Share News

Saving Plan: పోస్టాఫీస్ స్కీంలో రూ.10 లక్షల పెట్టుబడి..వచ్చేది మాత్రం రూ. 21 లక్షలు..

ABN , Publish Date - May 14 , 2025 | 03:01 PM

దేశంలో అనేక పెట్టుబడి పథకాలు వచ్చినప్పటికీ పలు రకాల పోస్టాఫీస్ స్కీమ్స్ మాత్రం ఇప్పటికీ ఆదరణ పొందుతున్నాయి. వీటిలో టైం డిపాజిట్ స్కీం (Time Deposit Scheme) ఒకటి. ఈ స్కీం స్పెషల్ ఏంటి, లాభాలు ఎలా ఉంటాయనే విషయాలను ఇక్కడ చూద్దాం.

 Saving Plan: పోస్టాఫీస్ స్కీంలో రూ.10 లక్షల పెట్టుబడి..వచ్చేది మాత్రం రూ. 21 లక్షలు..
post office time deposit scheme

ప్రస్తుత ఆర్థిక ప్రపంచంలో అనేక మంది కూడా తక్కువ సమయంలో పెద్ద మొత్తాలను పొందాలని చూస్తున్నారు. ఇదే సమయంలో ఇంకొంత మంది మాత్రం ఎలాంటి రిస్క్ లేకుండా చేసిన పెట్టుబడులు డబుల్ కావాలని కోరుకుంటున్నారు. ఇలాంటి వారికి పోస్టాఫీస్ టైం డిపాజిట్ స్కీం (Post Office Time Deposit Scheme) బెస్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు. ఈ స్కీంలో మీరు ఇన్వెస్ట్ చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వ హామీతో కూడిన రిస్క్ ఫ్రీ ఇన్వెస్ట్‌మెంట్‌ సౌకర్యం మీకు లభిస్తుంది. అయితే ఈ స్కీంలో 10 లక్షల రూపాయలు పెట్టుబడి చేస్తే ఎంత కాలంలో డబుల్ అవుతుంది. ఈ పథకం లాభాలు ఏంటనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.


టైం డిపాజిట్ స్కీం అంటే ఏంటి

పోస్టాఫీస్ టైం డిపాజిట్ స్కీం అనేది ఫిక్స్‌డ్ డిపాజిట్‌ మాదిరిగా పనిచేస్తుంది. ఇది 1, 2, 3, 5 సంవత్సరాల వరకు ఉంటుంది. ఆ తర్వాత దీన్ని ప్రతి 5 సంవత్సరాలకు పొడిగింపు చేసుకోవచ్చు. దీంతోపాటు వడ్డీ రేటు కూడా ప్రభుత్వం నిర్దేశించిన విధంగా ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. కానీ ఒకసారి మీరు డిపాజిట్ చేసిన తర్వాత, ఆ కాలానికి ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేటు మాత్రమే మీకు వర్తిస్తుంది.

రూ. 10 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే..

మీరు పోస్టాఫీస్ టైం డిపాజిట్ స్కీంలో రూ. 10 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే, ప్రస్తుతం 7.5% వార్షిక వడ్డీ రేటు ప్రకారం మీకు పదేళ్ల తర్వాత రూ.21 లక్షలు లభిస్తాయి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ విధానంలో 10 ఏళ్ల తర్వాత ఈ మొత్తం మీకు లభిస్తుంది. దీనికి స్టాక్ మార్కెట్ పెట్టుబడులకు సంబంధం ఉండదు. కాబట్టి మీరు చేసిన పెట్టుబడిని ఎలాంటి రిస్క్ లేకుండా పొందుతారు.


టైం డిపాజిట్ ముఖ్య లక్షణాలు

  • వడ్డీ రేటు: ప్రస్తుతం 5 సంవత్సరాల డిపాజిట్‌కి 7.5% వార్షిక వడ్డీ రేటు లభిస్తుంది (2025 ఏప్రిల్ ప్రకారం)

  • పన్ను మినహాయింపు: 5 సంవత్సరాల టర్మ్ డిపాజిట్‌పై పెట్టుబడికి సెక్షన్ 80C క్రింద పన్ను మినహాయింపు లభిస్తుంది

  • రిన్యూవల్ సౌకర్యం: 1, 2, 3, 5 సంవత్సరాల వరకు డిపాజిట్ చేసేందుకు వీలుంది. కాలపరిమితి ముగిసిన తర్వాత మళ్లీ రీన్యువల్ చేసుకోవచ్చు

  • జాయింట్ ఖాతా సౌకర్యం: ఒకరికి లేదా ఇద్దరికి కలిపి ఖాతా తీసుకోవచ్చు

  • నామినేషన్ సౌకర్యం: ఈ ఖాతాకు నామినీని నిర్ణయించుకోవచ్చు

ప్రయోజనాలు

  • భద్రత: ఈ పోస్టాఫీస్ స్కీమ్‌పై కేంద్ర ప్రభుత్వ హామీ ఉంటుంది. ఇది బ్యాంకుల కంటే ఎక్కువ భద్రత కలిగి ఉంటుంది.

  • స్థిర ఆదాయం: వడ్డీని నెలవారీగా తీసుకోవచ్చు లేదా చివర్లో ఒకేసారి కూడా తీసుకోవచ్చు

  • సులభం: ఖాతా తెరవడం, నిర్వహించడం చాలా తేలికగా ఉంటుంది.

  • పన్ను మినహాయింపు: సెక్షన్ 80C కింద 1.5 లక్షల వరకు మినహాయింపు పొందవచ్చు


ఇవి కూడా చదవండి

Penny Stock: ఈ స్టాక్‎పై రూ.4 లక్షల పెట్టుబడి..ఏడేళ్ల లోనే రూ.56 లక్షల లాభం..


Investment Tips: ఒకేసారి రూ.3.5 లక్షల పెట్టుబడి..కానీ వచ్చేది మాత్రం కోటి, ఎలాగంటే..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 14 , 2025 | 03:04 PM