EV Launch: 500 కి.మీ రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ SUV.. ప్రముఖ సంస్థ లాంచ్
ABN , Publish Date - Jan 17 , 2025 | 04:14 PM
మారుతి సుజుకి 500 కిలోమీటర్ల రేంజ్ గల కొత్త ఎలక్ట్రిక్ వాహనాన్ని అనౌన్స్ చేసింది. అదే eVitara. దీనిని 2025 ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో లాంచ్ చేశారు. అయితే దీని ఫీచర్లు ఎలా ఉన్నాయనే తదితర వివరాలను ఇక్కడ చూద్దాం.

ప్రముఖ ఆటోమొబైల్ ప్రదర్శన ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో మారుతి సుజుకి (Maruti Suzuki) తన కొత్త ఎలక్ట్రిక్ వాహనమైన eVitaraను లాంచ్ చేస్తూ అధికారికంగా ఎలక్ట్రిక్ వాహన (EV) మార్కెట్‌లోకి ప్రవేశించింది. ఈ SUV 500 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని వాహన సంస్థ ప్రకటించింది. దీంతో ఈ కొత్త మోడల్ భారతదేశంలోని EV మోడళ్లలో కీలకంగా మారనుంది. eVitara ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 500 కిలోమీటర్ల దూరం వెళ్తుందని ప్రకటించారు. 61 kWh బ్యాటరీతో ఈ SUVని అభివృద్ధి చేశారు.
దీని ధర ఎంత..
ఈ వాహనాన్ని 100కి పైగా నగరాల్లో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అందిస్తుంది. కాబట్టి eVitara సవాలులతో కూడిన ప్రయాణాలను నిర్వహించడానికి సౌకర్యంగా ఉంటుంది. ఇ వాహనం కొనుగోలు చేసిన వారికి ఈ వాహనంతో పాటు స్మార్ట్ హోమ్ ఛార్జర్ కూడా అందించబడుతుంది. రాబోయే నెలల్లో గుజరాత్ ప్లాంట్‌లో ఈ వాహనాన్ని ఉత్పత్తి చేయడం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం eVitara ధరల గురించి అధికారిక ప్రకటన లేదు. అయితే మార్కెట్ రేటింగ్ ప్రకారం ఈ SUV ధర రూ. 15 లక్షల నుంచి 20 లక్షల మధ్య ఉండవచ్చని తెలుస్తోంది.
ఎగుమతి కూడా..
భారత మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకోవడం మాత్రమే కాకుండా, మారుతి సుజుకి eVitaraని యూరప్, జపాన్ సహా ఇతర 100కి పైగా దేశాలకు ఎగుమతి చేయాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది. ఈ వాహనం ప్రస్తుత EV మార్కెట్‌లో మారుతి సుజుకి సంస్థకు కీలకమైన మైలురాయిగా నిలుస్తుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. eVitara టాటా కర్వ్ EV, MG ZS EV, Hyundai Creta EV, Mahindra BE 06 వంటి ప్రముఖ మోడళ్లతో పోటీ పడనుంది.
దీని డిజైన్ ఎలా ఉందంటే..
eVitara కొలతలు:
పొడవు: 4,275 mm
వెడల్పు: 1,800 mm
ఎత్తు: 1,635 mm
వీల్‌బేస్: 2,700 mm
గ్రౌండ్ క్లియరెన్స్: 180 mm
బరువు: దాదాపు 1,900 కిలోల
ఈ SUVలో 18 అంగుళాల అల్లాయ్ వీల్స్, C పిల్లర్-మౌంటెడ్ డోర్ హ్యాండిల్స్, రూఫ్ స్పాయిలర్, లైట్‌బార్ ప్రేరేపిత టెయిల్ ల్యాంప్ డిజైన్ వంటి ప్రత్యేకమైన లక్షణాలు ఉన్నాయి.
ఇంటీరియర్స్: ఆధునిక డిజైన్, ఫీచర్స్
eVitara లోపలి భాగాన్ని పూర్తిగా పునఃరూపకల్పన చేశారు. ఇందులో కొత్త ప్రీమియం రూపాన్ని ఇచ్చే ముఖ్యమైన లక్షణాలు ఉన్నాయి.
డ్యూయల్-స్క్రీన్ సెట్‌అప్: ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్
ఫ్లోటింగ్ సెంటర్ కన్సోల్ ప్రత్యేక ఆకర్షణ
డ్యూయల్-టోన్ డ్యాష్‌బోర్డ్: ఒక ఆధునిక టచ్‌ని యాడ్ చేస్తుంది
Level 2 ADAS: భద్రతను పెంచే అత్యాధునిక డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్
స్టీరింగ్ వీల్: రెండు-స్పోక్, ఫ్లాట్-బాటమ్
eVitaraలోని భద్రతా వ్యవస్థ చాలా అధునాతనమైనది. ఈ వాహనం 7 ఎయిర్‌బ్యాగ్‌లతో వస్తుంది. ఇది అత్యుత్తమ భద్రతా ప్రమాణాలను అందిస్తుంది
ఇవి కూడా చదవండి:
Budget 2025: రైతులకు గుడ్ న్యూస్.. వచ్చే నెల ఖాతాల్లోకి రూ.10 వేలు
SIM Card New Rules: సిమ్ కార్డ్ కొత్త రూల్స్ గురించి తెలుసా.. ఇది తప్పనిసరి
Investment Plan: మీ పదవీ విరమణకు ఇలా ప్లాన్ చేయండి.. రూ. 2 కోట్లు పొందండి..
Personal Finance: జస్ట్ నెలకు రూ. 3500 సేవ్ చేస్తే.. రూ. 2 కోట్లు మీ సొంతం..
Investment Tips: రూ. 20 వేల శాలరీ వ్యక్తి.. ఇలా రూ. 6 కోట్లు సంపాదించుకోవచ్చు..
Read More Business News and Latest Telugu News