IPL Plans: ఐపీఎల్ కోసం 2 ప్లాన్‌లను ప్రవేశపెట్టిన జియో..20జీబీ ఎక్స్ ట్రా డేటా..
ABN , Publish Date - Apr 11 , 2025 | 06:38 AM
ఐపీఎల్ సీజన్‌లో జియో తన వినియోగదారుల కోసం అద్భుతమైన మరో రెండు ప్లాన్లను ప్రవేశపెట్టింది. ఈ క్రమంలో అదనపు డేటాతోపాటు ఆన్‌లైన్ వినోదాన్ని అందించడానికి కూడా సిద్ధమైంది. ఇక కొత్తగా ప్రవేశపెట్టిన ఈ ప్లాన్స్ ఎలా ఉన్నాయనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

దేశంలో ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో, తన 46 కోట్ల మంది వినియోగదారులకు ఒక అద్భుతమైన ఆఫర్ ప్రకటించింది. ఈ ఐపీఎల్ సీజన్, క్రికెట్ అభిమానుల కోసం కొత్తగా రెండు ప్రీపెయిడ్ ప్లాన్లను ప్రవేశపెట్టింది. దీంతోపాటు 20జీబీ వరకు అదనపు హై స్పీడ్ డేటా కూడా ఆఫర్ చేస్తుంది. ఈ క్రమంలో ఐపీఎల్ మ్యాచ్‌లను ఏ సమస్య లేకుండా వీక్షించవచ్చు.
జియో 899 ప్లాన్
జియో 899 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ ఐపీఎల్ ప్రియుల కోసం మరింత విలువను అందిస్తుంది. అంటే ఈ ప్లాన్ ద్వారా 20 జీబీ వరకు అదనపు డేటాను కూడా పొందవచ్చు. ఈ ప్లాన్‌లోని కీలకమైన వివరాలు ఇక్కడ ఉన్నాయి.
ప్లాన్ డ్యూరేషన్: 90 రోజులు
రోజుకు డేటా: 2GB
మొత్తం డేటా: 180GB రెగ్యులర్ డేటా + 20GB బోనస్ డేటా = 200GB మొత్తం డేటా
అపరిమిత వాయిస్ కాల్స్ దేశవ్యాప్తంగా
రోజుకు 100 ఉచిత SMSలు (90 రోజుల పాటు)
ఐపీఎల్ కోసం ఉచిత డిస్నీ+ హాట్‌స్టార్: 90 రోజులు
ఐపీఎల్ మ్యాచ్‌లను..
ఈ ప్లాన్ క్రికెట్ అభిమానులతోపాటు సినిమాలు సహా ఇతర వీడియోలు చూసే వారికి కూడా గొప్ప ఆఫర్. ఎందుకంటే దీనిలో డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ద్వారా వినియోగదారులు ఐపీఎల్ మ్యాచ్‌లను లైవ్ గా చూడగలుగుతారు. అంతేకాక, ఈ ప్లాన్ ద్వారా 200GB డేటా కూడా లభిస్తుంది. ఇది 90 రోజుల పాటు ఉపయోగించడానికి చాలా సౌకర్యవంతమైంది. దీనివల్ల, వినియోగదారులు ఎలాంటి ఆందోళన లేకుండా తమ స్మార్ట్‌ఫోన్‌లలో ఐపీఎల్ మ్యాచ్‌లను స్ట్రీమ్ చేసుకోవచ్చు.
జియో 749 ప్లాన్
పెద్ద ప్లాన్ కోసం చూస్తున్న వినియోగదారులకు, జియో 749 రూపాయల ప్లాన్‌లోని అదనపు డేటా ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. ఈ ప్లాన్ కూడా క్రికెట్ అభిమానులు, ఎంటర్ టైన్మెంట్ కోసం చూస్తున్న వారికి బెస్ట్ అని చెప్పవచ్చు.
ప్లాన్ డ్యూరేషన్: 72 రోజులు
రోజుకు డేటా: 2GB
మొత్తం డేటా: 144GB రెగ్యులర్ డేటా + 20GB బోనస్ డేటా = 164GB మొత్తం డేటా
అపరిమిత వాయిస్ కాల్స్ దేశవ్యాప్తంగా
రోజుకు 100 ఉచిత SMSలు (72 రోజుల పాటు)
JioTV, JioCinema, Jio Cloud వంటి సేవలకు ఉచిత యాక్సెస్
ఈ ప్లాన్, మరింత బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండటంతో, వినియోగదారులు 164GB డేటాతో పాటు JioTV, JioCinema, Jio Cloud వంటి అత్యంత ప్రియమైన OTT ప్లాట్‌ఫారమ్‌లకు ఉచిత యాక్సెస్ పొందవచ్చు. ఇది జియో వినియోగదారులకు మరింత వినోదం, సౌలభ్యం అందించేలా ఉంటాయి.
ఉచిత OTT సేవలు
ఇలాంటి ప్లాన్లు కేవలం డేటా పరిమితిని మాత్రమే కాకుండా, వినియోగదారులకు అదనంగా ఉచిత OTT సేవల యాక్సెస్ కూడా అందిస్తున్నాయి. JioTV, ioCinema ప్లాట్‌ఫారమ్‌లు, ఐపీఎల్ మ్యాచ్‌లను సులభంగా స్ట్రీమ్ చేయడానికి, అలాగే ఇతర యాక్షన్, డ్రామా, కామెడీ వంటి షోలను చూసే అవకాశాన్ని అందిస్తాయి. ఇదే సమయంలో Jio Cloud సర్వీస్ ద్వారా వినియోగదారులు తమ ముఖ్యమైన ఫైల్‌లను జియో క్లౌడ్‌లో నిల్వ చేసుకోవచ్చు.
ఇవి కూడా చదవండి:
EPFO: పీఎఫ్ ఉద్యోగులకు అలర్ట్..మరింత ఈజీగా UAN నంబర్ పొందే ఛాన్స్..
Gold Price Fluctuations: అసలు గోల్డ్ రేటు ఎందుకు పెరుగుతుంది, ఎందుకు తగ్గుతుంది..కారణాలేంటి
Read More Business News and Latest Telugu News