Flipkart Mega Sale: మే 1 నుంచి ఫ్లిప్‌కార్ట్ మెగా సేల్.. కస్టమర్లకు జాక్‌పాట్.. ఈ వస్తువులపై 50% తగ్గింపు..
ABN , Publish Date - Apr 27 , 2025 | 11:23 AM
Flipkart Big Saving Days May 1: మీరు AC, స్మార్ట్ టీవీ లేదా ఐఫోన్ తక్కువ ధరలోనే కొనుగోలు చేయాలని చూస్తుంటే ఇదో గొప్ప ఛాన్స్. ఫ్లిప్‌కార్ట్ త్వరలోనే మెగా సేల్‌ను ప్రారంభించనుంది. ఈ వస్తువులైతే సగం ధరకే కొనుక్కోవచ్చు. ఇతర ఉపకరణాలపైనా భారీ తగ్గింపు.

Flipkart Big Saving Days May 1: ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ త్వరలో మెగా సేల్ మొదలుపెట్టనుంది. కోట్లాది మంది కస్టమర్ల కోసం SASA LELE సేల్‌ను తీసుకురాబోతోంది. ఈ సేల్ మే 2, 2025 నుంచి ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లో ప్రారంభమవుతుంది.ఈ సమయంలో మీకు ఇష్టమైన స్మార్ట్‌ఫోన్‌ల నుంచి పెద్ద పెద్ద గృహోపకరణాల వరకు అన్నీ సరసమైన ధరకు కొనుగోలు చేయవచ్చు. మీరు ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యులైతే ఒక రోజు ముందుగానే అంటే మే 1, 2025 నుంచి SASA LELE సేల్‌ను సద్వినియోగం చేసుకునే అవకాశం లభిస్తుంది.
ఎస్‌బీఐతో కార్డుంటే బంపర్ ఆఫర్..
ఈ సేల్ కోసం ఫ్లిప్‌కార్ట్ దేశంలోని అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో చేతులు కలిపింది. SBI క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లింపు చేసే కస్టమర్లు 10 శాతం వరకూ తగ్గింపును పొందుతారు. పూర్తి చెల్లింపు లేదా EMIలో కొనుగోలు చేసే వారికీ ఈ డిస్కౌంట్ వర్తిస్తుంది. దీనితో పాటు సేల్ ఆఫర్‌లో కస్టమర్లకు ఎక్స్ఛేంజ్ ఆఫర్, నో కాస్ట్ EMI ఆఫర్లు లభిస్తాయి. ఈ సేల్‌లో ఫ్లిప్‌కార్ట్ కస్టమర్లకు 50 శాతం వరకు భారీ తగ్గింపులను ఉండబోతున్నాయి.
ప్రత్యేక డీల్స్
ఈ సేల్ ఆఫర్‌లో కస్టమర్‌లు బ్లాక్‌బస్టర్ డీల్‌లు పొందవచ్చు. రోజులో అతిపెద్ద, పరిమిత కాల ఆఫర్ డీల్‌లు ఉంటాయి.
SASA LELE సేల్‌లో ఫ్లిప్‌కార్ట్ కస్టమర్లకు బై 1 గెట్ 1 ఆఫర్‌ను కూడా అందిస్తోంది.
కొత్త సేల్‌లో కస్టమర్లకు డబుల్ డిస్కౌంట్ ఆఫర్ కూడా లభిస్తుంది. అంటే ఒకే ఉత్పత్తిపై రెండు వేర్వేరు ఆఫర్‌లు వస్తాయి.
ఫ్లిప్‌కార్ట్ కస్టమర్లకు జాక్‌పాట్ డీల్స్ లభిస్తాయి. చాలా తక్కువ ధరకే ఖరీదైన వస్తువులను కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.
ఫ్లిప్‌కార్ట్ రాబోయే సేల్‌లో టిక్‌టాక్ డీల్స్ కూడా ఉంటాయి. ఇందులో కంపెనీ కొన్ని ప్రత్యేక ఉత్పత్తులపై కొన్ని గంటల పాటు అంటే పరిమిత సమయం వరకు అద్భుతమైన ఆఫర్లు పొందవచ్చు.
చౌకగా ఐఫోన్ కొనే ఛాన్స్
మీరు ఐఫోన్ కొనాలని ప్లాన్ చేస్తుంటే ఫ్లిప్‌కార్ట్ SASA LELE సేల్ మీకు గొప్ప అవకాశాన్ని ఇవ్వబోతోంది. ఈ సేల్‌లో ఫ్లిప్‌కార్ట్ ఐఫోన్‌లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. దీని ద్వారా డబ్బును చాలా ఆదా చేసుకోవచ్చు. SASA LELE సేల్‌లో ఐఫోన్ 14 సిరీస్, ఐఫోన్ 15 సిరీస్‌లలో భారీ డిస్కౌంట్లు ఉంటాయి. దీనితో పాటు ఐఫోన్ 16, ఐఫోన్ 16e లలో మంచి ఆఫర్‌లు ఉంటాయి.
AC లలో భారీ డిస్కౌంట్
ఈ సమయంలో భారతదేశంలోని అనేక ప్రాంతాల్లోని ప్రజలు తీవ్రమైన ఉష్ణోగ్రతలతో అల్లాడిపోతున్నారు. కాబట్టి ప్రస్తుతం AC కి డిమాండ్ ఎక్కువగా ఉంది. మీరు కొత్త AC కొనాలని ప్లాన్ చేస్తుంటే ఫ్లిప్‌కార్ట్ SASA LELE సేల్‌లోబ్రాండెడ్ AC లను చౌక ధరకే కొనుగోలు చేసే అవకాశం లభిస్తుంది.
Read Also: Gold Rates Today: నేడు దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం రేట్లు ఇవీ
జీవిత బీమా పాలసీదారులకు రైడర్లతో మరింత రక్షణ
జీఎస్‌టీ రిజిస్ట్రేషన్‌కు ఏం కావాలంటే ?