Share News

Bank Nifty Record: ఆర్బీఐ సంచలన నిర్ణయం.. ఆల్ టైం గరిష్టానికి చేరుకున్న బ్యాంక్ నిఫ్టీ

ABN , Publish Date - Jun 09 , 2025 | 10:13 AM

భారత్ స్టాక్ మార్కెట్లో ఈరోజు (జూన్ 9, 2025న) బుల్ జోరు కొనసాగుతోంది. ఈ క్రమంలో బ్యాంకింగ్ రంగం మార్కెట్లలో సంచలనం సృష్టించింది. దీంతో బ్యాంక్ నిఫ్టీ (Bank Nifty Record) సూచీ సరికొత్త గరిష్టాన్ని తాకి మరో స్థాయికి చేరుకుంది.

Bank Nifty Record: ఆర్బీఐ సంచలన నిర్ణయం.. ఆల్ టైం గరిష్టానికి చేరుకున్న బ్యాంక్ నిఫ్టీ
Bank Nifty Record

భారత స్టాక్ మార్కెట్లు (indian stock market) వారంలో మొదటిరోజైన సోమవారం (జూన్ 9, 2025న) లాభాలతో మొదలయ్యాయి. ఇదే సమయంలో బ్యాంక్ నిఫ్టీ (Bank Nifty Record) సూచీ సరికొత్త రికార్డు సృష్టించింది. ఈరోజు ఉదయం 9:30 గంటల సమయంలో బ్యాంక్ నిఫ్టీ 57,000 స్థాయిని తాకి, కొత్త గరిష్ట స్థాయికి చేరుకుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఊహించని విధంగా రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు తగ్గించడం, అలాగే క్యాష్ రిజర్వ్ రేషియో (CRR)ను కూడా తగ్గించడంతో బ్యాంకింగ్ రంగంలో ఉత్సాహం నెలకొంది.


టాప్ 5 స్టాక్స్

ఈ క్రమంలో ఉదయం 10.15 గంటలకు బ్యాంక్ నిఫ్టీ సూచీ 56,995.75 వద్ద 0.44% పెరిగి, 411 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. ఇదే సమయంలో నిఫ్టీ మిడ్ క్యాప్ 100 సూచీ కూడా 551 పాయింట్లు ఎగబాకింది. సెన్సెక్స్ 327 పాయింట్లు లాభపడగా, నిఫ్టీ 117 పాయింట్లు వృద్ధి చెందింది. ఈ క్రమంలో ప్రస్తుతం కోటక్ మహీంద్రా, జియో ఫైనాన్షియల్, శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్ కంపెనీల స్టాక్స్ టాప్ 5 లాభాల్లో ఉండగా.. భారతీ ఎయిర్‌టెల్, HDFC లైఫ్, ICICI బ్యాంక్, SBI లైఫ్ ఇన్సురెన్స్, అపోలో హాస్పిటల్ సంస్థల స్టాక్స్ టాప్ 5 నష్టాల్లో ఉన్నాయి.


రెపో రేటు తగ్గింపు అంటే ఏంటి

రెపో రేటు అనేది బ్యాంకులు ఆర్‌బీఐ నుంచి అప్పు తీసుకునే వడ్డీ రేటు. ఈ రేటు తగ్గితే, బ్యాంకులకు అప్పు తీసుకోవడం చౌకగా మారుతుంది. ఫలితంగా, అవి కస్టమర్లకు తక్కువ వడ్డీ రేట్లతో రుణాలు ఇస్తారు. జూన్ 6, శుక్రవారం ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ (MPC) రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు తగ్గించి 5.5%కి చేర్చింది. ఇంతకు ముందు ఏప్రిల్‌లో కూడా 25 బేసిస్ పాయింట్ల తగ్గింపుతో రెపో రేటు 6.25% నుంచి 6%కి తగ్గింది. ఈ రెండు వరుస తగ్గింపులు మార్కెట్‌లో సానుకూల వాతావరణాన్ని సృష్టించాయి.


బ్యాంకులకు ఎలా ఉపయోగం

క్యాష్ రిజర్వ్ రేషియో (CRR) అనేది బ్యాంకులు ఆర్‌బీఐ వద్ద ఉంచవలసిన నగదు నిల్వల శాతం. ఈ సీఆర్‌ఆర్‌ను ఆర్‌బీఐ 100 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీనిని నాలుగు దశల్లో అమలు చేస్తారు. సెప్టెంబర్ 6, అక్టోబర్ 4, నవంబర్ 1, నవంబర్ 29 నుంచి దశలవారీగా 25 బేసిస్ పాయింట్ల చొప్పున తగ్గుతుంది. ఈ తగ్గింపు వల్ల బ్యాంకుల వద్ద ఎక్కువ నగదు అందుబాటులో ఉంటుంది. దీంతో అవి మరింత రుణాలు ఇవ్వగలవు. ఇది బ్యాంకుల లాభాలను పెంచడంతో పాటు, ఆర్థిక వ్యవస్థలో డబ్బు ప్రవాహాన్ని మెరుగుపరుస్తాయి.


బ్యాంక్ నిఫ్టీలో ఏ బ్యాంకులు లాభపడ్డాయి?

ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ సూచీలో కోటక్ మహీంద్రా బ్యాంక్, కెనరా బ్యాంక్, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ వంటివి 1.5% నుంచి 2.5% వరకు లాభాలు ఆర్జించాయి. అలాగే ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రైవేట్ రంగ బ్యాంకుల సూచీలు కూడా గణనీయమైన లాభాలను నమోదు చేశాయి.


ఇవీ చదవండి:

రెస్టారెంట్‌లో లేట్ సర్వీస్..హోటల్ ధ్వంసం చేసిన కస్టమర్లు

ప్రధానిని పలకరించిన యూనస్..బంగ్లాదేశ్ నుంచి మోదీకి సందేశం

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jun 09 , 2025 | 10:25 AM