LIC Policy Status: మీ పాలసీ స్టేటస్ ఆన్‌లైన్‌లో ఇలా చెక్ చేసుకోండి.. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్..
ABN , Publish Date - Jul 03 , 2025 | 05:12 PM
LIC పాలసీ వివరాలు తెలుసుకోవాలంటే తప్పనిసరిగా కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంట్లో నుంచే ఆన్‌లైన్ ద్వారా లేదా ఒక చిన్న SMS ద్వారా పాలసీ వివరాలు తెలుసుకోవచ్చు. ఈ క్రింది గైడ్ ద్వారా ఇప్పటికే LIC పోర్టల్లో రిజిస్టర్ అయినవారు అలాగే కొత్త యూజర్లు (LIC Policy Status) తమ పాలసీ స్టేటస్ ఎలా చెక్ చేయాలో సులభంగా తెలుసుకోవచ్చు.

ఇంటర్నెట్ డెస్క్: ఇప్పటివరకు LIC పాలసీ వివరాలు తెలుసుకోవాలంటే నేరుగా కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం ఉండేది. కానీ టెక్నాలజీ పెరిగిన నేపథ్యంలో ఇకపై పాలసీ సేవలు కూడా డిజిటల్ మార్గంలో అందుబాటులోకి వచ్చేశాయి. దీంతో LIC పాలసీకి (LIC Policy Status) సంబంధించిన స్టేటస్, బీమా వివరాలు, ప్రీమియం చెల్లింపుల వంటి సమాచారం తెలుసుకోవాలంటే లైన్‌లో నిల్చోవాల్సిన పనిలేదు.
మీరు ఇంట్లో ఉన్నచోట నుంచే మీ ఫోన్ లేదా ల్యాప్‌టాప్ ద్వారానే ఈ సమాచారాన్ని సులభంగా తెలుసుకోవచ్చు. LIC పోర్టల్లో కొత్తగా నమోదు చేసుకోవడం ద్వారా మీరు కేవలం కొన్ని క్లిక్స్ లేదా ఓ చిన్న SMS ద్వారా మీ పాలసీ స్టేటస్ తెలుసుకోవచ్చు. అది ఎలా అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఇప్పటికే LIC పోర్టల్‌లో రిజిస్టరైన వారు ఎలా చెక్ చేసుకోవాలంటే..
ముందుగా LIC అధికారిక వెబ్‌సైట్ www.licindia.inకి వెళ్లండి
ఆ తర్వాత Login to Customer Portal పై క్లిక్ చేయండి
నెక్ట్స్ మీ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ తో లాగిన్ అవ్వండి
లాగిన్ అయిన తరువాత Policy Status ఆప్షన్ పై క్లిక్ చేయండి
మీరు రిజిస్టర్ అయిన అన్ని పాలసీలు అక్కడ కనిపిస్తాయి
ఆ క్రమంలో మీరు చూడాలనుకుంటున్న పాలసీ నంబర్‌పై క్లిక్ చేస్తే.. ప్రీమియం వివరాలు, పాలసీ టర్మ్, సమ్ అష్యూర్డ్ (Sum Assured), లోన్ అర్హత లాంటి విషయాలు కనిపిస్తాయి.
చివరకు మీరు అవసరమైన పాలసీ స్టేట్‌మెంట్‌ను PDF ఫార్మాట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు
మీ దగ్గర ఒకటి కంటే ఎక్కువ లేదా మీ పిల్లల పేరుతో పాలసీలు ఉంటే Enroll Policy ఆప్షన్ ద్వారా వాటిని జత చేయొచ్చు. ఏవైనా సమస్యలు ఉంటే LIC కస్టమర్ కేంద్రాల ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చు.
కొత్త యూజర్లు మొదటిసారి రిజిస్టర్ అవ్వాలంటే
మొదటగా www.licindia.inలోకి వెళ్లి Login to Customer Portalపై క్లిక్ చేయండి
ఆ తర్వాత New User లేదా Sign Up ఆప్షన్ ఎంచుకోండి
తర్వాత ఆ డిటైల్స్ ఎంటర్ చేయాలి
పాలసీ నంబర్, మీరు చెల్లించే ప్రీమియం మొత్తం, పుట్టిన తేది, రిజిస్టర్ చేసిన మొబైల్ నంబర్, ఇమెయిల్ ఐడీ ఇవ్వండి.
మీకు కావలసిన యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ సెట్ చేసుకోండి
LIC నుంచి వచ్చిన SMS లేదా ఇమెయిల్ లింక్ ద్వారా అకౌంట్ వేరిఫై చేయండి
అకౌంట్ యాక్టివ్ అయిన తర్వాత మళ్లీ లాగిన్ అయి పాలసీ వివరాలు చూడొచ్చు
రిజిస్టర్ అయిన తర్వాత మీ అన్ని పాలసీలను ఒకే ప్లేస్‌లో నిర్వహించవచ్చు. బోనస్ డీటెయిల్స్, లోన్ స్టేటస్, క్లెయిమ్ వివరాలు, పేమెంట్ సర్టిఫికేట్లు కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
SMS ద్వారా LIC పాలసీ స్టేటస్ తెలుసుకోవడం ఎలా
మొదట మీ ఫోన్‌లో ఈ ఫార్మాట్‌లో టైప్ చేయండి
ASKLIC <policy number> STATUS
ఈ మెసేజ్‌ను 9222492224 లేదా 56767877 నంబర్లకు పంపండి
మీ పాలసీ స్టేటస్, ప్రీమియం డ్యూ డేట్ తదితర వివరాలతో కూడిన మెసేజ్ మీకు వస్తుంది
SMS ద్వారా మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే ఈ ఫార్మాట్‌లు ఉపయోగించండి
ASKLIC <policy number> PREMIUM – ప్రీమియం మొత్తం
ASKLIC <policy number> BONUS – బోనస్ సమాచారం
ASKLIC <policy number> LOAN – లోన్ అర్హత వివరాలు
అలాగే మీకు ఇంటర్నెట్ లేదా SMS అవకాశం లేకపోతే, LIC కస్టమర్ కేర్‌కి (022-68276827) కాల్ చేసి సమాచారం తెలుసుకోవచ్చు.
ఇవి కూడా చదవండి
రూ.15 వేల పెట్టుబడితో రూ.12 కోట్ల రాబడి.. ఎలాగో తెలుసా..
పాత పన్ను విధానం ఎంచుకున్న వారికి గుడ్ న్యూస్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి