం, స్థిరమైన అమెరికన్ డాలర్ వంటి అనుకూల సంకేతాలతో మార్కెట్లు పుంజుకున్నాయి. ఈ క్రమంలో ఉదయం 10.20 గంటలకు సెన్సెక్స్ 527 పాయింట్లు ఎగిసిపడి 82,582కి చేరింది. నిఫ్టీ కూడా 138 పాయింట్లు పెరిగి 25,441 వద్ద నిలిచింది. మరోవైపు బ్యాంక్ నిఫ్టీ 103, నిఫ్టీ మిడ్ క్యాప్ 100 సూచీ 225 పాయింట్లు లాభపడింది. దీంతో బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ విలువ రూ. 453.31 లక్షల కోట్లకు చేరింది. గత సెషన్‌లో పోలిస్తే రూ. 3.07 లక్షల కోట్లు కొత్తగా వచ్చాయి.
డీఐఐల దూకుడు
రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్ (SIP) ద్వారా పెరుగుతున్న ఆదరణ డీఐఐలను స్థిరంగా ఉంచిందని నిపుణులు చెబుతున్నారు. మిడ్, స్మాల్ క్యాప్ స్టాక్స్ గ్రోత్ కూడా 2024లో ఈ రికార్డు కొనుగోళ్లకు కారణమన్నారు. అంతర్జాతీయ మార్కెట్లు, ప్రధానంగా నాస్‌డాక్ 100 రికార్డు గరిష్ఠాలకు చేరుకోవడంతో భారత మార్కెట్లకు ఊపునిచ్చింది. ఈ క్రమంలో బీఎస్‌ఈలో 48 షేర్లు 52 వారాల గరిష్ఠాలను తాకగా, 25 షేర్లు 52 వారాల కనిష్ఠాలకు చేరాయి. మొత్తం 3,225 షేర్లలో 2,467 షేర్లు లాభాల్లో, 623 షేర్లు నష్టాల్లో, 148 షేర్లు మార్పు లేకుండా ట్రేడయ్యాయి.
టాప్ గెయినర్స్ & లూజర్స్
సెన్సెక్స్‌లో టైటాన్, హెచ్‌సీఎల్ టెక్, హెచ్‌యూఎల్, భారతీ ఎయిర్‌టెల్, పవర్‌గ్రిడ్, రిలయన్స్, ఇన్ఫోసిస్ షేర్లు 1.51% వరకు పెరిగాయి. మరోవైపు భారత్ ఎలక్ట్రిక్, కోటక్ మహీంద్రా, SBI లైఫ్ ఇన్సూరెన్స్, ఐచర్ మోటార్స్, యాక్సిస్ బ్యాంక్ కంపెనీల స్టాక్స్ టాప్ 5 నష్టాల్లో ఉన్నాయి. బీఈఎల్, కోటక్ మహీంద్రా బ్యాంక్ మాత్రం 1% వరకు నష్టపోయాయి. కోటక్ సెక్యూరిటీస్ ఈక్విటీ రిసెర్చ్ హెడ్ శ్రీకాంత్ చౌహాన్ మాట్లాడుతూ బ్యాంక్ నిఫ్టీకి 56,100 వద్ద మద్దతు ఉందన్నారు. ఈ స్థాయి పైన ఉంటే 56,850-57,100 వైపు బౌన్స్ బ్యాక్ అవుతుందన్నారు. 56,100 కంటే తక్కువకు పడితే, 55,700-55,500 స్థాయిలకు చేరవచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు.
యూఎస్ మార్కెట్ల ర్యాలీ
మంగళవారం యూఎస్ మార్కెట్లు 1% కంటే ఎక్కువ ర్యాలీ చేశాయి. డౌ జోన్స్ 507 పాయింట్లు (1.2%), నాస్‌డాక్ కాంపోజిట్ 1.4% పెరిగాయి. ఇరాన్-ఇజ్రాయెల్ కాల్పుల విరమణతో క్రూడ్ ధరలు భారీగా పడిపోయాయి. యూఎస్ క్రూడ్ 6% తగ్గి $64.37 వద్ద, బ్రెంట్ క్రూడ్ కూడా పతనమైంది.
ఇవీ చదవండి:
జూన్ 25 నుంచి 30 వరకు వర్షాలు.. ఏ ప్రాంతాల్లో ఉన్నాయో తెలుసా..
ఈ యాప్ 20 లక్షల పోయిన ఫోన్‌లను గుర్తించింది.. ఎలాగంటే..
మరిన్ని ఏపీ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి