Share News

Investment Tips: రూ.15 వేల పెట్టుబడితో రూ.12 కోట్ల రాబడి.. ఎలాగో తెలుసా..

ABN , Publish Date - Jul 02 , 2025 | 03:08 PM

సాధారణంగా ఎవరికైనా కూడా ధనవంతులు కావాలని ఉంటుంది. కానీ దీనికోసం ఏ స్కీంలో ఇన్వెస్ట్ (Investment Tips) చేయాలి, ఎలా ప్లాన్ చేయాలనేది తెలియదు. అయితే ఇక్కడ చెప్పిన విధానాన్ని పాటిస్తే మాత్రం కోటీశ్వరులు కావడం ఖాయమని నిపుణులు చెబుతున్నారు.

Investment Tips: రూ.15 వేల పెట్టుబడితో రూ.12 కోట్ల రాబడి.. ఎలాగో తెలుసా..
Investment Tips

అనేక మంది కూడా కోటీశ్వరులు కావాలని భావిస్తుంటారు. కానీ దాని కోసం ఏం చేయాలి, ఎలా చేయాలనే విషయాలు మాత్రం తెలియవు. అలాంటి వారు దీర్ఘకాలంలో పెట్టుబడులు (Investment Tips) చేయాలని చూస్తే మాత్రం, సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. దీనిలో చిన్న మొత్తాలతో మొదలుపెట్టి, సమయానుకూలంగా పెద్ద మొత్తాలుగా మార్చుకోవచ్చు. అయితే సంపదను సృష్టించుకోవడం ఒకేసారి సాధ్యం కాదు. కానీ క్రమంగా పొదుపు చేస్తూ పెట్టుబడులు పెడితే మాత్రం దీర్ఘకాలంలో తప్పకుండా కోటీశ్వరులు అవుతారని నిపుణులు చెబుతున్నారు.


మొత్తం పెట్టుబడి ఎంత, వచ్చేది ఎంత

ఈ నేపథ్యంలో మీరు ప్రతి నెలా రూ. 15,000 చొప్పున క్రమంగా పెట్టుబడి చేస్తే, కొన్నేళ్లలోనే రూ.12 కోట్లు సంపాదించడం ఈజీగా సాధ్యమవుతుందని అంటున్నారు నిపుణులు. గతంలో పలు రకాల ఈక్విటీ ఫండ్లు సగటున 12% నుంచి 21% వరకు వార్షిక వృద్ధిరేటును అందించాయి. దీని ప్రకారం ఇక్కడ 15% CAGR (Compound Annual Growth Rate) పరిగణలోకి తీసుకుంటే కేవలం 33 ఏళ్లలోనే రూ.12 కోట్లు దక్కించుకోవచ్చు. ఈ క్రమంలో చేసిన మొత్తం పెట్టుబడి రూ. 59,40,000 కాగా, వచ్చే రాబడి మాత్రం దాదాపు రూ.12,91,53,034గా ఉంటుంది. అంటే ఇక్కడ వడ్డీ రూపంలోనే రూ.12,32,13,034 రానున్నాయి.

sip 12 crore.jpg


మొత్తం ఎంత..

ఇది ఎలా సాధ్యమంటే కాంపౌండింగ్ విధానంలో మీరు చేసిన పెట్టుబడులు క్రమంగా రూ. 13 కోట్లకు పెరుగుతాయి. ఇది మామూలు వృద్ధి కాదు. పదే పదే పెరుగుతున్న సంపద అని చెప్పవచ్చు. చిన్న పొదుపుల ద్వారా సిప్ పద్ధతిలో నిరంతరం పెట్టుబడులు చేస్తే మీరు మీ లక్ష్య సంపదను సులభంగా చేరుకోవచ్చు. దీనిలో మీరు 25 ఏళ్ల వయస్సులో ఇన్వెస్ట్ చేయడం ప్రారంభిస్తే, మీకు 58 ఏళ్లు వచ్చే నాటికి మీరు దాదాపు రూ. 13 కోట్ల మొత్తాన్ని పొందవచ్చు.

దీనిని మీరు మీ రిటైర్మెంట్ లేదా ఇళ్లు లేదంటే పిల్లల పెళ్లి వంటి అవసరాల కోసం ఉపయోగించుకోవచ్చు. చిన్న వయస్సులో ఉన్నప్పుడు ఈ పెట్టుబడులను ప్రారంభిస్తే దీర్ఘకాలంలో భారీ మొత్తాలను పొందే ఛాన్సుంది. భారీ సంపదను ఒక్క రోజులో నిర్మించుకోలేం. కానీ ప్రతీ నెల కొంత మొత్తంతో పెట్టుబడి చేస్తే మాత్రం మీ భవిష్యత్తుని మార్చుకోవచ్చు.

గమనిక: స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు చేయాలని ఆంధ్రజ్యోతి సూచించదు. సమాచారం మాత్రమే అందిస్తుంది. మీకు ఇన్వెస్ట్ చేయాలని ఆసక్తి ఉంటే, నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం.


ఇవి కూడా చదవండి

ఈపీఎఫ్ఓ నుంచి వచ్చిన 5 కీలక మార్పుల గురించి తెలుసా మీకు..

ఒకేసారి రూ.3.5 లక్షల పెట్టుబడి..కానీ వచ్చేది మాత్రం కోటి, ఎలాగంటే..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 02 , 2025 | 04:05 PM