Share News

Aerospace education India: ఐఐటీలు అందించే ఉచిత ఏరో ఇంజనీరింగ్‌ కోర్సులు

ABN , Publish Date - Jul 21 , 2025 | 05:53 AM

ఏరోస్పేస్‌ ఇంజనీరింగ్‌కు సంబంధించి దేశంలోని కొన్ని ఐఐటీలు ఉచిత ఆన్‌లైన్‌ కోర్సులను అందిస్తున్నాయి. ఆసక్తి, అర్హతలు గల అభ్యర్థులు తమ రెగ్యులర్‌ కోర్సులతోపాటు...

Aerospace education India: ఐఐటీలు అందించే ఉచిత ఏరో ఇంజనీరింగ్‌ కోర్సులు

ఏరోస్పేస్‌ ఇంజనీరింగ్‌కు సంబంధించి దేశంలోని కొన్ని ఐఐటీలు ఉచిత ఆన్‌లైన్‌ కోర్సులను అందిస్తున్నాయి. ఆసక్తి, అర్హతలు గల అభ్యర్థులు తమ రెగ్యులర్‌ కోర్సులతోపాటు వీటిని కూడా చేయవచ్చు.

దేశంలో ఏరోస్పేస్‌ ఇంజనీరింగ్‌ చదవాలనుకునే విద్యార్థుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. వీటిని దృష్టిలో పెట్టుకుని ఐఐటీలు ఈ ఉచిత ఆన్‌లైన్‌ కోర్సులను డెవల్‌పచేశాయి.

ఇంట్రడక్షన్‌ టు ఏరోస్పేస్‌ ఇంజనీరింగ్‌: ఈ కోర్సును బొంబాయి ఐఐటీ అందిస్తోంది. ఏరోనాటికల్‌ ఇంజనీరింగ్‌ రంగం పట్ల బేసిక్‌ అవగాహన కల్పించడానికి ఈ కోర్సును ప్రారంభించారు. 2025 ఆగస్ట్‌ 15 తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి.

ఇంట్రడక్షన్‌ టు ఎయిర్‌ క్రాఫ్ట్‌ డిజైన్‌: ఈ కోర్సును బొంబాయి ఐఐటీ అందిస్తోంది. ఎయిర్‌క్రాఫ్ట్‌, వాటి ఫీచర్స్‌, కాన్ఫిగరేషన్‌ సెలెక్షన్‌, టైప్స్‌ ఆఫ్‌ లోడ్స్‌, ఆపరేషనల్‌ ఇష్యూస్‌ తదితారాలన్నింటినీ బోధిస్తారు. 2025 ఆగస్ట్‌ 15 తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి.

ఎలిమెంట్స్‌ ఆఫ్‌ మెకానికల్‌ వైబ్రేషన్‌: ఢిల్లీ ఐఐటీ ఈ కోర్సును అందిస్తోంది. వైబ్రేషన్‌ థియరీ ఫండమెంటల్స్‌, ప్రాక్టికల్‌ ఎగ్జామ్‌పుల్స్‌ తదితరాలు ఇందులో ఉంటాయి. 2025 ఆగస్ట్‌ 15 తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి. నవంబర్‌ మొదటి వారంలో పరీక్షలు నిర్వహిస్తారు.

ఇంట్రడక్షన్‌ టు ఎయిర్‌ప్లేన్‌ పర్ఫార్మెన్స్‌: కాన్పూర్‌ ఐఐటీ ఈ కోర్సును అందిస్తోంది. ఎయిర్‌ క్రాఫ్ట్‌ డిజైన్‌, ప్లైట్‌ టెస్టింగ్‌, ఎయిర్‌ప్లేన్‌ పర్ఫార్మెన్స్‌ తదితరాలను వివరిస్తారు. 2025 ఆగస్ట్‌ 15 తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి. నవంబర్‌ మొదటి వారంలో పరీక్షలు నిర్వహిస్తారు.

ఎయిర్‌ క్రాఫ్ట్‌ స్టెబిలిటీ అండ్‌ కంట్రోల్‌: కాన్పూర్‌ ఐఐటీ ఈ కోర్సును అందిస్తోంది. ఎయిర్‌ప్లేన్‌ స్టెబిలిటీ, కంట్రోల్‌ విషయాలను బోధిస్తారు. 2025 ఆగస్ట్‌ 15 తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి.

డిజైన్‌ టు ఫిక్స్‌డ్‌ వింగ్‌ అన్‌మాన్డ్‌ ఏరియల్‌ వెహికిల్స్‌: కాన్పూర్‌ ఐఐటీ ఈ కోర్సును అందిస్తోంది. 2025 జూలై చివరి వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.


యూఏవీ డిజైన్‌: కాన్పూర్‌ ఐఐటీ ఈ కోర్సును అందిస్తోంది. 2025 ఆగస్ట్‌ 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇంట్రడక్షన్‌ టు ఎయిర్‌ బ్రీతింగ్‌ ప్రొపల్షన్‌: కాన్పూర్‌ ఐఐటీ ఈ కోర్సును అందిస్తోంది. ప్రొపల్షన్‌ థియరీ, ప్రాక్టికల్స్‌పై క్లాసులు ఉంటాయి. ఎయిర్‌ క్రాఫ్ట్స్‌, రాకెట్‌ ఇంజన్ల డిజైన్‌, ఆపరేషన్‌, ఇన్‌స్టాలేషన్‌, రిపెయిర్‌, మెయింటెనెన్స్‌పై అవగాహన పెంచుతారు.

అప్లయిడ్‌ కంప్యూటేషనల్‌ ఫ్లూయిడ్‌ డైనమిక్స్‌: కాన్పూర్‌ ఐఐటీ ఈ కోర్సును అందిస్తోంది. 2025 ఆగస్ట్‌ 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

స్పేస్‌ ఫ్లయిట్‌ మెకానిక్స్‌: ఖరగ్‌పూర్‌ ఐఐటీ ఈ కోర్సును అందిస్తోంది.

ఇవీ చదవండి:

ఈ యాప్స్‌తో వృథా ఖర్చులకు కళ్లెం.. ఓసారి ట్రై చేసి చూడండి

వేతన జీవులకు అక్కరకొచ్చే 50-30-20 ఫార్ములా

Read Latest and Business News

Updated Date - Jul 21 , 2025 | 05:53 AM