Gold Silver Rates Today: తగ్గిన బంగారం, వెండి ధరలు..ఎంతకు చేరుకున్నాయంటే..
ABN , Publish Date - Jul 21 , 2025 | 06:38 AM
బంగారం, వెండి ధరలు తగ్గుతాయని చూస్తున్న వారికి కీలక అప్డేట్ వచ్చేసింది. ఈరోజు (జూలై 21) నిన్నటి రేట్లతో పోల్చితే స్వల్పంగా తగ్గాయి. ఈ క్రమంలో ఏ మేరకు చేరుకున్నాయి, ఏంటనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

బంగారం, వెండి ధరలు తగ్గుతాయని ఆశిస్తున్న వారికి కాస్త ఊరట లభించింది. ఎందుకంటే నిన్నటి ధరలతో పోల్చితే వీటి రేట్లు ఈరోజు (జూలై 21న) స్వల్పంగా తగ్గుముఖం (gold rates today on july 21st 2025) పట్టాయి. ఈ నేపథ్యంలో గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం ఉదయం 6.30 గంటల సమయానికి 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1, 00, 030కి చేరుకుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 91, 690గా ఉంది.
ఇది నిన్నటి రేటుతో పోల్చుకుంటే స్వల్పంగా రూ.10 మాత్రమే తగ్గింది. ఈ రోజు ధరల తగ్గుదల స్వల్పమైనదే అయినప్పటికీ, పెద్ద మొత్తంలో పసిడి కొనుగోలు చేసే వారికి ఇది ఒక మంచి అవకాశంగా మారనుంది. మరోవైపు సామాన్యులు మాత్రం లక్షకు చేరుకున్న పసిడి ధరలను చూసి కొనుగోలు చేయాలా వద్దా అని ఆలోచిస్తున్నారు.
ఇతర నగరాల్లో బంగారం ధరలు (10 గ్రాములకు):
చెన్నైలో 24 క్యారెట్ రూ. 1,00,030, 22 క్యారెట్ రూ. 91,690
ముంబైలో 24 క్యారెట్ రూ. 1,00,030, 22 క్యారెట్ రూ. 91,690
ఢిల్లీలో 24 క్యారెట్ రూ. 1,00,180, 22 క్యారెట్ రూ. 91,840
కోల్‌కతాలో 24 క్యారెట్ రూ. 1,00,030, 22 క్యారెట్ రూ. 91,690
బెంగళూరులో 24 క్యారెట్ రూ. 1,00,030, 22 క్యారెట్ రూ. 91,690
హైదరాబాద్లో 24 క్యారెట్ రూ. 1,00,030, 22 క్యారెట్ రూ. 91,690
విజయవాడలో 24 క్యారెట్ రూ. 1,00,030, 22 క్యారెట్ రూ. 91,690
విశాఖపట్నంలో 24 క్యారెట్ రూ. 1,00,030, 22 క్యారెట్ రూ. 91,690
నేటి వెండి ధరలు
ఇక వెండి ధరల విషయానికి వస్తే వీటి ధరలు కూడా నిన్నటి రేటుతో పోల్చితే స్వల్పంగానే తగ్గాయి. కిలో వెండి ధర నిన్న రూ. 1,16,000గా ఉండగా ఈరోజు మాత్రం 1,15,900కు చేరుకుంది. అంటే కేజీ వెండి ధర రూ.100 మాత్రమే తగ్గింది. ఈ క్రమంలో ఇతర నగరాల్లో వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ చూద్దాం.
ముంబైలో రూ. 1,15,900
ఢిల్లీలో రూ. 1,15,900
హైదరాబాద్లో రూ. 1,25,900
విజయవాడలో రూ. 1,25,900
విశాఖపట్నంలో రూ. 1,25,900
చెన్నైలో రూ. 1,25,900
కోల్‌కతాలో రూ. 1,15,900
బెంగళూరులో రూ. 1,15,900
గమనిక: ఈ బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి కొనుగోలు చేసే ముందు మళ్లీ వీటి ధరల గురించి తెలుసుకుని నిర్ణయించుకోవడం మంచిది.
ఇవి కూడా చదవండి
ఈ వారం రానున్న ఐపీఓలు ఇవే.. ఈసారి ఎన్ని వస్తున్నాయంటే..
ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి