Share News

SBI stops mCASH: ఎస్బీఐ కస్టమర్లకు షాక్.. ఇకపై ఆ పేమెంట్లకు నో ఛాన్స్.!

ABN , Publish Date - Nov 19 , 2025 | 09:42 PM

ఎస్బీఐ తన ఖాతాదారులకు షాక్ ఇవ్వనుంది. ఆన్‌లైన్ ద్వారా నగదు ట్రాన్స్ఫర్ చేయడం, క్లెయిమ్ చేస్కోవడానికి వీలుగా ఉన్న ఎంక్యాష్ ఆప్షన్‌ను త్వరలో నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. దీనికి బదులుగా మరో సురక్షితమైన డిజిటల్ మార్గాన్ని ఎంచుకోవాలని సూచించింది.

SBI stops mCASH: ఎస్బీఐ కస్టమర్లకు షాక్.. ఇకపై ఆ పేమెంట్లకు నో ఛాన్స్.!
SBI pulls the plug on mCASH

ఇంటర్నెట్ డెస్క్: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(State Bank of India) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది నవంబర్ 30 తర్వాత ఆన్‌లైన్ ఎస్బీఐ, యోనో లైట్( OnlineSBI and YONO Lite) ద్వారా ఎంక్యాష్(mCASH) పంపడం, క్లెయిమ్ చేసే సౌకర్యాన్ని నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది(SBI pulls the plug on mCASH). అంటే ఈ సేవలు నిలిపివేశాక.. బెనిఫిషరీ రిజిస్ట్రేషన్ లేకుండా అవతలి వ్యక్తులకు డబ్బు పంపడానికి గానీ, ఎంక్యాష్ లింక్ లేదా యాప్ ద్వారా నిధులను క్లెయిమ్ చేస్కోవడానికి అవకాశముండదని ఎస్బీఐ తన అధికారిక వెబ్‌సైట్లో పేర్కొంది.


కస్టమర్లు.. థర్డ్ పార్టీ లబ్ధిదారులకు డబ్బును పంపేందుకు ఇతర సురక్షితమైన డిజిటల్ చెల్లింపు పద్ధతులకు మారాలని ఎస్బీఐ సూచించింది. అంటే కస్టమర్లు లావాదేవీలు సాగించేందుకు ప్రత్యామ్నాయంగా ఉపయోగించే పద్ధతులలో NEFT, IMPS, RTGS, UPI మాత్రమే ఉన్నాయి. ఎంక్యాష్ కాకుండా వేరే ఏదైనా ప్లాట్‌ఫామ్‌ను ఎంచుకోవాలనుకునే కస్టమర్లు.. నగదు పంపడానికి, స్వీకరించడానికి ఎస్బీఐ యూపీఐని ఉపయోగించవచ్చని తెలిపింది. BHIM SBI Pay(SBI's UPI App) ద్వారా కూడా అన్ని బ్యాంకుల ఖాతాదారులకు డబ్బులు పంపడం, స్వీకరించడం సహా ఆన్‌లైన్ బిల్లు చెల్లింపులు, రీఛార్జ్, షాపింగ్ మొదలగు సేవలను పొందవచ్చని పేర్కొంది.


'భిమ్ ఎస్బీఐ పే' ద్వారా నగదు పంపేందుకు ఎస్బీఐ సూచనలు:

  • BHIM SBI Pay యాప్ తెరిచి అకౌంట్‌లోకి సైన్ ఇన్ అవ్వాలి.

  • హోమ్ స్క్రీన్‌లో కనిపించే ట్రాన్స్ఫర్ విధానంపై క్లిక్ చేయాలి.

  • ఎంచుకున్న చెల్లింపు పద్ధతిని నావిగేట్ చేయాలి. అంటే VPA, IFSC నంబర్, అకౌంట్ నంబర్ ఎంటర్ చేయడం లేదా క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయాలి.

  • క్యాష్ ట్రాన్స్ఫర్‌ను సులభతరం చేసేందుకు వీలుగా అవసరమైన వివరాలివ్వాలి.

  • యాప్‌లో రిజిస్టర్డ్ అయిన మన బ్యాంక్ అకౌంట్(ఏ అకౌంట్ నుంచి పంపాలి అనుకున్నామో) ను ఎంచుకోవాలి. ఆ తర్వాత టర్మ్స్ అండ్ కండీషన్స్‌పై క్లిక్ చేయాలి.

  • ట్రాన్స్ఫర్ అనుమతించేందుకు మనం సెట్ చేస్కున్న యూపీఐ పిన్‌ను ఎంటర్ చేసి, సబ్మిట్ చేయాలి.


ఇవీ చదవండి:

హిడ్మా ఎన్‌కౌంటర్.. ప్రొ.హరగోపాల్ కీలక వ్యాఖ్యలు

అందుకే మారేడుమిల్లికి వచ్చిన మావోయిస్టులు.. జిల్లా ఎస్పీ

Updated Date - Nov 19 , 2025 | 09:55 PM