Share News

Indian Railways: రైల్వే స్టేషన్‌లో మీరు ఏమి కొన్నా బిల్లు తీసుకోవాలని తెలుసా.. లేకపోతే ఏమవుతుంది

ABN , Publish Date - Mar 08 , 2025 | 05:17 PM

రైల్వే స్టేషన్‌లోని దుకాణాల్లో ఏ వస్తువు కొనుగోలు చేసినా బిల్లు తీసుకోవాలని తెలుసా. ఎవరైనా దుకాణదారుడు బిల్లు ఇవ్వకపోతే వస్తువు పూర్తి ఉచితమని మీకు తెలుసా. బిల్లు ఎందుకు తీసుకోవాలి. రైల్వే స్టేషన్‌లోని ఎలాంటి వస్తువులకు బిల్లు ఇస్తారు.

Indian Railways: రైల్వే స్టేషన్‌లో మీరు ఏమి కొన్నా బిల్లు తీసుకోవాలని తెలుసా.. లేకపోతే ఏమవుతుంది
Railway Station

రైలులో ప్రయాణీకులు తమకు ఏమి కావాలన్నా రైల్వే స్టేషన్‌లోని దుకాణాల్లో కొనుగోలు చేస్తుంటారు. దగ్గర ప్రయాణం చేసే వారైతే తమకు కావలసిన ఆహారంతో పాటు ఇతర వస్తువులను ఇంటి నుంచే తెచ్చుకుంటారు. మరికొందరు ఆహారాన్ని బయటనుంచి తెచ్చుకుంటారు. కానీ కొన్ని పరిస్థితుల్లో రైల్వే స్టేషన్లలోని దుకాణాల్లో ఏవైనా వస్తువులు కొనాల్సి ఉంటుంది.


రైలు ఆలస్యమైనప్పుడు లేదా రైలు దిగిన వెంటనే రైల్వేస్టేషన్‌లోని రెస్టారెండ్లు, క్యాంటీన్లలో తింటుంటాం. రైల్వే స్టేషన్లలో ఏవైనా వస్తువులు కొనుగోలు చేస్తే ఎంఆర్‌పికంటే ఎక్కువ ధర తీసుకుంటుంటారు. సాధారణంగా రైల్వే స్టేషన్లలోని దుకాణాల్లో ఏ వస్తువు కొన్నా ఎంఆర్‌పి కంటే ఎక్కువ ధర వసూలు చేయడానికి వీలు లేదు. అయినప్పటికీ రూ.40 ఎంఆర్‌పి ఉండే కూల్ డ్రింక్ బాటిల్‌పై రూ.50 తీసుకుంటారు. సాధారణంగా ఏ వస్తువుపై అయినా రూ.5 నుంచి రూ.10 ఎక్కువ తీసుకుంటారు. సాధారణంగా చాలామంది ప్రయాణీకులు సమయం తక్కువ ఉండటంతో పాటు ప్రయాణ సమయం కావడంతో అడిగినంత ఇచ్చి వచ్చేస్తుంటారు. కొంతమంది మాత్రం ఎంఆర్‌పి ధర మాత్రమ చెల్లిస్తానని చెబుతారు. అలా చెప్పినప్పుడు కొన్ని సందర్భాల్లో వాగ్వాదం చోటుచేసుకునే అవకాశాలు ఉంటాయి. ఏది ఏమైనా రైల్వే స్టేషన్‌లోని దుకాణాలు ఏది కొనుగోలు చేసినా ఎంఆర్‌పి ధరకు మించి తీసుకోవడానికి వీలు లేదు. ఒకవేళ ఎంఆర్‌పికంటే ఎక్కువ తీసుకునే సందర్భాల్లో ఏమి చేయాలో తెలుసుకుందాం.


బిల్లు తప్పనిసరి..

రైల్వేస్టేషన్‌లోని వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలను ఐఆర్‌సీటీసీ నిర్వహిస్తుంది. ఇండియన్ రైల్వే క్యాటరింగ్, టూరిజం కార్పొరేషన్ రైల్వే స్టేషన్‌లోని దుకాణాలను లీజుకు ఇస్తుంది. లీజుకు ఇచ్చే సమయంలో తప్పనిసరిగా నియమ, నిబంధనలను పాటించాలని షరతులు విధిస్తుది. ఏ వస్తువైనా ఎంఆర్‌పి ధరకు మాత్రమే విక్రయించాలని షరతుల్లో పేర్కొంటుంది. కానీ చాలామంది వెండర్లు ఈ నియమ నిబంధనను పాటించరు. ఎంఆర్‌పి కంటే ఎక్కవ ధర వసూలు చేస్తారు. అందుకే ఇటీవల కాలంలో రైల్వే స్టేషన్‌లో ఏ వస్తువు కొనుగోలు చేసినా తప్పనిసరిగా బిల్లు పొందే అవకాశాన్ని భారతీయ రైల్వే కల్పిస్తోంది. రైల్వే స్టేషన్‌లోని ప్రతి దుకాణంలో బిల్లు ఇవ్వకపోతే ఏ వస్తువైనా ఉచితం అనే బోర్డులు కనిపిస్తాయి. కానీ చాలామంది ఈ విధానాన్ని అమలు చేయడం లేదు. ప్రతి వస్తువుకు బిల్లు జనరేట్ చేస్తే ఎంఆర్‌పికి మించి వసూలుచేయడానికి వీలుండదు. అందుకే ఈ విధానం కేవలం బోర్డులకు మాత్రమేపరిమితమవుతుంది. కానీ కొనుగోలు చేసిన ప్రతి వస్తువుకు బిల్లు పొందడం ప్రయాణీకుడి హక్కు. ఎవరైనా బిల్లు ఇవ్వడానికి నిరాకరిస్తే వారిపై స్టేషన్ మేనేజర్‌కు లేదా ఫిర్యాదుల విభాగంలో ఫిర్యాదు చేయవచ్చు. కొనుగోలు చేసిన వస్తువులకు బిల్లు అడిగి తీసుకుంటే ఎక్కువ రుసుము వసూలు చేయడానికి వీలుండదు.


నాణ్యతలో లోపాలున్నా..

రైల్వే స్టేషన‌లో కొనగోలు చేసిన వస్తువులో నాణ్యతా లోపాలుంటే ఫిర్యాదు చేయవచ్చు. కానీ ఫిర్యాదు చేయాలంటే ఆ వస్తువు ఎక్కడ కొనుగోలు చేశామో అక్కడ బిల్లు పొందం తప్పనిసరి. బిల్లు లేకపోతే ఫిర్యాదును స్వీకరించరు. చాలామంది రైల్వే స్టేషన్‌లో ఏ వస్తువు కొనుగోలు చేసినా బిల్లులు తీసుకోరు. బిల్లు తీసుకోవడం ద్వారా ఎంఆర్‌పి ధర మాత్రమే తీసుకుంటారు అంతేకాకుండా నాణ్యతా లోపాలపై ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుంది.


ఇవి కూడా చదవండి

తుర్లపాటి రాజేశ్వరికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం

హైదరాబాద్‌లో చిన్నారిపై వీధి కుక్కల దాడి

ఎకరా టార్గెట్‌ 100 కోట్లు!

ఖమ్మం జిల్లాలో చిరుతపులి సంచారం కలకలం..

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Telugu News Click Here

Updated Date - Mar 08 , 2025 | 05:17 PM