Share News

PPF Investment: పీపీఎఫ్ నుంచి నెలకు లక్ష పన్ను లేకుండా పొందాలంటే ఎన్నేళ్లు పడుతుంది.. ఎంత కట్టాలి..

ABN , Publish Date - May 30 , 2025 | 04:29 PM

మీరు నెలకు లక్ష రూపాయల మొత్తాన్ని పన్ను లేకుండా పొందాలని చూస్తున్నారా. అందుకోసం ఏం చేయాలి. ఎన్నేళ్లు పెట్టుబడి చేయాలి. దీని కోసం ఏడాదికి ఎంత సేవ్ (PPF Investment) చేయాలనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

PPF Investment: పీపీఎఫ్ నుంచి నెలకు లక్ష పన్ను లేకుండా పొందాలంటే ఎన్నేళ్లు పడుతుంది.. ఎంత కట్టాలి..
PPF investment

వ్యవసాయం, వ్యాపారం లేదా ఉద్యోగం చేస్తున్న వారు ఎలాంటి రిస్క్ లేకుండా సేవింగ్ (PPF Investment) చేయాలని చూస్తునారా. అలాంటి వారికి పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) స్కీం బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. ఇది కేంద్ర ప్రభుత్వం ద్వారా నిర్వహించే పథకం. దీనిలో ఎలాంటి రిస్క్ ఉండదు. అంతేకాదు మీరు దీనిలో మీరు చేసిన పెట్టుబడికి పన్ను మినహాయింపు కూడా లభిస్తుంది. అయితే ఈ స్కీం ద్వారా పన్ను లేకుండా నెలకు లక్ష రూపాయలకుపైగా పొందడానికి ఎన్నేళ్ల సమయం పడుతుంది. ఎడాదికి ఎంత పెట్టుబడి చేయాలనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.


PPF స్పెషల్ ఏంటంటే..

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అనేది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఒక పొదుపు పథకం. దీని ముఖ్య లక్ష్యం ప్రజలలో పొదుపు అలవాటును పెంచి, భవిష్యత్తులో ఆర్థిక భద్రత కల్పించడం. దీని వ్యవధి 15 సంవత్సరాలు, కానీ దీన్ని 5 సంవత్సరాల బ్లాకులుగా పొడిగించుకోవచ్చు. దీనిలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మీ పెట్టుబడి సురక్షితంగా ఉంటుంది. సెక్షన్ 80C ద్వారా ఏడాదికి రూ. 1.5 లక్షల వరకు ట్యాక్స్ మినహాయింపు పొందవచ్చు. ప్రస్తుతం PPFలో వార్షిక వడ్డీ రేటు 7.1%గా ఉంది. ఈ రేటును ప్రతి త్రైమాసికానికి ప్రభుత్వం సమీక్ష చేస్తుంది. ఆయా పరిస్థితులను బట్టి దీని వడ్డీ రేటు మారుతుంది. ఈ స్కీంలో ఏడాదికి గరిష్టంగా రూ.1.5 లక్షలు మాత్రమే ఇన్వెస్ట్ చేసే ఛాన్సుంది.


నెలకు లక్ష ఎప్పుడు వస్తుంది

మీరు ఈ స్కీంలో 33 ఏళ్ల పాటు ఏడాదికి రూ.1.5 లక్షల చొప్పున మొత్తం రూ.49.5 లక్షలు ఇన్వెస్ట్ చేయాలి. ఆ క్రమంలో మీకు వడ్డీ రూపంలోనే రూ.1.45 కోట్లు లభిస్తాయి. ఆ తర్వాత వచ్చే మొత్తం మీకు రూ.1.95 కోట్లు అవుతుంది. దీనిపై మీరు సంవత్సరానికి 7.1% వడ్డీ తీసుకుంటే దాదాపుగా రూ.16.25 లక్షలు వస్తాయి. అంటే నెలకు మీరు దాదాపు రూ.1.15 లక్షలు ట్యాక్స్ ఫ్రీగా పొందవచ్చు.


15 ఏళ్ల తర్వాత ఏం చేయాలి

మీ ఖాతా 15 ఏళ్లు పూర్తైన తర్వాత మీరు రెండు ఆప్షన్లు ఎంచుకోవచ్చు. డిపాజిట్లు చేయకుండా కొనసాగించడం. ఆ క్రమంలో మీకు ప్రతి నెల వడ్డీ లభిస్తూనే ఉంటుంది. అదే సమయంలో మళ్లీ డిపాజిట్లు కూడా చేసుకోవచ్చు. దీనిలో పెట్టుబడి చేసిన మొత్తంపై వడ్డీపై వడ్డీ లభిస్తుంది. ఈ ఖాతాను పిల్లల పేరుతో కూడా తీసుకోవచ్చు. దీనిలో దీర్ఘకాలంలో పెద్ద మొత్తంలో పొందవచ్చు.


ఇవీ చదవండి:

నీట్ పీజీపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం..

నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్..

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 30 , 2025 | 04:31 PM