Gold and Silver Rate Updates: మార్కెట్లో దూసుకుపోతున్న పసిడి, వెండి.. ప్రస్తుత ధరలివే..
ABN , Publish Date - Nov 28 , 2025 | 01:15 PM
గురువారంతో పోలిస్తే శుక్రవారం ఉదయం నాటికి స్వల్పంగా పెరిగిన బంగారం ధర ప్రస్తుతం దూసుకుపోతోంది. అటు వెండి కూడా భారీ స్థాయిలో పెరుగుదలను నమోదుచేస్తోంది. నేటి మధ్యాహ్నానికి మార్కెట్లో ట్రేడవుతున్న పసిడి, వెండి ధరలను ఓసారి పరిశీలిస్తే...
ఇంటర్నెట్ డెస్క్: నేటి మార్కెట్లో బంగారం, వెండి ధరలకు రెక్కలొచ్చినట్టుగా దూసుకుపోతున్నాయి. శుక్రవారం ఉదయంతో పోలిస్తే.. మధ్యాహ్నం 1:00 గంటలకు భారీగా ఎగబాకాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో.. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధరపై రూ.870 మేర పెరిగి రూ.1,28,460గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు రూ.1,17,750గా ట్రేడవుతోంది(Gold Rates in Hyderabad).
ఇక దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,28,610 గానూ, 22 క్యారెట్ల 10 గ్రాములకు రూ.1,17,900 గా ఉంది(Gold Rate in Delhi).
అటు.. వెండి ధర కూడా భారీ స్థాయిలో ఎగబాకింది. హైదరాబాద్(Silver Rate in Hyderabad)కిలో వెండిపై శుక్రవారం ఉదయంతో పోలిస్తే ప్రస్తుతం సుమారు రూ.3,000 పెరిగి రూ.1,83,000గా ఉంది. ఢిల్లీలో ప్రస్తుతం కిలో వెండి రేటు రూ.1,76,000 వద్ద కొనసాగుతోంది(Silver Rate in Delhi).
గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు మార్కెట్లో ఎప్పటికప్పుడూ మారుతూ ఉంటాయి. కావున కొనుగోలుదారులు ఈ విషయాన్ని గమనించి మరోసారి ధరలను పరిశీలించగలరు.
ఇవీ చదవండి: