Gold Loan: తక్కువ వడ్డీతో లోన్ కావాలా.. ఇలా చేయండి!
ABN , Publish Date - Nov 07 , 2025 | 12:16 PM
ఇటీవల కాలంలో ఎక్కువగా గోల్డ్ లోన్ తీసుకోవడానికి ప్రజలు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా లోన్ తీసుకునేవారు పర్సనల్ లోన్, క్రెడిట్ కార్డుల కంటే బంగారం తాకట్టు పెట్టి లోన్ పొందాలనుకుంటున్నారు. వడ్డీ భారం తగ్గడంతో బంగారు రుణాలు తీసుకునేందుకు దృష్టి సారిస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
ఇంటర్నెట్ డెస్క్, నవంబర్ 7: జాతీయ, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా బంగారం ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఏడాది క్రితం రూ. 40 వేలు ఉన్న పసిడి ధర ప్రస్తుతం రూ. లక్షకు పైగా పెరిగిపోయింది. రోజురోజుకూ పెరుగుతున్న బంగారం ధరలతో పుత్తడి ప్రియులు షాక్‌కు గురవుతున్నారు. బంగారం కొందామంటే అందని ద్రాక్షలా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భారతీయులు ముఖ్యంగా బంగారం అంటే చాలా విలువ ఇస్తారు. దేశంలోని మహిళలు బంగారు ఆభరణాలు ధరిస్తారు. పేదవారి నుంచి ధనికులు వరకు తమకు వీలైనంత బంగారం కొనుగోలు చేస్తారు.
ముఖ్యంగా మహిళలకు సారీ ఫంక్షన్, పెళ్లి సమయంలో కట్నంగా బంగారు ఆభరణాలు అందజేస్తారు. దీంతో బంగారం వాడకం మిగితా దేశాలతో పోలిస్తే మనదేశంలోనే ఎక్కువ. ఇక డిమాండ్‌కు తగ్గట్టుగానే ధరలు కూడా ఆకాశాన్నంటున్నాయి. ధరల పెంపుతో ప్రతి ఒక్కరూ బంగారాన్ని ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించారు. కేవలం ఆభరణంగా, పెట్టుబడిగానే కాకుండా ఆర్థిక అవసరాల్ని వేగంగా తీర్చే నగదు వనరుగా బంగారం మారడంతో తాకట్టు పెట్టడం ద్వారా కూడా లోన్లు (Gold Loan) పొందొచ్చు.
దేశంలో రూ. 335 లక్షల కోట్ల విలువగల బంగారం
గత జూన్ వరకు చూస్తే భారతీయుల దగ్గర బంగారం నిల్వలు 34,600 టన్నులకు చేరాయని.. దీని విలువ చూస్తే ఏకంగా రూ. 335 లక్షల కోట్లుగా ఉంటుందని అమెరికా ఆర్థిక సేవల సంస్థ మోర్గాన్ స్టాన్లీ అంచనా వేసింది. ఎక్కువ భాగం ఇంట్లోని లాకర్లలో నిరుపయోగంగా ఉంటున్నట్లు తెలిపింది. ఈ మధ్య బంగారం ధరలు పెరుగుతున్నందున గోల్డ్ ని అమ్మెందుకు బదులు లోన్ రూపంలో తీసుకునే వారి సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు గోల్డ్ లోన్ తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నట్లు సంస్థ తెలిపింది.
గోల్డ్ లోన్‌తోనే తక్కవ వడ్డీ
ముఖ్యంగా లోన్ తీసుకునేవారు పర్సనల్ లోన్, క్రెడిట్ కార్డుల కంటే బంగారం తాకట్టు పెట్టి లోన్ పొందుతున్నారు. పర్సనల్ లోన్, క్రెడిట్ కార్డుల ద్వారా ఎక్కవ వడ్డీ పడుతుంది. అదే గోల్డ్ లోన్ తీసుకుంటే వడ్డీ తక్కువగా ఛార్జ్ చేస్తారు. అధిక వడ్డీ కంటే తక్కువ వడ్డీ పడుతున్నందున బంగారం తాకట్టుపెట్టి లోన్ తీసుకునేందుకు ముందుగా ఆలోచిస్తున్నారు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఇక్కడ క్రెడిట్ స్కోర్, ఇన్ కమ్ ఉండాల్సిన పని లేదు. దీంతో బంగారంపై లోన్ కి ఎలాంటి రిస్క్ ఉండదు. బంగారం విలువను బట్టి అందులో 70-85 శాతం లోన్ ఇస్తారు.
ఈఎంఐతో లోన్ చెల్లింపు..
ఇక బ్యాంకులు లోన్ కూడా త్వరగానే ఇస్తారు. ఆభరణాల నాణ్యత పరిశీలించి.. బ్యాంకులు గంటల వ్యవధిలోనే లోన్ మంజూరు చేస్తాయి. ఇతర పర్సనల్ లోన్, ఎడ్యుకేషన్ లోన్, వెహికిల్ లోన్ వంటి వాటితో పోలిస్తే.. గోల్డ్ లోన్ వడ్డీ రేట్లు చాలా తక్కువగా (కనీసం 10-18 శాతం ) ఉండనున్నాయి. బంగారు రుణాల చెల్లింపులపై ఈఎంఐ లేదా వడ్డీని నెలవారీగా కాకుండా 3/6 నెలలకు ఓసారి చెల్లించవచ్చు. అంతేకాకుండా లాస్ట్ పేమెంట్ లో అసలు చెల్లించే బుల్లెట్ పేమెంట్ ఆప్షన్ ద్వారా కూడా సెటిట్ మెంట్ చేసుకోవచ్చు.
ఇవి కూడా చదవండి:
Finance Minister Nirmala Sitharaman: భారత్‌కు బడా బ్యాంకులు కావాలి
Post Office: రోజుకు రూ. 200 మీది కాదనుకుంటే.. లక్షన్నర మీ సొంతం.. ఎలాగంటే..