US Tariffs: చైనా చర్యలకు తగ్గేదేలే.. అమెరికాకు వచ్చే దిగుమతులపై 245 శాతం సుంకాలు
ABN , Publish Date - Apr 16 , 2025 | 02:48 PM
ట్రంప్ ప్రభుత్వం చైనా దిగుమతులపై సుంకాలను 245 శాతం విధిస్తోంది. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఇది నిజమేనా, అమెరికా దీనిపై ఏం చెబతుందనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

అగ్రరాజ్యం అమెరికా ఇటీవల చైనాపై ప్రకటించిన సుంకాల నిర్ణయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా దిగుమతులపై 245 శాతం వరకు సుంకాలను పెంచారని వైట్ హౌస్ ఫ్యాక్ట్ షీట్ పేర్కొనడం, ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. అయితే ఈ సుంకాలు మొత్తం చైనా నుంచి వచ్చే అన్ని ఉత్పత్తులపై వర్తించవు. వాస్తవానికి 245% సుంకం అనేది పలు వేర్వేరు సుంకాల సమ్మేళనంగా ఉంటుందని తెలిపింది. ఇది చైనా ఉత్పత్తులపై అమలు చేయబడుతున్న మొత్తం సుంకాల గరిష్ట పరిమాణం.
సుంకాల మొత్తం
ఉదాహరణకు చైనీస్ సిరంజిలపై 100% సుంకం, ఫెంటానిల్ (ఓపియాయిడ్ డ్రగ్)పై 20% సుంకం, పరస్పర సుంకాలుగా 125% సుంకం విధించబడ్డాయి. ఈ మొత్తం సుంకాలను కలిపితే 245 శాతం అవుతుంది. ఈ విధంగా, చైనా ఉత్పత్తులపై అమలు చేయబడుతున్న సుంకాల మొత్తం 245%గా ఉంది. ఇది ట్రంప్ పరిపాలన చైనా దిగుమతులపై మొత్తం సుంకాలను 145% నుంచి 245%కి పెంచిందని మాత్రం కాదు. ఇప్పటికే అమల్లో ఉన్న వేర్వేరు సుంకాల మొత్తం 245%కి చేరుకుందని ఆయా వర్గాలు తెలిపాయి.
అరుదైన వస్తువుల విషయంలో..
ఈ సుంకాల పెంపు నిర్ణయం ఇప్పటికే అమెరికా, చైనా దేశాల మధ్య వాణిజ్య యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేస్తోంది. చైనా ఈ చర్యలకు ప్రతీకారంగా, అమెరికా నుంచి వచ్చే వస్తువులపై సుంకాలను పెంచింది. ఇది రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలను మరింత సంక్లిష్టం చేస్తోంది. దీంతోపాటు చైనా కూడా అమెరికా నుంచి వచ్చే వస్తువులపై నిషేధం విధిస్తోంది. ఈ క్రమంలోనే చైనా ఆటో, ఏరో స్పేస్, అయస్కాంతాలు సహా అరుదైన వస్తువుల ఎగుమతులను అమెరికాకు నిలిపివేసింది. అమెరికాకు ఎగుమతి చేయాల్సిన దుస్తువుల విషయంలో కూడా ఆంక్షలు విధించింది.
వచ్చే రోజుల్లో..
ఈ క్రమంలో ఈ రెండు దేశాల మధ్యం వాణిజ్య యుద్ధం ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు. ఈ సుంకాల ప్రభావం కాస్తా ఇప్పుడు అక్కడి ప్రజలపై భారం పడుతుంది. చైనా ఈ సుంకాలను తప్పించుకోవడానికి కొత్త విధాన చర్యలను ప్రకటించింది. ఇది చైనా ఎగుమతులను రక్షించడానికి, విదేశీ వాణిజ్య పరిమితులకు వ్యతిరేకంగా మంచి వాతావరణాన్ని సృష్టించడానికి చైనా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వచ్చే రోజుల్లో సుంకాల తగ్గింపు అంశంపై ఈ దేశాలు వెనక్కి తగ్గుతాయా లేదా అనేది చూడాలి మరి.
ఇవి కూడా చదవండి:
Bill Gates: వారానికి మూడు రోజేలే పని..బిల్ గేట్స్ ఆసక్తికర వ్యాఖ్యలు..
iPhone like Design: రూ.6 వేలకే ఐఫోన్ లాంటి స్మార్ట్‌ఫోన్.. ఫీచర్లు తెలిస్తే షాక్ అవుతారు..
Monthly Income: 50 ఏళ్ల తర్వాత నెలకు రూ.లక్ష కావాలంటే ఎంత సేవ్ చేయాలి, ఎన్నేళ్లు చేయాలి
Read More Business News and Latest Telugu News