Share News

Investment Plan: నెలకు జస్ట్ రూ.4000 పెట్టుబడి.. వచ్చేది మాత్రం రూ.కోటి

ABN , Publish Date - Jul 13 , 2025 | 04:49 PM

మీరు కూడా కోటీశ్వరులు కావాలనుకుంటున్నారా. దీనికోసం అదృష్టంపై ఆధారపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు కేవలం నెలకు రూ. 4,000 పెట్టుబడిగా చేస్తే చాలు, మీ కలను నిజం చేసుకోవచ్చు. అది ఎలా అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Investment Plan: నెలకు జస్ట్ రూ.4000 పెట్టుబడి.. వచ్చేది మాత్రం రూ.కోటి
Investment Plan

మీరు కోటీశ్వరులు కావాలని కలలు కన్నారా. అందుకోసం పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు. నెలకు కేవలం రూ.4,000 ఇన్వెస్ట్ చేస్తే (Investment Plan) చాలు. అవును, మీరు చదివింది నిజమే. సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) ద్వారా ఈ లక్ష్యాన్ని ఈజీగా చేరుకోవచ్చు. అందుకోసం ఎన్నేళ్లు ఇన్వెస్ట్ చేయాలి. ఎప్పుడు మనకు రిటర్న్స్ వస్తాయనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.


SIP అంటే ఏంటి?

SIP అనేది మ్యూచువల్ ఫండ్స్‌లో కొంత మొత్తాలను క్రమం తప్పకుండా పెట్టుబడి చేసే ఒక సులభమైన మార్గం. ఇది మీ బ్యాంక్ ఖాతా నుంచి నెల వారీగా ఒక నిర్దిష్ట మొత్తాన్ని స్వయం చాలకంగా ఇన్వెస్ట్ చేస్తుంది. దీని ద్వారా మీరు క్రమశిక్షణతో పెట్టుబడి చేయడం ద్వారా మార్కెట్ హెచ్చుతగ్గులను బ్యాలెన్స్ చేసుకోవచ్చు. ఇది రూపీ కాస్ట్ యావరేజింగ్ అనే సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది. ఇది మీ రిస్క్‌ను తగ్గిస్తూ లాభాలను పెంచుతుంది.


రూ.1 కోటి ఎలా సాధ్యం

ఈ క్రమంలో మీరు నెలకు రూ.4,000 సిప్ విధానంలో పెట్టుబడి చేస్తే, 15% సగటు వార్షిక రాబడి (CAGR)ని లెక్కించినట్లయితే, మీకు 25 సంవత్సరాలలో రూ.1,10,26,243 లభిస్తుంది. ఇందులో మీరు పెట్టిన మొత్తం రూ.12 లక్షలు (25 సంవత్సరాలు x 12 నెలలు x రూ.4,000) కాగా, మీకు వడ్డీ రూపంలోనే రూ.98,26,243 వస్తుంది. అంటే మీరు పెట్టిన మొత్తం 8 రెట్లు పెరిగిందని చెప్పవచ్చు.

sip investment.jpg


ఎలా పెరుగుతుంది..

మీరు 30 ఏళ్ల వయసులో నెలకు రూ.4,000 సిప్ ప్రారంభిస్తే, 55 ఏళ్ల వయసులో (25 సంవత్సరాల తర్వాత) మీరు రూ.1.1 కోట్ల సంపద సృష్టించుకోవచ్చు. ఈ సంపదతో మీరు రిటైర్మెంట్‌ను ఆనందించవచ్చు లేదా పిల్లల విద్య కోసం ఖర్చు చేయవచ్చు. మీరు ఈ మొత్తాన్ని నెలకు రూ.5,000 లేదా రూ.10,000కి పెంచితే, మీ సంపద ఇంకా వేగంగా పెరుగుతుంది. దీని వెనుక ఉన్న రహస్యం ఏంటంటే కాంపౌండింగ్ పవర్. మీ పెట్టుబడిపై వచ్చే వడ్డీ మళ్లీ పెట్టుబడి అవుతూ, సమయంతో పాటు అది క్రమంగా పెరుగుతుంది.


ఎలా ప్రారంభించాలి?

  • ముందుగా మీ ఆర్థిక లక్ష్యాలను ఎంచుకోండి: మీరు మీ ఇళ్లు, పిల్లల చదువు లేదా రిటైర్మెంట్ దేని కోసం ఇన్వెస్ట్ చేయాలో నిర్ణయించుకోండి

  • సరైన మ్యూచువల్ ఫండ్ ఎంచుకోండి: మీ రిస్క్ సామర్థ్యం, లక్ష్యం, సమయం ఆధారంగా ఈక్విటీ, డెట్ లేదా హైబ్రిడ్ ఫండ్స్ ఎంచుకోండి

  • SIP రిజిస్టర్: ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా SIPని ప్రారంభించవచ్చు

  • KYC పూర్తి చేయండి: ఆధార్, పాన్ కార్డ్, బ్యాంక్ వివరాలతో KYC ప్రక్రియను పూర్తి చేయండి.

  • క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేయండి: ఆటో డెబిట్ సెటప్ చేసి, క్రమం తప్పకుండా పెట్టుబడి కొనసాగించండి

నోట్ : స్టాక్ మార్కెట్ లేదా మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు చేయాలని ఆంధ్రజ్యోతి సూచించదు. సమాచారం మాత్రమే అందిస్తుంది. మీకు ఇన్వెస్ట్ చేయాలని ఆసక్తి ఉంటే నిపుణుల సలహా, సూచనలు తీసుకోవడం ఉత్తమం.


ఇవి కూడా చదవండి


యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్

ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 13 , 2025 | 04:52 PM