Sensex Fall: మార్కెట్లకు ట్రం పోటు
ABN , Publish Date - Aug 02 , 2025 | 03:39 AM
ట్రంప్ సుంకాల పోటుతో భారత స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా రెండో రోజూ భారీగా నష్టపోయాయి.

సెన్సెక్స్ 586 పాయింట్లు డౌన్
రూ.5 లక్షల కోట్ల సంపద ఆవిరి
ముంబై: ట్రంప్ సుంకాల పోటుతో భారత స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా రెండో రోజూ భారీగా నష్టపోయాయి. శుక్రవారం ట్రేడింగ్‌లో సెన్సెక్స్ ఒక దశలో 690 పాయింట్లు పతనమై 80,500 దిగువ స్థాయికి జారుకుంది. చివర్లో కాస్త కోలుకున్న సూచీ 585.67 పాయింట్ల నష్టంతో 80,599.91 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 203 పాయింట్లు కోల్పోయి 24,565.35 వద్ద ముగిసింది. ఈక్విటీ వర్గాల సంపదగా భావించే బీఎస్‌ఈ నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ ఒక్క రోజులోనే రూ.5 లక్షల కోట్లకు పైగా తరిగిపోయి రూ.444.52 లక్షల కోట్లకు జారుకుంది. గురువారం ట్రేడింగ్‌లోనూ సెన్సెక్స్ 296 పాయింట్లు, నిఫ్టీ 86 పాయింట్లకు పైగా కోల్పోయాయి. సెన్సెక్స్‌లోని 30 నమోదిత కంపెనీల్లో 23 నష్టపోగా.. సన్‌ఫార్మా 4.49ు క్షీణించి సూచీ టాప్ లూజర్‌గా మిగిలింది. ఫారెక్స్ ట్రేడింగ్‌లో డాలర్‌తో రూపాయి మారకం విలువ ఏకంగా 47 పైసలు పెరిగి రూ.87.18 వద్ద ముగిసింది.
సూచీల పతనానికి కారణాలివి..
భారత్‌పై 25 శాతం సహా ప్రపంచ దేశాలపై ట్రంప్ విధించిన సుంకాలు ఆగస్టు 1 నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ పరిణామం తమ ఎగుమతి వాణిజ్యంపై ప్రభావం చూపనుందన్న ఆందోళనలతో గ్లోబల్ మార్కెట్లతో పాటు దలాల్ స్ట్రీట్ ఇన్వెస్టర్లూ పెద్దఎత్తున అమ్మకాలకు పాల్పడ్డారు. ముఖ్యంగా ఫార్మా, మెటల్, ఐటీ రంగ షేర్లు అధిక ఒత్తిడికి లోనయ్యాయి. మన మార్కెట్ నుంచి విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎ్‌ఫఐఐ) పెట్టుబడులను వెనక్కి తీసుకుంటుండటం, అంతర్జాతీయంగా డాలర్ బలోపేతం, కంపెనీల జూన్ త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంత ఆశాజనకంగా లేకపోవడం, టెక్నికల్ చార్టుల్లో సూచీలు కీలక మద్దతు స్థాయిలను కోల్పోవడం ట్రేడింగ్ సెంటిమెంట్‌ను మరింత బలహీనపరిచిందని మార్కెట్ విశ్లేషకులు పేర్కొన్నారు.
ఎన్‌ఎ్‌సడీఎల్ ఐపీఓకు 41 రెట్ల స్పందన
నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ (ఎన్‌ఎ్‌సడీఎల్) రూ.4,011 కోట్ల ఐపీఓకు భారీ స్పందన లభించింది. శుక్రవారంతో ముగిసిన ఈ ఐపీఓకు ఇష్యూ సైజుతో పోలిస్తే 41.01 రెట్ల సబ్‌స్ర్కిప్షన్ నమోదైంది. క్యూఐబీలకు కేటాయించిన వాటా షేర్లకు ఏకంగా 103.97 రెట్ల బిడ్లు రాగా.. సంస్థాగతేతర ఇన్వెస్టర్ల వాటా షేర్లకు 34.98 రెట్లు, రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి 7.73 రెట్ల బిడ్లు దాఖలయ్యాయి. ఎన్‌ఎ్‌సడీఎల్.. ఈ నెల 6న షేర్లను స్టాక్ ఎక్స్ఛేంజీల్లో నమోదు చేయనుంది.
ఐదు వారాలుగా నెగిటివ్ జోన్‌లోనే..
ఈ వారం మొత్తానికి సెన్సెక్స్ 863.18 పాయింట్లు (1.05 శాతం), నిఫ్టీ 271.65 పాయిం ట్లు (1.09 శాతం) నష్టపోయా యి. నిఫ్టీ గడిచిన ఐదు వారాలుగా నష్టాల్లో కొనసాగుతోంది. సూచీ ఇన్ని వారాలుగా నష్టాల్లో కొనసాగడం 2023 ఆగస్టు తర్వాత మళ్లీ ఇదే మొదటిసారి.
ఇవి కూడా చదవండి
తప్పతాగి డ్యూటీకి.. అడ్డంగా జనానికి దొరికిపోయిన ఎస్ఐ
మాజీ క్లర్క్ అవినీతి దందా.. 15వేల జీతం.. 30 కోట్ల ఆస్తులు