Reliance: ఆపిల్‌ను అధిగమించిన రిలయన్స్.. ప్రపంచవ్యాప్తంగా రెండో స్థానం..
ABN , Publish Date - Feb 17 , 2025 | 05:05 PM
ప్రముఖ భారత వ్యాపార సంస్థ రిలయన్స్ సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఫ్యూచర్ బ్రాండ్ 2024 ప్రతిష్టాత్మక గ్లోబల్ ర్యాంకింగ్‌లో ఈ సంస్థ రెండో స్థానంలో నిలిచింది. ఈ క్రమంలో కీలక సంస్థలను వెనక్కి నెట్టి ముందుకెళ్లింది.

దేశంలోని ప్రముఖ వ్యాపార కంపెనీలలో రిలయన్స్(Reliance), అదానీ, టీసీఎస్, మహీంద్రా వంటి పలు సంస్థల పేర్లు అనేక సందర్భాల్లో వింటుంటాం. అయితే రిలయన్స్ ఇండస్ట్రీస్ మాత్రం ఈసారి అరుదైన ఘనతను దక్కించుకుంది. ఫ్యూచర్ బ్రాండ్ ఇండెక్స్ 2024లో చరిత్ర సృష్టించింది. ఈ సూచికలో ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీల్లో ఒకటైన ఆపిల్‌ను వెనక్కి నెట్టి, రిలయన్స్ రెండో స్థానం దక్కించుకుంది.
ఒక భారతీయ కంపెనీ టాప్-3లో చోటు సంపాదించడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ఈ ర్యాంకింగ్‌లో రిలయన్స్ తన స్థానం 13 నుంచి ఏకంగా రెండో స్థానానికి ఎగబాకింది. ఈ క్రమంలో ఆపిల్, నైక్, వాల్ట్ డిస్నీ, నెట్‌ఫ్లిక్స్, మైక్రోసాఫ్ట్, ఇంటెల్ వంటి కీలక సంస్థలను వెనక్కి నెట్టి ముందుకెళ్లింది.
ఏడాదిలోనే..
ఈ క్రమంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రగతి అద్భుతంగా ఉందని చెప్పవచ్చు. ఒక సంవత్సరంలోనే ఈ కంపెనీ ర్యాంకింగ్‌లో 11 స్థానాలు ఎగబాకింది. 2023లో ఈ సంస్థ 13వ స్థానంలో ఉండగా, 2024లో ఆపిల్ వంటి ప్రపంచ బ్రాండ్లను వెనక్కి నెట్టి రెండో స్థానానికి చేరింది. కంపెనీ ప్రగతికి ప్రధాన కారణం పలు ఉత్పత్తులు సేల్స్ పెరగడంతోపాటు స్టాక్ మార్కెట్లో వాటి పనితీరు కూడా వృద్ధి చెందడమేనని తెలుస్తోంది. ఈ ర్యాంకింగ్‌లో మరో ప్రధాన మార్పు ఏమిటంటే అమెరికా ఆధిపత్యం తగ్గిపోవడం. 2014లో టాప్ 10 బ్రాండ్లలో ఎక్కువభాగం అమెరికాకు చెందినవే ఉన్నాయి. కానీ 2024 నాటికి టాప్ 10లో 4 మాత్రమే అమెరికా కంపెనీలు ఉన్నాయి.
మొదటి స్థానంలో..
2014లో టాప్ 10 బ్రాండ్లలో ఎక్కువభాగం అమెరికాకు చెందినవే ఉన్నాయి. కానీ 2024 నాటికి టాప్ 10లో నాలుగు మాత్రమే అమెరికా కంపెనీలు ఉన్నాయి. మరో ఐదు కంపెనీలు ఆసియా-పసిఫిక్ (APAC) మధ్యప్రాచ్య దేశాల నుంచి వచ్చాయి. ఇది బ్రాండ్ అభివృద్ధి సూచిక ప్రకారం ఏ విధంగా APAC, మధ్యప్రాచ్య దేశాలు భారీగా పెట్టుబడులు పెడుతున్నాయో సూచిస్తుంది.
ఈ ర్యాంకింగ్‌లో శాంసంగ్ సంస్థ మొదటి స్థానం సంపాదించింది. 2023లో ఇది ఐదో స్థానంలో ఉండగా, ఈసారి నంబర్ వన్ స్థానంలో నిలిచింది. శాంసంగ్ విజయానికి వారి కొత్త ఆవిష్కరణలు, మార్కెట్‌లో డిమాండ్ పెరగడం వంటివి కారణాలుగా తెలుస్తోంది. 2023లో ఆపిల్ నంబర్ వన్ స్థానంలో ఉండగా, ఈసారి అది మూడో స్థానానికి చేరుకుంది.
ఫ్యూచర్ బ్రాండ్ ఇండెక్స్ అంటే ఏంటి?
ఫ్యూచర్ బ్రాండ్ ఇండెక్స్ అనేది టాప్ 100 కంపెనీలకు ర్యాంక్ ఇస్తుంది. ఈ ర్యాంకింగ్‌లో నిపుణులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీలను సమగ్రంగా పరిశీలించి బ్రాండ్‌లకు ర్యాంకింగ్ నిర్ణయిస్తారు. సాంప్రదాయ ర్యాంకింగ్‌లు సాధారణంగా ఆర్థిక పనితీరును మాత్రమే పరిగణలోకి తీసుకుంటాయి. కానీ ఫ్యూచర్‌బ్రాండ్ ఇండెక్స్ ఈ బ్రాండ్‌లకు మార్కెట్లో ఉన్న ప్రభావం, వినియోగదారుల విశ్వాసం, బ్రాండ్ అభివృద్ధి క్రమాన్ని బట్టి అంచనా వేస్తాయి. ఈ ర్యాంకింగ్ విషయంలో కొన్ని బ్రాండ్లు తమ ఆధిపత్యాన్ని కూడా కోల్పోయాయి. ఉదాహరణకి బోయింగ్, వోక్స్‌వ్యాగన్ వంటి కంపెనీలు ఈ ర్యాంకింగ్స్ నుంచి పూర్తిగా తొలగించబడ్డాయి. 2014లో బోయింగ్ 12వ స్థానంలో ఉండగా, వోక్స్‌వాగన్ 17వ స్థానంలో నిలిచింది. బ్రాండ్ అవగాహనలో వచ్చిన మార్పుల కారణంగా ప్రస్తుతం ఇవి ర్యాంకింగ్‌లో లేకుండా పోయాయి.
ఇవి కూడా చదవండి:
CBSE Board Exam 2025: సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్ష పేపర్ లీక్.. బోర్డ్ క్లారిటీ
New FASTag Rules: ఫాస్టాగ్ యూజర్లకు అలర్ట్.. ఇవి పాటించకుంటే ఫైన్..
New Delhi: ఇళ్ల ధరల పెరుగుదలలో టాప్ 15 నగరాలు.. ఇండియా నుంచి..
BSNL: రీఛార్జ్‌పై టీవీ ఛానెల్‌లు ఉచితం.. క్రేజీ ఆఫర్
Next Week IPOs: ఈ వారం కీలక ఐపీఓలు.. మరో 6 కంపెనీల లిస్టింగ్
Read More Business News and Latest Telugu News