Pi Coin Launch : బిట్‌కాయిన్‌కు పోటీగా Pi కాయిన్..విడుదలకు ముందే సెన్సేషన్.. అసలేంటీ Pi కాయిన్..
ABN , Publish Date - Feb 20 , 2025 | 02:58 PM
Pi Coin Launch : బిట్‌కాయిన్‌కు పోటీగా పై కాయిన్ స్టాక్ మార్కెట్లో అడుగుపెట్టబోతోంది. స్పాట్ ట్రేడింగ్ పెయిర్ లిస్టింగ్ వార్త వెలువడిన వెంటనే Pi కాయిన్ ధర అమాంతం 106%కి పెరిగింది. అసలేంటి Pi కాయిన్.. దీని ధర, లాంచింగ్, తదితర పూర్తి వివరాలు..

Pi Coin Launch Today : అందరూ చాన్నాళ్లుగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న Pi నెట్‌వర్క్ ఈ రోజు (గురువారం ఫిబ్రవరి 20, 2025న) ప్రారంభం కాబోతోంది. క్లోజ్, టెస్టింగ్ దశ పూర్తి చేసుకుని ఇవాళ సాయంత్రం ఓపెన్ మెయిన్‌నెట్ లాంచ్ చేయబోతోంది. Pi ఓపెన్ నెట్‌వర్క్ త్వరలోనే బ్లాక్ చెయిన్, ఇతర నెట్‌వర్క్‌లలో అందుబాటులోకి వచ్చే అవకాశముంది. Pi కాయిన్ రాక క్రిప్టోకరెన్సీ రంగంలో పెను మార్పులు తీసుకువస్తుందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. ఇంతకీ, Pi కాయిన్ ప్రత్యేకత ఏంటి.. ఎలా కొనుగోలు చేయాలి.. ఉపయోగాలు.. తదితర పూర్తి వివరాలు మీకోసం..
Pi నెట్‌వర్క్ అంటే ఏమిటి ?
Pi నెట్‌వర్క్ ఒక ప్రత్యేకమైన క్రిప్టోకరెన్సీ ప్లాట్‌ఫాం. మొబైల్స్ ద్వారా వినియోగదారులు ఈ నెట్‌వర్క్‌కి సులభంగా కనెక్ట్ అయ్యి Pi కాయిన్స్ మైనింగ్, సెండింగ్ చేయవచ్చు. బ్లాక్‌చెయిన్‌లోని వివిధ వివిధ యాప్‌లకు కూడా ఈ నెట్‌వర్క్ మద్దతు ఇస్తుంది.
Gold and Silver Prices Today: గుడ్ న్యూస్ చెప్పిన బులియన్ మార్కెట్.. బంగారం, వెండి ధరలు ఇవే..
Pi కాయిన్ ధర
ప్రముఖ ఎక్స్ఛేంజ్‌లో PI/USDT స్పాట్ ట్రేడింగ్ పెయిర్ లిస్టింగ్ వార్త వ్యాపించగానే Pi కాయిన్ ధర అమాంతం 106%నికి ఎగబాకి 100 డాలర్ల మార్క్ దాటింది. ప్రస్తుతం బినాన్స్‌లో ఒక Pi కాయిన్ ధర దాదాపు 30 డాలర్లుగా ఉంది. 24 గంటల్లో 6.62 మిలియన్ డాలర్ల ట్రేడింగ్ చేసింది.
Pi కాయిన్ సంపాదించాలంటే..
ముందుగా Pi నెట్‌వర్క్ యాప్ డౌన్‌లౌడ్ చేసుకోవాలి. ఫేస్‌బుక్ లేదా ఫోన్ నంబర్‌తో సైన్ అప్ అవ్వాలి. తర్వాత మీ ప్రొఫైల్‌ను పూర్తి చేయండి.
బోల్ట్ ఐకాన్‌పై క్లిక్ చేసి Pi కాయిన్స్ మైనింగ్ ప్రారంభించండి. ప్రతి 24 గంటలకు ఒకసారి యాప్ ఓపెన్ చేసి మైనింగ్ చేయాలి.
3 రోజుల తర్వాత మీ మైనింగ్ రేట్ పెంచుకునేందుకు నమ్మకస్తులైన 3-5 మందితో కలిసి సెక్యూరిటీ సర్కిల్ క్రియేట్ చేయండి.
ఎక్కువ కాయిన్లు సంపాదించాలి అంటే మీకు తెలిసిన వారికి రెఫరల్ కోడ్ షేర్ చేయండి. మైనింగ్ రేట్ పెరగడంతో పాటు రివార్డ్స్ కూడా దక్కుతాయి.
చర్చలు, పోల్స్ లేదా కొత్త ఫీచర్‌లు పరీక్షించడంలో పాల్గొనండి. మీ మైనింగ్ రేటును పెరుగుతుంది.
ముందుగా దీని విధివిధానాలపై పూర్తిగా అధ్యయనం చేయండి. పెట్టుబడులు పెట్టడం, ఏజెంట్లుగా, ప్రమోటర్లుగా వ్యవహరించడం వంటి 3 మార్గాల ద్వారా మీ సంపాదన మరింతగా పెంచుకోవచ్చు.
ముఖ్య గమనిక : క్రిప్టో కరెన్సీ కొనుగోలుకు ఏబీఎన్ బాధ్యత వహించదు. కొనుగోలును ప్రోత్సహించదు.
Read Also : అదానీలపై దర్యాప్తులో సాయం చేయండి
భారత ఫార్మాకు ట్రంప్ సుంకాల ముప్పు
డిపాజిట్ ఇన్సూరెన్స్ రూ.8-12 లక్షలకు పెంపు!?
మరిన్ని బిజినెస్, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..