Share News

Pakistan GDP: పాకిస్థాన్ జీడీపీ ఎంతో తెలుసా.. మన దగ్గరి ఒక్క రాష్ట్రం చాలు..

ABN , Publish Date - May 16 , 2025 | 08:22 PM

పహల్గామ్ దాడి తర్వాత పాకిస్థాన్ ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆ తర్వాత భారత్ రివేంజ్ తీర్చుకోవడం, పాకిస్థాన్ వేడుకోవడం సహా అనేకం జరిగాయి. అయితే అసలు పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి ఏంటి, జీడీపీ (Pakistan GDP) ఎంత ఉందనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

Pakistan GDP: పాకిస్థాన్ జీడీపీ ఎంతో తెలుసా.. మన దగ్గరి ఒక్క రాష్ట్రం చాలు..
Pakistan GDP

పాకిస్థాన్ అనేక సందర్భాలలో కూడా భారత్ విషయంలో కాల్పుల నిబంధనలను ఉల్లంఘించింది. దీంతోపాటు పదే పదే భారత్‌ను ప్రత్యర్థి దేశంగా చూస్తుంటుంది. కానీ అసలు పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి (Pakistan GDP) ఏంటి, ఇండియాతో పోల్చుకుంటే ఇది ఆ స్థానంలో ఉందనే విషయాలను ఇక్కడ చూద్దాం. పాకిస్థాన్ గత కొన్ని సంవత్సరాలుగా ఆర్థిక అస్థిరత, రాజకీయ అనిశ్చితి, సైనిక ఆధిపత్యం కారణంగా ఆర్థిక వృద్ధిలో వెనుకబడిపోయింది. కానీ ఇదే సమయంలో భారతదేశం మాత్రం భారీగా పుంజుకుంది. ఈ క్రమంలో పాకిస్థాన్ జీడీపీ ప్రస్తుతం 373.08 బిలియన్ డాలర్లుగా ఉండగా, ఇండియాలో మాత్రం ఈ సంఖ్య మహారాష్ట్ర (490 బిలియన్ డాలర్లు) కంటే తక్కువగా ఉండటం విశేషం.


పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ

ఈ లెక్కన చూస్తే పాకిస్థాన్ జీడీపీ మన దగ్గరి ఒక్క రాష్ట్రం కంటే తక్కువగా ఉంది. ఇక ఇండియాతో పోల్చుకోవాల్సిన అవసరం అస్సలు లేదనే చెప్పవచ్చు. 2004-05లో పాకిస్థాన్ జీడీపీ 132 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇప్పుడు, దాదాపు రెండు దశాబ్దాల తర్వాత, అది 373.08 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఈ వృద్ధి మొదట గణనీయంగా అనిపించినప్పటికీ, జనాభా వృద్ధి, ద్రవ్యోల్బణం, రుణ భారాన్ని పరిగణనలోకి తీసుకుంటే మాత్రం చాలా తక్కువ. 2023లో పాకిస్థాన్ జీడీపీ 338 బిలియన్ డాలర్లుగా ఉంది, ఇది 2017 కంటే కూడా తక్కువ. గత ఐదేళ్లలో ద్రవ్యోల్బణ రేటు 10.7% (2020), 8.9% (2021), 12.2% (2022), 29.1% (2023), 23.4% (2024)గా ఉంది. ఈ అంకెలు పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయి.


అక్కడి ప్రజల పరిస్థితి..

పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ బలహీనతలకు అనేక కారణాలు ఉన్నాయి. వీటిలో ప్రధానంగా అవినీతి, అసమర్థ పాలన, సైనిక జోక్యం వంటి అంశాలు కలవు. దేశం దాదాపు 131 బిలియన్ డాలర్ల రుణ భారంతో కొట్టుమిట్టాడుతోంది. దీని పన్ను ఆదాయంలో 65% వడ్డీ చెల్లింపులకే ఖర్చవుతోంది. విద్యకు కేవలం 1.7%, ఆరోగ్యానికి 0.8% మాత్రమే కేటాయిస్తున్నారు. దీని ఫలితంగా మానవాభివృద్ధి సూచిక 0.540 స్థాయిలో ఉంది. ఇది బంగ్లాదేశ్ కంటే వెనుకబడి ఉంది. అక్షరాస్యత రేటు 60%, శిశు మరణాల రేటు 1,000 జననాలకు 67గా ఉంది. ఈ గణాంకాలు పాకిస్థాన్ ప్రజల జీవన ప్రమాణాలను బహిర్గతం చేస్తున్నాయి.


ఇటీవల ఐఎంఎఫ్ లోన్ కూడా..

పాకిస్థాన్‌కు ఇటీవల అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) నుంచి ఆర్థిక చేయూత లభించింది. ఈసారి, దీర్ఘకాల రుణ కార్యక్రమమైన ఎక్స్‌టెండెడ్ ఫండ్ ఫెసిలిటీ (EFF) కింద దాదాపు 1.02 బిలియన్ డాలర్లు (సుమారు 760 మిలియన్ SDR) అందాయి. ఈ తాజా నిధుల విడుదలతో EFF (Extended Fund Facility) కింద ఇప్పటివరకు పాకిస్థాన్‌కు అందిన మొత్తం $2.1 బిలియన్లకు చేరుకుంది.


ఇవి కూడా చదవండి

Personal Loan: పర్సనల్ లోన్ తీసుకుని ఆర్నేళ్లు కట్టకపోతే జైలుకు పంపిస్తారా..రూల్స్ ఏం చెబుతున్నాయ్


Penny Stock: ఐదేళ్లలోనే రూ.15 నుంచి రూ.246కి చేరిన స్టాక్..ఇన్వెస్టర్లకు లాభాలే లాభాలు..


NRI Money Transfer Tax: ఎన్నారైలకు షాకింగ్ న్యూస్.. విదేశాలకు మనీ పంపిస్తే బాదుడేనా..


Investment Tips: ఒకేసారి రూ.3.5 లక్షల పెట్టుబడి..కానీ వచ్చేది మాత్రం కోటి, ఎలాగంటే..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 16 , 2025 | 08:27 PM