Stock Market Rally: ఓ వైపు ట్రెడ్ వార్..అయినప్పటికీ భారీ లాభాల్లో భారత స్టాక్ మార్కెట్లు
ABN , Publish Date - Apr 21 , 2025 | 10:55 AM
ఓ వైపు ప్రపంచవ్యాప్తంగా అమెరికా-చైనా మధ్య ట్రేడ్ వార్ కొనసాగుతుండగా, భారత స్టాక్ మార్కెట్లు మాత్రం సోమవారం భారీ లాభాలతో దూసుకెళ్తున్నాయి. ఈ క్రమంలో సూచీలు మొత్తం గ్రీన్‌లోనే ఉండటం విశేషం.

భారత స్టాక్ మార్కెట్లు (Indian stock market) సోమవారం (ఏప్రిల్ 21న) భారీ లాభాల్లో దూసుకెళ్తున్నాయి. అంతర్జాతీయంగా ట్రేడ్ వార్ ముప్పు, గ్లోబల్ మార్కెట్లలో అనిశ్చితి ఉన్న నేపథ్యంలో కూడా మన మార్కెట్లు లాభాలతో ఎగబాకడం విశేషం. ఈ క్రమంలో ఉదయం 10.50 గంటల నాటికి సెన్సెక్స్ 665 పాయింట్లు పెరుగగా, నిఫ్టీ 218 పాయింట్లు పుంజుకుంది. ఇదే సమయంలో బ్యాంక్ నిఫ్టీ 949 పాయింట్లు లాభపడగా, నిఫ్టీ మిడ్ క్యాప్ 100 సూచీ 930 పాయింట్లు వృద్ధి చెందింది. దీంతో ఇన్వెస్టర్లు కొన్ని గంటల వ్యవధిలోనే లక్షల కోట్ల రూపాయలను దక్కించుకున్నారు.
టాప్ 5 స్టాక్స్
ఈ క్రమంలో ప్రస్తుతం ఇండస్ఇండ్ బ్యాంక్, టెక్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ, ట్రెంట్ కంపెనీల స్టాక్స్ టాప్ 5 లాభాల్లో ఉండగా, అదానీ పోర్ట్స్, HDFC లైఫ్, ఐటీసీ, HUL, ఏషియన్ పెయింట్స్ సంస్థల స్టాక్స్ టాప్ 5 నష్టాల్లో ఉన్నాయి. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ సూచీ 1.84% పెరిగి 55,291.05 వద్ద గరిష్ట స్థాయికి చేరుకుంది. ఈ క్రమంలో HDFC, ICICI, Kotak Mahindra వంటి బ్యాంకులు మంచి వాల్యూమ్స్‌తో ఆకట్టుకున్నాయి. అంతేకాదు ఫైనాన్షియల్ సర్వీసెస్, IT, PSU బ్యాంక్, ప్రైవేట్ బ్యాంక్ రంగాలు కూడా 1% పైగా లాభాల్లో దూసుకెళ్తున్నాయి.
ఈ వారం క్యూ4 ఫలితాల హంగామా
ఈ వారం మొత్తం 100 కంటే ఎక్కువ కంపెనీలు తమ మార్చి త్రైమాసిక (Q4) ఫలితాలను ప్రకటించనున్నాయి. ఇవి మార్కెట్ మూవ్‌మెంట్‌పై ప్రభావం చూపే ఛాన్స్ ఉంది. గ్లోబల్ మార్కెట్లు ఊగిసలాడుతున్నా, ట్రేడ్ వార్ల ప్రభావం కొనసాగుతున్నా, భారత మార్కెట్ మాత్రం బలంగా నిలిచింది. దేశీయంగా బలమైన ఫండమెంటల్స్, కార్పొరేట్ ఫలితాలపై నమ్మకం, బ్యాంకింగ్ రంగంలో విశ్వాసం ఇవన్నీ కలిసి పెట్టుబడిదారులకు ఉత్సాహాన్ని కలిగిస్తున్నాయి. ఈ రకమైన మార్కెట్ ఊపుతో వచ్చే రోజుల్లోనూ పాజిటివ్ ట్రెండ్ కొనసాగే అవకాశాలు ఉన్నాయి. అయితే రిస్క్ మేనేజ్‌మెంట్, స్టాక్ సెలెక్షన్‌లో జాగ్రత్త అవసరమని ఈ సందర్భంగా ట్రేడ్ నిపుణులు సూచిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
China Warning: మా ప్రయోజనాలపై దాడి చేస్తే ఊరుకోం..అమెరికాకు చైనాహెచ్చరిక
Elon Musk: తల్లి బర్త్ డేకు సర్‌ప్రైజ్ చేసిన ఎలాన్ మస్క్..ఎలాగో తెలుసా..
Viral News: 70 ఇన్ స్పేస్..అంతరిక్షంలో రోదసీ యాత్రికుడి బర్త్ డే సెలబ్రేషన్
Scam Payments: మార్కెట్లోకి నకిలీ ఫోన్ పే, గూగుల్ పే యాప్స్.. జర జాగ్రత్త..
Bill Gates: వారానికి మూడు రోజేలే పని..బిల్ గేట్స్ ఆసక్తికర వ్యాఖ్యలు..
Read More Business News and Latest Telugu News