Share News

EPFO Complaint: EPFOలో మీకేమైనా ఇబ్బందులు ఉన్నాయా.. ఉంటే ఇలా ఫిర్యాదు చేయండి

ABN , Publish Date - Jul 13 , 2025 | 08:25 PM

ప్రావిడెంట్ ఫండ్ (PF) క్లెయిమ్‌, సెటిల్‌మెంట్ ఆలస్యం, ఖాతా బదిలీ వంటి ఏదైనా సమస్యలు ఉన్నాయా?, అయినా కూడా నో టెన్షన్. ఎందుకంటే వీటి కోసం పీఎఫ్ ఆఫీసుకు వెళ్లాల్సిన పనిలేదు. ఆన్‎లైన్‎లో కూడా ఫిర్యాదు చేయవచ్చు. అది ఎలా అనేది ఇక్కడ తెలుసుకుందాం.

EPFO Complaint: EPFOలో మీకేమైనా ఇబ్బందులు ఉన్నాయా.. ఉంటే ఇలా ఫిర్యాదు చేయండి
EPFO Complaint

మీకు ప్రావిడెంట్ ఫండ్ (PF)కు సంబంధించిన ఏవైనా సమస్యలు ఉన్నాయా?. ఉంటే EPFO గ్రీవెన్స్ పోర్టల్ మీకు ఒక చక్కని వేదికగా పనిచేస్తుంది. ఇక్కడ PF క్లెయిమ్‌ల నుంచి ఖాతా బదిలీ వరకు, ప్రతి సమస్యనూ త్వరగా పరిష్కరించుకునే అవకాశం లభిస్తుంది. ఉద్యోగులు తమ PF సంబంధిత అనుమానాలు, ఆలస్యాలు లేదా క్లెయిమ్ సమస్యలను ఈ పోర్టల్ ద్వారా సమర్థవంతంగా పరిష్కరించుకోవచ్చు (EPFO Complaint). ఇది పీఎఫ్ సభ్యులకు సౌకర్యవంతమైన మాధ్యమంగా పనిచేస్తుంది. ఇదే సమయంలో ఉద్యోగుల ఆర్థిక భద్రత విషయంలోనూ కీలకపాత్ర పోషిస్తుంది. అయితే ఎలా ఫిర్యాదు చేయాలనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.


ఆన్‌లైన్‌లో ఫిర్యాదు నమోదు చేయడం ఎలా?

  • EPFO గ్రీవెన్స్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయడం చాలా సులభం. దీని కోసం క్రింది దశలను పాటించాలి

  • ముందుగా అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి https://epfigms.gov.in

  • తర్వాత హోమ్‌పేజీలో ఉన్న Register Grievance ఆప్షన్ క్లిక్ చేయండి

  • ఆ క్రమంలో మీరు సభ్యుడు, యజమాని, పెన్షనర్ లేదా ఇతరులు వంటి ఆప్షన్లను ఎంచుకోండి. UAN లేని వారు Others ఎంచుకోవచ్చు.

  • అప్పుడు మీ UAN నంబర్‌ను నమోదు చేసి, Get Details బటన్‌పై క్లిక్ చేయండి. అక్కడ మీ ఖాతా వివరాలను చూపిస్తుంది.

  • మీ పేరు, UAN, ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్ వంటివి సరిగ్గా ఉన్నాయో లేదో ధృవీకరించుకోండి.


  • Get OTP ఆప్షన్ పై క్లిక్ చేసి, మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చిన ఓటీపీని నమోదు చేయండి

  • మీ Personal Details విభాగంలో మీ PF ఖాతా నంబర్‌ను ఎంచుకోండి

  • ఆ క్రమంలో మీ ఫిర్యాదు వివరాలను నమోదు చేయండి

  • ఫిర్యాదు రకం, కేటగిరీని సెలక్ట్ చేయండి

  • అక్కడ మీ సమస్యను స్పష్టంగా వివరించండి

  • అవసరమైతే, సంబంధిత పత్రాలను అప్‌లోడ్ చేయడానికి Choose Files ఆప్షన్ ఎంచుకుని Attach బటన్‌పై క్లిక్ చేయండి

  • అన్ని వివరాలను సరిగ్గా నమోదు చేసిన తర్వాత, మీ ఫిర్యాదును సమర్పించండి. మీకు ఒక రిజిస్ట్రేషన్ నంబర్ ఇవ్వబడుతుంది. దానిని ఉపయోగించి మీ ఫిర్యాదు స్థితిని తెలుసుకోవచ్చు.

  • మీ ఫిర్యాదు స్థితి గురించి వివరాలు మీ రిజిస్టర్డ్ ఈమెయిల్‌కు కూడా వస్తాయి


ఫిర్యాదు పరిష్కార సమయం

EPFO సాధారణంగా 15 నుంచి 30 పని దినాలలో మీ ఫిర్యాదులను పరిశీలించి పరిష్కరిస్తారు.

ఈ పోర్టల్ ఎలా ఉపయోగపడుతుంది?

ఈ పోర్టల్ ద్వారా ఉద్యోగులు తమ PF బదిలీలలో జాప్యం, సెటిల్‌మెంట్ ఆలస్యం, KYC సమస్యల వల్ల క్లెయిమ్‌లు తిరస్కరించబడడం, పెన్షన్ చెల్లింపుల్లో లోపాలు, యజమానులకు సంబంధించిన PF కాంట్రిబ్యూషన్ వంటి సమస్యలను సులభంగా పరిష్కరించుకోవచ్చు.


ఎందుకు EPFO గ్రీవెన్స్ పోర్టల్

ఈ పోర్టల్ కేవలం ఫిర్యాదు నమోదు కోసం మాత్రమే కాదు. PF సంబంధిత సమస్యలను పారదర్శకంగా, త్వరగా పరిష్కరించడానికి ఒక చక్కని వేదికగా ఉంది. ఇది ఉద్యోగులు, పెన్షనర్లు, కంపెనీలకు సమయం ఆదా చేస్తూ, సమస్యలను సులభంగా పరిష్కరించే అవకాశం కల్పిస్తుంది. మీకు PF సంబంధిత ఏదైనా సమస్య ఉంటే, ఈ పోర్టల్‌ను ఉపయోగించి మీ ఫిర్యాదును నమోదు చేయండి, పరిష్కారం పొందండి.


ఇవి కూడా చదవండి

నెలకు జస్ట్ రూ.4000 పెట్టుబడి.. వచ్చేది మాత్రం రూ.కోటి

యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 13 , 2025 | 09:36 PM