Adani Group: హెల్త్‌కేర్‌లోకి అదానీ గ్రూప్
ABN , Publish Date - Jul 12 , 2025 | 03:28 AM
అదానీ గ్రూప్.. ఆరోగ్య సంరక్షణ హెల్త్‌కేర్ రంగంలోకి ప్రవేశిస్తోంది.

ముంబై, అహ్మదాబాద్‌ల్లో హాస్పిటల్స్ ఏర్పాటు
గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ వెల్లడి
ముంబై: అదానీ గ్రూప్.. ఆరోగ్య సంరక్షణ (హెల్త్‌కేర్) రంగంలోకి ప్రవేశిస్తోంది. ఇందులో భాగంగా ముంబై, అహ్మదాబాద్ నగరాల్లో అత్యాధునిక సదుపాయాలతో రెండు ఆస్పత్రులు ఏర్పాటు చేస్తోంది. ముంబైలో జరిగిన ఒక సదస్సులో అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ ఈ విషయం వెల్లడించారు. తాము ఏర్పాటు చేసే ఆస్పత్రుల్లో వ్యాధి నిర్ధారణ, చికిత్సల్లో కృత్రిమ మేధను ఎక్కువగా ఉపయోగించనున్నట్టు తెలిపారు. అనేక వ్యాధులకు ఒకేచోట చికిత్స అందించేలా ఈ ఆస్పత్రులు ఏర్పాటు చేస్తామన్నారు. అత్యవసర పరిస్థితులు, కొవిడ్ వంటి మహమ్మారులు వ్యాపించినప్పుడు ఈ ఆస్పత్రుల సామర్ధ్యాన్నీ వెంటనే విస్తరించవచ్చన్నారు. అందుబాటు ధరల్లో అత్యాధునిక వైద్య సేవలను అందరికీ అందుబాటులోకి తేవడమే తమ లక్ష్యమని అదానీ స్పష్టం చేశారు.