August 2025 Bank Holidays: ఆగస్టులో 15 రోజులు బ్యాంకులకు సెలవులు.. ముందే ప్లాన్ చేసుకోండి
ABN , Publish Date - Jul 25 , 2025 | 07:53 AM
మీరు వచ్చే నెలలో అంటే ఆగస్టులో బ్యాంకు పనుల కోసం వెళ్లాలని చూస్తున్నారా. అయితే మాత్రం ఈ సెలవుల గురించి తప్పక తెలుసుకోండి. ఎందుకంటే ఆగస్టులో 15 రోజులు బ్యాంకులు బంద్ ఉండనున్నాయి.

మీరు ఆగస్టులో బ్యాంకు పనుల కోసం వెళ్లాలని అనుకుంటున్నారా? అయితే ముందు ఈ నెల బ్యాంకు సెలవుల (August 2025 Bank Holidays) వివరాలు తెలుసుకోండి. ఎందుకంటే ఈసారి ఆగస్టు నెలలో బ్యాంకులకు దాదాపు 15 రోజులు సెలవులు ఉన్నాయి. అంటే మిగతా 15 రోజులే బ్యాంకులు పని చేయబోతున్నాయి. ఈ సెలవుల్లో పండుగలు, ఆదివారాలు, రెండో, నాలుగో శనివారాలు కూడా ఉన్నాయి. అయితే ఈ సెలవులు రాష్ట్రాన్ని బట్టి మారవచ్చు. కాబట్టి మీ బ్యాంకు పనులను ముందుగానే ప్లాన్ చేసుకోండి, అవసరమైన పనులు చేసుకోవడంలో ఇబ్బంది కలగకుండా చూసుకోండి.
ఆగస్టు 2025లో బ్యాంకు సెలవుల పూర్తి జాబితా
3 ఆగస్టు 2025 - ఆదివారం దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
8 ఆగస్టు 2025 - టెండాంగ్లో రమ్ ఫట్ (సిక్కిం, ఒడిశా) కారణంగా హాలిడే
సిక్కిం, ఒడిశాలో ఈ రోజున ప్రత్యేక గిరిజన పండుగ జరుపుకుంటారు. ఇలాంటి పరిస్థితులో రెండు రాష్ట్రాలలో బ్యాంకులు బంద్ ఉంటాయి.
9 ఆగస్టు 2025 - రక్షా బంధన్ (ఉత్తర భారత రాష్ట్రాలు) రోజున హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, ఒడిశా, మధ్యప్రదేశ్, భువనేశ్వర్, గుజరాత్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో బ్యాంకులు మూసివేయబడతాయి.
10 ఆగస్టు 2025 - ఆదివారం దేశవ్యాప్తంగా బ్యాంకులకు హాలిడే
13 ఆగస్టు 2025 - దేశభక్తి దివస్ (మణిపూర్)
మణిపూర్‌లో ఈ రోజును ప్రత్యేక రాష్ట్ర స్థాయి పండుగగా జరుపుకుంటారు. అందువల్ల, ఇక్కడ బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉండవు.
15 ఆగస్టు 2025 – స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా సెలవు
దేశవ్యాప్తంగా జాతీయ సెలవుదినం కారణంగా ఈ రోజు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు మూసివేయబడతాయి.
16 ఆగస్టు 2025 – జన్మాష్టమి, పార్సీ నూతన సంవత్సరం సందర్భంగా గుజరాత్, మిజోరాం, మధ్య ప్రదేశ్, చంఢీగడ్, తమిళనాడు, ఉత్తరాఖండ్, సిక్కిం, తెలంగాణ, రాజస్థాన్, జమ్మూకశ్మీర్, ఉత్తర్ప్రదేశ్, బిహార్, ఛత్తీస్ గఢ్, జార్ఖండ్, మేఘాలయ, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల్లో సెలవు
17 ఆగస్టు 2025 - ఆదివారం దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
19 ఆగస్టు 2025 - మహారాజా బీర్ బిక్రమ్ కిషోర్ మాణిక్య బహదూర్ పుట్టినరోజు సందర్భంగా త్రిపురలో బ్యాంకులకు సెలవు
23 ఆగస్టు 2025 - నాలుగో శనివారం దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
24 ఆగస్టు 2025 - ఆదివారం దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
25 ఆగస్టు 2025 - శ్రీమంత శంకరదేవుని తిరుభావ తిథి నేపథ్యంలో అసోంలో బ్యాంకులకు హాలిడే
27 ఆగస్టు 2025 – గణేష్ చతుర్థి సందర్భంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఒడిశా, తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్ర, గోవా ప్రాంతాల్లో హాలిడే
28 ఆగస్టు 2025 – నువాఖై, గణేష్ చతుర్థి నేపథ్యంలో ఒడిశా, గోవా ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవు
31 ఆగస్టు 2025 - ఆదివారం దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
సకాలంలో పూర్తి చేసుకోండి
ఈ సెలవుల్లో, చెక్ క్లియరెన్స్, నగదు లావాదేవీలు, బ్యాంకుకు సంబంధించిన ఏదైనా ప్రభుత్వ పని లేదా డీడ్ సమర్పణలో ఆలస్యం జరగవచ్చు. కాబట్టి మీ పనులను ముందే ప్లాన్ చేసుకోవడం మంచిది. సెలవులు ఉన్నప్పటికీ ఆన్‌లైన్ బ్యాంకింగ్, UPI సేవలు, ATMలలో నగదు విత్ డ్రా వంటి వాటిని వినియోగించుకోవచ్చు.
ఇవి కూడా చదవండి
కస్టమర్ల ఖాతాల నుంచి కోట్ల రూపాయల దోపిడీ.. పరారీలో ఎస్‌బీఐ క్లర్క్
పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. ఈ మోసాల గురించి హెచ్చరిక..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి