Share News

BSNL Latest Offers: బీఎస్‌ఎన్‌ఎల్‌‌ అదిరిపోయే ఆఫర్.. మీరూ ఓ లుక్కేయండి

ABN , Publish Date - Apr 10 , 2025 | 12:42 PM

BSNL Latest Offers: ప్రభుత్వ టెలికాం రంగ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ కస్టమర్లకు అదిరిపోయే న్యూస్‌తో ముందుకు వచ్చింది. ఉచిత కాలింగ్, ఇతర ప్రయోజనాలతో ఓ బెస్ట్ ప్లాన్‌ను కస్టమర్లకు అందుబాబులోకి తీసుకొచ్చింది.

BSNL Latest Offers: బీఎస్‌ఎన్‌ఎల్‌‌ అదిరిపోయే ఆఫర్.. మీరూ ఓ లుక్కేయండి
BSNL Latest Offers

కస్టమర్లను ఆకర్షించేందుకు మరో సరికొత్త ప్లాన్‌తో ప్రభుత్వ టెలికాం రంగం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ (BSNL) ముందుకు వచ్చింది. ప్రైవేటు సంస్థల నుంచి పోటీని ఎదుర్కొనేందుకు అనేక ఆఫర్లతో దూసుకెళ్తోంది. కొత్త కస్టమర్లను ఆకర్షించేందుకు డాటా, రీచార్జ్ ఆఫర్లను అంతకంతకు మెరుగుపరుస్తూ వస్తోంది. తక్కువ ధరకే అద్భుతమైన వాలిడిటీ, డేటా ప్లాన్స్‌, అపమరిమిత కాల్స్‌అందిస్తూ కస్టమర్లను బీఎస్‌ఎన్‌ఎల్‌ ఆకట్టుకుంటోంది. ఈ మధ్య కాలంలో బీఎస్‌ఎన్‌ఎల్ ప్రవేశపెట్టిన ప్లాన్లు ప్రైవేటు కంపెనీల పనితీరును ప్రభావితం చేశాయి. బీఎస్‌ఎన్‌ఎల్ తీసుకొచ్చిన ఆఫర్లు బడ్జెట్, అనుకూలమైన డేటా ప్లాన్‌ కోరుకునే కస్టమర్లకు ఉపశమనమనే చెప్పుకోవచ్చు. సరసమైన రీఛార్జ్ ప్లాన్‌లతో టెలికాం రంగంలోనే బీఎస్‌ఎన్‌ఎల్ మంచి గుర్తింపు పొందింది.


లాంగ్ టర్మ్ వాలిడిటీ ఉన్న అనేక రకాల ప్లాన్‌లను అందిస్తూ.. టెలికాం రంగంలో బీఎస్‌ఎన్‌ఎల్ ప్రత్యేకతను చాటుకుంటోంది. బీఎస్‌ఎన్‌ఎల్ 45, 70, 150, 160, 180, 336, 365, 425 రోజుల వ్యాలిడిటీ ప్లాన్లతో మిలియన్ల మంది మొబైల్ వినయోగదారులకు సేవలను అందిస్తోంది. ఇప్పుడు తాజాగా తక్కువ ధరకే హై స్పీడ్ డేటా ప్లాన్‌‌ను కస్టమర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది బీఎస్‌ఎన్‌ఎల్.


రూ.399 రీఛార్జ్ ప్లాన్

పోస్ట్‌పెయిడ్‌ లైనప్‌లో ఇటీవల బీఎస్‌ఎన్‌ఎల్ విడుదల చేసిన రూ.399 రీఛార్జ్ ప్లాన్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ ప్లాన్‌లో ప్రతీ నెలా 70జీబీ డేటాను అందిస్తుంది. అలాగే 210 జీబీ వరకు క్యారీ ఓవర్ చేసుకునేందుకు అనుమతించేలా డేటా రోల్ ఓవర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఆఫర్ పోస్ట్ పెయిడ్ కస్టమర్లను ప్రత్యేకంగా అందుబాటులో ఉండనుంది. అంతే కాకుండా ఉచిత కాలింగ్‌తో పాటు ఇతర ప్రయోజనాలు కూడా ఈ ఆఫర్‌లో ఉన్నాయి. రోజూ సుమారు రూ.13 ఖర్చుతో ప్లాన్ రోల్ ఓవర్ ప్రయోజనాలతో 70జీబీ డేటాను బీఎస్‌ఎన్‌ఎల్ అందిస్తోంది.


త్వరలో బీఎస్‌ఎన్‌ఎల్ 5జీ సేవలు

అంతేకాకుండా బీఎస్‌ఎన్‌ఎల్‌కు 5జీ టెక్నాలజీని అందించేందుకు టెలికమ్యూనికేషన్ల విభాగం రూ.61,000 కోట్ల పెట్టుబడిని ప్రకటించింది. ఈ నిధులతో బీఎస్‌ఎన్‌ఎల్ త్వరలో 5జీ సేవలను అందించనుంది. ఈ కేటాయింపులతో బీఎస్ఎన్‌ఎల్‌కు అవసరమైన రేడియో ఫ్రీక్వెన్సీల సౌలభ్యాన్ని కలిగి ఉంటుంది. వీటిలో హైస్పీడ్ ఇంటర్నెట్, 5జీతో మెరుగైన కనెక్టివిటీని అందించే కీలకమైన స్పెషల్ బాండ్స్ ఉండనున్నాయి.


ఇవి కూడా చదవండి

Case against Thopudurthi: రాప్తాడు మాజీ ఎమ్మెల్యేపై కేసు ఫైల్.. కారణమిదే

Kidney Stones: ఈ మొక్కతో కిడ్నీలో రాళ్లు కరిగిపోవాల్సిందే

Read Latest Business News And Telugu News

Updated Date - Apr 10 , 2025 | 01:42 PM