Unclaimed Money: మీకు హక్కున్న 'అన్‌క్లెయిమ్డ్ డబ్బు' తీసుసుకోండి త్వరగా.. గోల్డెన్ ఛాన్స్
ABN , Publish Date - Nov 19 , 2025 | 05:50 PM
ఎవరో చెప్పారని, ఎప్పుడో.. ఏదోక బ్యాంకు ఖాతాలోనో, మరో స్కీంలోనో మనీ వేస్తాం. తర్వాత వాటిని వాడ్డం మానేస్తాం. ఇలా మనం చేయొచ్చు. మన పేరెంట్స్, తాతముత్తాతలు ఎవరైనా. ఇలాంటి రూ. లక్షల కోట్ల సొమ్ము బ్యాంకుల్లో మూలుగుతోందని మీకు తెలుసా.. అది ఇప్పుడు తీసుకోవచ్చు.
ఇంటర్నెట్ డెస్క్: మీరు, లేదా మీ నాన్నగారు, లేదా మీ తాతలు.. బ్యాంకులు, లేదా నాన్ బ్యాంకింగ్ సంస్థల్లో మదుపు చేసి మర్చిపోయిన, లేదా మిగులు సొత్తు మీకు దక్కే ఛాన్స్ ఇప్పుడు వచ్చింది. కేంద్రం ఇటీవల ఈ సొమ్ములు తీసుకునేందుకు చాలా సులువైన వెసులుబాటు కల్పిస్తోంది. సదరు సొత్తుకు మీరు హక్కుదారులు, లేదా వారసులైన ఎడల నిరూపయోగంగా బ్యాంకుల్లో ఉండిపోయిన సదరు సొమ్ములు చాలా సులభంగా మీ చేతికి వస్తాయి.
బ్యాంకుల్లో మిగిలిన చిన్న మొత్తాలు, డిపాజిట్లు, ఇలా ఎన్నో వివరాల గురించి చాలా మందికి తెలియకపోవడం సాధారణం. భారత రిజర్వ్ బ్యాంక్ (RBI) ప్రకారం, బ్యాంకు ఖాతాల్లో 10 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం అలా మిగిలిన డబ్బులు 'అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లు'గా పరిగణించబడతాయి. ఇవి సేవింగ్స్, కరెంట్ అకౌంట్లు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లు, లోన్ బ్యాలెన్స్‌లు, చెక్‌లు, NEFT ట్రాన్స్‌ఫర్లు, ప్రీపెయిడ్ కార్డుల్లో మిగిలిన మొత్తాలు లేదా విదేశీ కరెన్సీ డిపాజిట్లు కూడా ఉండవచ్చు.
ఇటువంటి మొత్తాలు బ్యాంకులు నెలవారీగా సమీక్షించి, RBI డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్‌నెస్ ఫండ్ (DEA)కి బదిలీ చేస్తాయి. ఈ సొమ్ములే ఇప్పుడు అర్హులైన వారికి అందజేసేందుకు మోదీ సర్కారు చర్యలు చేపట్టింది. దీనికి సంబంధించి గత నెలలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా బ్యాంకింగ్ పెద్దలతో కలిసి ఒక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.
మీరు సదరు సొమ్ములు ఎలా తిరిగి పొందాలి?
ఈ ప్రక్రియ చాలా సులభం, ఇంకా వేగవంతం కూడా. మీ బ్యాంకు ఖాతా వివరాలను చూసుకోండి. బ్యాంకు వెబ్‌సైట్ లేదా యాప్‌లో లాగిన్ అయి, పాత ఖాతాలు లేదా మెచ్యూరిటీ పూర్తయిన FDలను తనిఖీ చేయండి. RBI వెబ్‌సైట్‌లో DEA సెక్షన్‌లో కూడా మీరు చెక్ చేయవచ్చు. లేని పక్షంలో బ్యాంకు బ్రాంచ్‌లో సహాయం తీసుకోండి.
క్లెయిమ్ చేయడానికి స్టెప్-బై-స్టెప్ ప్రాసెస్:
బ్యాంకు బ్రాంచ్‌కు వెళ్లండి: మీ ఖాతా ఉన్న ఏ బ్రాంచ్ అయినా సందర్శించండి. ఆన్‌లైన్‌లో కూడా కొన్ని బ్యాంకులు ఫామ్ అందిస్తాయి.
ఫామ్ ఫిల్ చేయండి: సింపుల్ క్లెయిమ్ ఫామ్ తీసుకుని, మీ వివరాలు (ఖాతా నంబర్, మొత్తం వివరాలు) రాయండి.
KYC డాక్యుమెంట్లు సమర్పించండి: ఆధార్ కార్డు, వోటర్ ID, పాస్‌పోర్ట్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ వంటి డాక్యుమెంట్లు పొందుపర్చండి.
వెరిఫికేషన్: బ్యాంకు సిబ్బంది వెరిఫై చేసిన తర్వాత, మీ డబ్బు (ఇంట్రెస్ట్‌తో సహా, ఒకవేళ ఇది ఇంట్రెస్ట్ బేరింగ్ అయితే) నిమిషాల్లో మీ ఖాతాకు డిపాజిట్ చేస్తారు.
ఒక వేళ ఖాతా హోల్డర్ మరణించినా, కుటుంబ సభ్యులు డాక్యుమెంట్లతో క్లెయిమ్ చేయవచ్చు. బ్యాంకులు నెలవారీగా రివ్యూ చేస్తాయి కావున, ఆలస్యం చేయకుండా మీ సొమ్ములు మీరు చేజిక్కించుకోండి. ఈ సువర్ణావకాశాన్ని జారవిడువకండి. ఈ సొమ్ములు మీకు ఎంతో ఉపకరిస్తాయి. పూర్తి వివరాలకోసం ఆర్బీఐ వెబ్ సైట్ లింక్ చూడొచ్చు. https://website.rbi.org.in/web/rbi/-/notifications/unclaimed-deposits-inoperative-accounts-in-banks-display-list-of-inoperative-accounts-9580?p_l_back_url=%2Fweb%2Frbi%2Fsearch%3Fq%3DUnclaimed%2BDeposits%2B%2B%2BInoperative%2BAccounts%2Bin%2BBanks%2BDisplay%2Blist%2Bof%2BInoperative%2BAccounts%26type%3Dcom.liferay.journal.model.JournalArticle%26type%3Dcom.liferay.portal.kernel.model.Layout%26togs%3Dexact%26orderBy%3Dnewest
ఇవి కూడా చదవండి..
ఎర్రకోట బ్లాస్ట్‌లో షాకింగ్ అప్‌డేట్.. పార్కింగ్ లాట్‌లోనే బాంబు తయారు చేసి..
టీవీకే సభ్యులకు క్యూ ఆర్ కోడ్‌తో గుర్తింపు కార్డులు
మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..