Gold and Silver Rates Today: భారీగా పెరిగిన గోల్డ్, సిల్వర్ రేట్లు.. నేటి ధరలివే..
ABN , Publish Date - Nov 13 , 2025 | 10:55 AM
బుధవారం స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఇవ్వాళ భారీ స్థాయిలో పెరుగుదలను నమోదుచేశాయి. గురువారం ఉదయం 9 గంటల తర్వాత మార్కెట్లో పసిడి, వెండి రేట్లు ఎలా ఉన్నాయంటే...
ఇంటర్నెట్ డెస్క్: నేటి మార్కెట్లో పసిడి ధరలు మరోసారి భారీ పెరుగుదలను నమోదు చేశాయి. ఈరోజు ఉదయం 9 గంటల తర్వాత పుత్తడి రేటు భారీగా పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.2,290 పెరిగి రూ.1,27,800లకు (Gold Rate in Hyderabad) చేరింది. 22 క్యారెట్ల 10గ్రాముల పసిడి రూ.2,100 ఎగబాకి రూ.1,17,150గా నమోదైంది.
అయితే.. ఇటీవల ధరలు బాగా తగ్గడంతో కొనుగోళ్లు పెరగడమే ఈ పెరుగుదలకు కారణంగా కనిపిస్తోంది (live gold rates). ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి రేటు 10 గ్రాములకు రూ. 1,27,950కి చేరగా.. 22 క్యారెట్ల పుత్తడి ధర 10 గ్రాములకు రూ. 1,17,300కి ఎగబాకింది.
అటు వెండి రేట్లు కూడా భారీ పెరుగుదలను నమోదు చేశాయి. హైదరాబాద్‌లో కిలో సిల్వర్ రేటు(Silver Rate updates) రూ.9000 పెరిగి.. రూ.1,82,000లకు చేరింది. ఇక ఢిల్లీలో కిలో వెండి రూ.10,000 పెరిగి ధర రూ.1,72,000గా ఉంది.
గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు మార్కెట్లో ఎప్పటికప్పుడూ మారుతూ ఉంటాయి. కాబట్టి కొనుగోలుదారులు ఆ సమయంలో మరోసారి ధరలు పరిశీలించాలని సూచించడమైనది.
ఇవీ చదవండి:
మీ చూపు శక్తివంతమైనదైతే.. ఈ ఫొటోలో తోడేలును 9 సెకెన్లలో కనిపెట్టండి..
మీ మిక్సీ జార్ తిరగడం లేదా.. ఈ సూపర్ ట్రిక్ ఉపయోగించి చూడండి..