Honda Launches Sporty New Elevate ADV: మార్కెట్‌లోకి హోండా ఎలివేట్ ఏడీవీ..
ABN , Publish Date - Nov 21 , 2025 | 05:07 PM
హోండా కార్స్ ఇండియా సరికొత్త ఎస్‌యూవీ ‘ఎలివేట్ ఏడీవీ’ ని మార్కెట్లో ప్రవేశపెట్టింది. యువతను ఆకట్టుకునేలా దీనికి అనేక అధునాతన ఫీచర్లు జోడించినట్టు మార్కెటింగ్ అండ్ సేల్స్ వైస్ ప్రెసిడెంట్ కునాల్ బెహల్ చెప్పారు.
ఎక్స్ షోరూమ్ ధర రూ.16.66 లక్షలు
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): హోండా కార్స్ ఇండియా సరికొత్త ఎస్‌యూవీ ‘ఎలివేట్ ఏడీవీ’ ని మార్కెట్లో ప్రవేశపెట్టింది. యువతను ఆకట్టుకునేలా దీనికి అనేక అధునాతన ఫీచర్లు జోడించినట్టు మార్కెటింగ్ అండ్ సేల్స్ వైస్ ప్రెసిడెంట్ కునాల్ బెహల్ చెప్పారు. రెండు వెర్షన్లలో లభించే ఈ కారు ఎక్స్ షోరూమ్ ధర హైదరాబాద్‌లో రూ.15.20 లక్షల నుంచి రూ.16,66,800 వరకు ఉంది. రెండు తెలుగు రాష్ట్రాలు తమకు అత్యంత కీలక మార్కెట్లని తెలిపారు. తమ మొత్తం అమ్మకాల్లో ఈ 2 రాష్ట్రాల వాటా ఏడు శాతం వరకు ఉంటుందన్నారు.
వచ్చే ఏడాది అల్ఫా ఈవీ: వచ్చే ఆర్థిక సంవత్సరం అల్ఫా ఈవీ కారును భారత్‌లోనూ విడుదల చేయబోతున్నట్టు వెల్లడించారు. ఇందుకోసం ఇప్పటికే చార్జింగ్ పాయింట్ ఆపరేటర్లతో చర్చిస్తున్నట్టు కునాల్ చెప్పారు. ఈ ఈవీ కారును భారత్‌లో తయారుచేసి జపాన్‌తో సహా అనేక దేశాలకు ఎగుమతి చేయబోతున్నట్టు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రూపాయి మారకానికి లక్ష్యమేమీ పెట్టుకోలేదు
For More Business News And Telugu News